ITS SO HOT IN ODISHA THAT A WOMAN ACTUALLY MADE A CHAPATI ON THE CAR BONNET GOES VIRAL PAH
Viral Video: వామ్మో.. ఈ ఎండ ఏందిరా బాబూ.. చూస్తుండగానే చపాతి అలా అయిపోయింది.. వైరల్ వీడియో..
చపాతి చేస్తున్న మహిళ
So Hot In Odisha: ప్రస్తుతం దేశంలో ఎండలు మండిపోతున్నాయి. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ప్రజలు తమ ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఇక.. ఎండ వేడిమికి మధ్యాహ్నం రోడ్లంతా నిర్మానుష్యంగా మారిపోతున్నాయి.
Woman Actually Made a Chapati On The Car Bonnet: సూర్యుడు నిప్పుల కొలిమిలా మండిపోతున్నాడు. సామాన్య ప్రజల నుంచి ప్రతి ఒక్కరు ఎండకు విలవిల్లాడుతున్నారు. అసలు.. ఉదయం తర్వాత.. బయటకు రావాలంటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఇప్పటికే ప్రజలు తమ ఇళ్లలో కూలర్ లు, ఫ్రిజ్ లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. షాపులలో కూడా మినికూలర్లు, ఏసీలను ఉపయోగిస్తున్నారు.
ఇక తప్పనిసరి ఎండలో బైటకు వెళ్తే.. కొబ్బరి బొండం,పుచ్చకాయలు, జ్యూస్ లు ప్రజలు తీసుకుంటున్నారు. ఇక కొందరు ఎండ ఎంత తీవ్రంగా ఉందో ప్రజలకు వెరైటీగా తెలియజేస్తున్నారు. ఇప్పటికే రోడ్డుపై ఆమ్లేట్ లు వేయడం వంటి వీడియోలు వైరల్ గా మారిన విషయం తెలిసిందే. తాజాగా, ఈ కోవలో మరో వీడియో వచ్చి చేరింది.
— NILAMADHAB PANDA ନୀଳମାଧବ ପଣ୍ଡା (@nilamadhabpanda) April 25, 2022
పూర్తి వివరాలు.. ప్రస్తుతం దేశంలో అత్యధికంగా హీట్ నమోదవుతుంది. కొన్ని ప్రాంతాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటే.. మరికొన్ని ప్రాంతాలలో దాదాపు.. 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు దాటిపోతున్నాయి. ఎండవేడిమికి మనుషులతో పాటు, నోరులేని మూగజీవాలు కూడా విలవిల్లాడి పోతున్నాయి. అయితే, ఇక్కడ ఒక మహిళ తమ ప్రాంతంలో ఉన్న ఎండ వేడిమి గురించి వినూత్నంగా చెప్పాలనుకుంది. దీనికోసం ఆమె.. ఒక ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుంది.
ఒడిశాలో గత కొన్ని రోజులుగా బండలు కూడా పగిలే విధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో అక్కడి వారు తెగ ఇబ్బంది పడుతున్నారు. దీంతో సోనేపూర్ లో ఒక మహిళ తాము.. ఎదుర్కొంటున్న హీట్ ను వెరైటీగా తెలిపింది. సాధారణంగ చపాతీని చేసి.. దాన్ని గ్యాస్, పోయ్యి మీద కాలుస్తారు. అయితే,ఆమె ఒక కారులో మీద చపాతిని కాల్చింది. అట్ల కర్ర తీసుకుని .. కారు ముందు భాగంలో చపాతిని పెట్టి దాన్ని పైన కింద కాల్చింది. ఇప్పుడు ఈ ఫన్నీ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.