హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Jaipur:వరల్డ్ వండర్ కిడ్..నాలుగేళ్లకే ఏం చేసిందో తెలుసా

Jaipur:వరల్డ్ వండర్ కిడ్..నాలుగేళ్లకే ఏం చేసిందో తెలుసా

(వరల్డ్ వండర్ కిడ్)

(వరల్డ్ వండర్ కిడ్)

World Wonder Kid: జైపూర్‌కి చెందిన నాలుగేళ్ల మనుశ్రీ సక్సేనా వరల్డ్‌ రికార్డ్ నెలకోల్పింది. అతి చిన్న వయసులో కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన చిన్నారిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. రెండేళ్ల సాధనలో అనేక జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించింది.

ఇంకా చదవండి ...

పువ్వు పుట్టగానే పరిమళించడం అంటే సామెత కాదు. జైపూర్‌కి చెందిన నాలుగేళ్ల చిన్నారిని చూస్తే ఖచ్చితంగా ఇలాంటి వాళ్లను చూసే చెప్పిన మాట అని ఒప్పుకుంటారు. జైపూర్‌(Jaipur)కి చెందిన మనుశ్రీ సస్కేనా (Manushree Saxena) వయసు నాలుగు సంవత్సరాలు (4Year Old girl . కాని ఈ చిన్నారిలోని టాలెంట్, ఆమె సాధించిన విజయాల గురించి చెప్పుకోవాల్సి వస్తే వరల్డ్‌లోనే ఏ చిన్నారి ఆమెకు పోటీ కాదని చెప్పాల్సి వస్తుంది. ప్రపంచంలోనే కరాటే బ్లాక్‌ బెల్ట్‌(karate black belt) సాధించిన అతి పిన్నవయసురాలిగా నాలుగేళ్ల మనుశ్రీ సక్సేనా పేరు గడించింది. అంతే కాదు ఇండియా బుక్ రికార్డ్స్‌(India Book of Records)తో పాటు ఆసియా బుక్‌ రికార్డ్స్‌(Asia Book of Records)లో చోటు దక్కించుకుంది. 2020లో జరిగిన టోక్యో గేమ్స్‌లో కరాటే పోటీలతో అడుగుపెట్టిన చిన్నారి ఇప్పుడు పతకాల సాధించడంలో దూసుకుపోతోంది. మనుశ్రీ సక్సేనా మార్షల్స్ ఆర్ట్స్‌లోనే కాదు డ్యాన్స్‌లో ఎంతో నైపుణ్యం కలిగిఉంది. ఓవైపు కరాటే శిక్షణతో పాటు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటూనే చదువులో కూడా రాణిస్తోంది. ఇంత చిన్న వయసులోనే బ్లాక్‌ బెల్ట్‌ సాధించిన వరల్డ్ వండర్‌ కిడ్ మనుశ్రీ సక్సేనా ఏకంగా భారత ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi)కి కూడా తాను కరాటే నేర్పిస్తానంటోంది. ప్రధాని దేశ శత్రువులతో పోరాడే విధంగా ఆయన్ని తర్ఫీదు ఇస్తానంటోంది చిన్నారి మనుశ్రీ సక్సేనా. నాలుగేళ్ల వయసు అంటే ఆటలు తప్ప వేరే ప్రపంచం తెలియని వయసు. అలాంటి బాల్య దశలో ఉన్న మనుశ్రీని ఇంట్లో తల్లిదండ్రులతో పాటు తాత, అమ్మమ్మలు ఆమెలో ఉన్న ఉత్సాహాన్ని, ఆసక్తిని ప్రోత్సహించడంతో చిన్నారి ఇప్పుడు చిచ్చరపిడుగులా కరాటే డ్రెస్ వేసుకొని బ్లాక్‌ బెల్ట్ పెట్టుకొని తన కంటే పెద్దవాళ్లపై తన పంచ్‌ పవర్‌ ఏంటో నిరూపించుకుంటోంది.

నాలుగేళ్లకే కరాటేలో బ్లాక్‌ బెల్ట్..

కేవలం రెండేళ్ల వయసులోనే మనుశ్రీకి కరాటేలో శిక్షణ ఇప్పించారు తల్లిదండ్రులు. ఆసియా కరాటే ఫెడరేషన్ కరాటే కోచ్ మహేష్ కయత్‌ దగ్గర మనుశ్రీ సోదరి తనుశ్రీ సక్సేనా కరాటే క్లాసులకు వెళ్తుండగా ఆమెతో వెళ్లి అక్కడ కిక్స్‌, పంచ్‌లు ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టింది. కరాటే నెర్చుకోవాలన్న మనుశ్రీ ఆసక్తిని గమనించిన కోచ్ ఆమెపై ప్రత్యేక శ్రద్ద చూపించారు. మనుశ్రీ మంచి కరాటే మాస్టర్ అవుతుందని గ్రహించి ఆమెకు మెరుగైన శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టారు. అలా కరాటేలో శిక్షణ పొందుతూనే అతి తక్కువ కాలంలో ఏ చిన్నారి సాధించని విజయాలను మనుశ్రీ సక్సేనా నాలుగేళ్లలో సాధించడం గర్వంగా ఉందని కోచ్, తల్లిదండ్రులు చెబుతున్నారు.


చిన్నారి కాదు చిచ్చరపిడుగు..

మనుశ్రీ సక్సేనా కరాటేలో ఇన్ని పతకాలు సాధించడం గొప్ప విషయంగా భావించిన కోచ్‌ ఆమె పేరును గిన్నీస్‌ బుక్‌ ఆఫ్ వరల్డ్‌ రికార్డులో చేర్చాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే మనుశ్రీకి సంబంధించిన పూర్తి వివరాలు గిన్నీస్‌ బుక్‌ ప్రతినిధులకు పంపినట్లు..త్వరలోనే ఆ అరుదైన రికార్డును కూడా చిన్నారి మనుశ్రీ సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మనుశ్రీ లాంటి చిన్నపిల్లల్లో కరాటే నేర్చుకోవాలన్న ఆసక్తిని ప్రోత్సహిస్తే ..దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులు వెలుగులోకి వస్తారని కోచ్‌ అభిలాషించారు.

First published:

Tags: Jaipur, VIRAL NEWS

ఉత్తమ కథలు