Home /News /trending /

JALLIKATTU TAMIL NADU BULL TRAINERS GEAR UP FOR JALLIKATTU AS PONGAL NEARS SU GH

Jallikattu: జల్లికట్లుకు సన్నద్ధమవుతున్న తమిళనాడు.. ఎద్దులకు ట్రైనింగ్ ఇస్తున్న శిక్షకులు

జల్లికట్టు(ఫైల్ ఫొటో)

జల్లికట్టు(ఫైల్ ఫొటో)

సంక్రాతి పండుగకు ప్రతి రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో రంగురంగుల ముగ్గులతో సందడి చేస్తుంటారు.

సంక్రాతి పండుగకు ప్రతి రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. తెలుగు రాష్ట్రాలు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో రంగురంగుల ముగ్గులతో సందడి చేస్తుంటారు. తమిళనాడులో పండుగకు కొన్ని రోజుల ముందునుంచే జల్లికట్టు సందడి మొదలవుతుంది. సంక్రాంతి సందర్భంగా ఎద్దులతో పోటీపడుతూ ఆడే జల్లికట్టు ఉత్సవానికి ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఇది తమిళుల సంప్రదాయ క్రీడ. పండుగ దగ్గరపడుతున్న నేపథ్యంలో మదురైలో జల్లికట్టు కోసం ఎద్దులకు శిక్షణ ఇచ్చేవారు సన్నద్ధమయ్యారు. దీనికి 10 రోజుల ముందుగానే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జల్లికట్టులో పాల్గొనే ఎద్దులతో పాటు ఆటగాళ్లకు కూడా వైద్య పరీక్షలు చేస్తారు. ప్రస్తుతం కరోనా ప్రభావం ఉన్నా, కొన్ని పరిమితులతో జల్లికట్టు నిర్వహించడానికి తమిళనాడు ప్రభుత్వం గత వారం అనుమతులు ఇచ్చింది. ఆ రాష్ట్రంలోని మధురై, చుట్టుపక్కల ప్రాంతాల్లో జనవరి 15 నుంచి 17 వరకు ఈ కార్యక్రమం జరగనుంది. ఒక్కో ఈవెంట్‌లో 150 కంటే ఎక్కువమంది ఉండకూడదని ప్రభుత్వం ఆదేశించింది. దీంతోపాటు COVID-19 నెగటివ్ వచ్చిన ఆటగాళ్లకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఈ ఆటలను చూడటానికి వచ్చే ప్రేక్షకుల సంఖ్యను కూడా 50 శాతానికి మాత్రమే పరిమితం చేశారు.

జల్లికట్టులో పాల్గొనేవారు ఎద్దులతో పాటు పరుగెడుతూ, వాటిని పట్టుకొని కింద పడకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది. గుంపులుగా పరుగెత్తే ఎద్దులతో ఆడటం సాహసమనే చెప్పాలి. జల్లికట్టులో పాల్గొనేవారు తీవ్రంగా గాయపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. దీంట్లో పాల్గొనే ఎద్దులకు మన్ కుతల్ (mann kuthal) అనే శిక్షణ ఇస్తారు. మధురైలోని అలంగనల్లూర్ గ్రామంలో నిర్వహించే జల్లికట్టుకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఇక్కడ జరిగే కార్యక్రమాలను చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ప్రస్తుతం జల్లికట్టు కోసం స్థానికులైన నివథన్, అతడి కుటుంబసభ్యులు ఐదు ఎద్దులను పెంచుతున్నారు. వీటిని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి శిక్షణకు తీసుకెళ్తున్నామని నివథన్ చెబుతున్నారు. వచ్చేవారం ఈ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి.

* ఎన్నో వివాదాలు
జల్లికట్టుపై గతంలో ఎన్నో వివాదాలు నెలకొన్నాయి. దీన్ని నిషేధించాలని ఎనిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA) సంస్థలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. దీంతో 2014లో సుప్రీంకోర్టు జల్లికట్టును నిషేధించింది. కానీ ఈ ఉత్సవాలు రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాల్లో ఒక భాగమని తమిళనాడు ప్రభుత్వం వాదించింది. సుప్రీంకోర్టు తీర్పును వ్యతిరేకిస్తూ ప్రజలు చెన్నైలో భారీగా ఆందోళనలు చేపట్టారు. అనంతరం కేంద్రం ప్రభుత్వం ఆర్డిరెన్స్‌తో జల్లికట్టుకు అనుమతులు ఇచ్చింది.
Published by:Sumanth Kanukula
First published:

Tags: Jallikattu, Pongal, Tamil nadu

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు