JAISHANKAR IS A REAL PATRIOT SAYS RUSSIAN FOREIGN MINISTER SERGEY LAVROV ON INDIA STANDING ITS GROUND ON FOREIGN POLICY PAH
Russian Foreign Minister: " జైశంకర్ నిజమైన దేశ భక్తుడు".. భారత విదేశాంగ మంత్రిపై రష్యా ప్రశంసలు..
భారత రష్య విదేశాంగ మంత్రులు
Russian Foreign Minister: భారతదేశ విదేశాంగ విధానంపై రష్యా ప్రశంసలు వర్షం కురిపించింది. అదే విధంగా భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ ను నిజమైన దేశ భక్తుడంటూ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీలావ్రోస్ కితాబిచ్చారు.
Russian Foreign Minister: భారతదేశ విదేశాంగ విధానంపై రష్యా ప్రశంసలు కురిపించింది. అలాగే భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్.. నిజమైన దేశభక్తుడంటూ రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ప్రశంసలతో ముంచెత్తారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యలో భారత్ తటస్థ వైఖరీ అవలంబిచడం, రష్యా నుంచి దిగుమతులు తగ్గించుకొవాలని చెప్పిన కూడా తనదేశం కోసం కఠిన నిర్ణయాలు తీసుకొవడం వంటివి భారత దేశ ప్రత్యేకతను చాటుతున్నాయి.
అదే విధంగా, ప్రపంచంలో ఏ ఇతర దేశాలు పాటించని విధంగా.. భారత్ మాత్రమే ప్రత్యేక విదేశాంగ విధానాన్ని అవలంభిస్తోంది. ఇక దౌత్య వ్యవహరాలను చాకచక్యంగా వ్యవహరిస్తోంది. దీన్ని నడిపించడంలో మంత్రి జైశంకర్ ముందుంటున్నారని సెర్గీ లావ్రోవ్ ప్రశంసించారు. ఈ క్రమంలో స్థానిక మీడియా సమావేశంలో.. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ భారత దేశ విదేశాంగ విధానం గురించి మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి దిగుమతులను తగ్గించుకోవాలంటూ ఒత్తిళ్లు ఎదురైనా భారత్ మాత్రం తన సొంత విదేశాంగ విధానంతో కీలక నిర్ణయం తీసుకోగలిగిందని ప్రశంసించారు.
భారత్ తమ దేశ ప్రజల మేలు కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకొవడానికి సిద్ధంగా ఉంటుందనేది స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ఏకంగా అగ్రరాజ్యం సూచనలు కూడా పక్కన పెట్టిందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ కొనియాడారు. ఇక భారత విదేశాంగ వ్వవహారాల మంత్రి జైశంకర్ వ్యవహరించిన తీరు అమోఘమని సెర్గీ లావ్ రోస్ అన్నారు. విదేశీ వ్యవహరంలో ఆయన నిజమైన దేశ భక్తుడని సెర్గీ లావ్ రోస్ పేర్కొన్నారు.
భారత్ తమ దేశ భద్రత కోసం, అభివృద్ధి కోసం తమ నిర్ణయాలను సూటిగా చెప్పింది. కానీ చాలా దేశాలు ఇలాంటివి చెప్పలేవని అని రష్యా మంత్రి అన్నారు. భారత్ తో తమకు చిరకాల మైత్రి ఉందని ఉన్నారు. దాదాపు 20 సంవత్సరాల కిత్రం నుంచి ఇరు దేశాల మధ్య స్నేహ పూర్వక సంబంధాలు ఉన్నాయని, అందుకే భారత్ 'వ్యూహాత్మక భాగస్వామ్యం' అని పిలిచామని సెర్గీ లావ్రోవ్ అన్నారు. అదే విధంగా భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశ పెట్టిన మేక్ ఇన్ ఇండియాకు తమ సహకారం ఉంటుందని అన్నారు.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.