హాట్ బ్యూటీ.. జబర్దస్త్ యాంకర్ రష్మి హారర్ సినిమా ‘శివరంజని’ ట్రైలర్ విడుదల

tollywood: జబర్దస్త్ యాంకర్, హాట్ బ్యూటీ రష్మి గౌతమ్, నందు జంటగా నందినిరాయ్ మరో కీలక పాత్రలో నటించిన శివరంజని ట్రైలర్ ఈ రోజు విడుదల అయ్యింది. సెన్సేషనల్ డైరెక్టర్ వీవీ వినాయక్ దీన్ని విడుదల చేశారు. హారర్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఈ మూవీలో ఇతర పాత్రల్లో అఖిల్ కార్తీక్, ధన్ రాజ్, ఢిల్లీ రాజేశ్వరి నటిస్తున్నారు.

news18-telugu
Updated: May 15, 2019, 6:21 PM IST
హాట్ బ్యూటీ.. జబర్దస్త్ యాంకర్ రష్మి హారర్ సినిమా ‘శివరంజని’ ట్రైలర్ విడుదల
రష్మి గౌతమ్
news18-telugu
Updated: May 15, 2019, 6:21 PM IST
జబర్దస్త్ షోతో ప్రేక్షకులను అలరిస్తున్న యాంకర్ రష్మి గౌతమ్ నటించిన శివరంజని సినిమా ట్రైలర్ ఈ రోజు తిరుపతిలో విడుదల అయ్యింది. ప్రముఖ దర్శకుడు వీవీ వినాయక్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వీవీ వినాయక్ మాట్లాడుతూ.. ‘ ట్రైలర్ చాలా బావుంది. టైటిల్ ఆకట్టుకునేలా ఉంది. ఇప్పుడు వస్తోన్న హారర్ చిత్రాలకు భిన్నమైన కంటెంట్ ఈ సినిమాలో కనిపిస్తోంది. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను.’ అని తెలిపారు.దర్శకుడు నాగప్రభాకరన్ చిత్ర కంటెంట్ గురించి తెలియజేస్తూ.. హారర్ చిత్రాలు అనగానే మనకు గుర్తొచ్చే అంశాలకు భిన్నంగా కనిపించే కథ ఇదని చెప్పారు. ట్రైయాంగిల్ లవ్ స్టోరీ మధ్య నడిచే హారర్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయన్నారు.

సినిమా నిర్మాత పద్మనాభరెడ్డి మాట్లాడుతూ సెన్సేషనల్ డైరెక్టర్ వీవీ వినాయక్ గారి చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేయడం ఉత్సాహాన్నిచ్చిందని, శివరంజని తప్పకుండా నేటి ట్రెండ్ లో వస్తోన్న హారర్ చిత్రాల్లో భిన్నమైన సినిమాగా నిలుస్తుందని నమ్ముతున్నానని చెప్పారు. ఇక నుంచి మా బ్యానర్ లో మంచి కాన్సెప్ట్స్ ఉన్న చిత్రాలకు ఈ యేడాది మరిన్ని రాబోతున్నాయని, అవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనే నమ్మకం ఉందని తెలిపారు.
Loading...
First published: May 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...