NewsRoundup: జగన్ తిరుమల పర్యటన, అలోక్ వర్మ వేటు, మరిన్ని టాప్ న్యూస్

తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ, అంతర్జాతీయంగా ఇవాళ జరిగిన ప్రధాన వార్తలను సంక్షిప్తంగా చూద్దాం.

news18-telugu
Updated: January 10, 2019, 10:55 PM IST
NewsRoundup: జగన్ తిరుమల పర్యటన, అలోక్ వర్మ వేటు, మరిన్ని టాప్ న్యూస్
టాప్ న్యూస్
news18-telugu
Updated: January 10, 2019, 10:55 PM IST
సీబీఐ వర్సెస్ సీబీఐ వివాదం మరో కొత్త మలుపు తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సీబీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మను మళ్లీ 48 గంటల్లో ఆ పదవి నుంచి పంపేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏకే సిక్రీ, కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ అలోక్ వర్మను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. Full Story

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అలిపిరి నుంచి కాలినడకన కొండపైకి వెళ్లిన ఏపీ విపక్ష నేత...సామాన్య భక్తుడిలానే వెంకన్న గుడిలోకి వెళ్లారు. సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు ధరించిన వైఎస్‌ జగన్‌ వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ గుండా స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఇతర భక్తులకు ఇబ్బంది కలుగకుండా సామాన్య భక్తుడిలా క్యూలైన్‌లో వెళ్లి ఆయన శ్రీవారి దర్శించుకున్నారు. Full Story

ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. సంక్రాంతి తర్వాత అంటే జనవరి 18న కొత్త మంత్రివర్గ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి కేసీఆర్. 18న శుక్రవారం నాడు ద్వాదశి రోహిణీ నక్షత్రం ఉండటం వల్ల అదే మంచి రోజు అని పండితులు కేసీఆర్‌కు సూచించినట్టు సమాచారం. Full Story

ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌ బాబు పెట్టుకున్న వీఆర్ఎస్(స్వచ్ఛంద పదవీ విరమణ)ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదించింది.   అశోక్ బాబు వంటి వారు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని ఓ సంధర్భంలో స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా వ్యాఖ్యానించడంతో... ఆయన పొలిటికల్ ఎంట్రీ టీడీపీతోనే అనే వార్తలు వినిపిస్తున్నాయి. Full storyభారత ఆర్మీ జనరల్ బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘భారత సైన్యంలో స్వలింగ సంపర్కులకు ప్రవేశం లేదు...’ అని తేల్చి చెప్పేశారు. వివాహేతర సంబంధాలు కొనసాగించే వారికి కూడా ఇక్కడ చోటు ఉండదని స్పష్టం చేశారు. Full Story

ఢిల్లీలో జరిగిన 32వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. రియల్ ఎస్టేట్, లాటరీ మీద వచ్చే సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం రూ.20లక్షల టర్నోవర్ కంటే తక్కువ ఉన్న వ్యాపార వర్గాలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంది. ప్రస్తుతం ఆ పరిధిని రూ.40లక్షలకు పెంచుతూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది.  Full Story

సంక్రాంతికి బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్‌తో కుమ్మేస్తదనుకున్న ‘పేట’ సినిమాకు తమిళ రాకర్స్ పెద్ద షాక్ ఇచ్చింది. విడులయిన రోజే ఆన్‌లైన్‌లో రిలీజ్ చేసింది. తమిళ రాకర్స్ పెట్టిన ‘పేట’ సినిమాను కొన్ని లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. మరోవైపు అజిత్ ‘విశ్వాసం’ సినిమాను కూడా తమిళ రాకర్స్ అటాక్ చేసారు.  Full Story
Loading...
ఆస్ట్రేలియా‌తో వన్డే,టీ20 సిరీస్‌లు ఖరారయ్యాయి. ఆరోన్ ఫించ్ సారధ్యంలోని ఆసీస్ టీమ్ భారత్‌‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా కంగారూ టీమ్ రెండు ట్వంటీ ట్వంటీ మ్యాచ్‌లతో పాటు ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. న్యూజిలాండ్‌తో సిరీస్ పూర్తైన తర్వాత ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.  Full Story
First published: January 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...