Video : ఆస్ట్రేలియాలో అరుదైన దృశ్యం... మంచులో కంగారూలు...

Australia : విపరీతంగా కురుస్తున్న మంచులో ఎటు వెళ్లాలో తెలియక కంగారూలు కన్‌ఫ్యూజ్ అవుతున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 15, 2019, 11:25 AM IST
Video : ఆస్ట్రేలియాలో అరుదైన దృశ్యం... మంచులో కంగారూలు...
విపరీతంగా కురుస్తున్న మంచులో ఎటు వెళ్లాలో తెలియక కంగారూలు కన్‌ఫ్యూజ్ అవుతున్నాయి. (Image - Twitter - Stephen Grenfell)
Krishna Kumar N | news18-telugu
Updated: August 15, 2019, 11:25 AM IST
ఆస్ట్రేలియాలో... సిడ్నీ, కాన్ బెర్రా లాంటి సిటీలను పక్కన పెడితే... ఎడారులు, అడవులు, గడ్డి మైదానాలు, వాటిలో కంగారూల పరుగులు... మనకు చాలా సినిమాల్లో కనిపిస్తుంటాయి. ఐతే... ఆస్ట్రేలియా ఎడారుల్లో మంచు కురుస్తున్న దృశ్యాల్ని మనం ఎప్పుడూ ఊహించి ఉండం. ఎందుకంటే అలాంటి వాతావరణం అక్కడ అరుదుగా కనిపిస్తుంది. తాజాగా అక్కడ మంచు కురవడంతో... ఆ మంచులో పరిగెడుతూ కంగారూలు... అటూ ఇటూ వెళ్తున్నాయి. ఆస్ట్రేలియా దక్షిణాన న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా, క్వీన్స్‌లాండ్‌లో మంచు నేలపై పొరలా అల్లుకుంది. దాంతో... ఎప్పుడూ అడవుల్లో ఫుల్ క్లారిటీతో వెళ్లే కంగారూలు... ఇప్పుడు మంచులో ఎటు వెళ్తున్నాయో తెలియక... ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక కన్‌ఫ్యూజ్ అవుతున్నాయి.


గోల్బర్న్ ఏరియాలో గొర్రెల పెంపకాలు ఎక్కువ. అక్కడ ఇప్పుడు మంచు కురుస్తున్న వేళ కంగారూలు పరుగులు పెడుతూ కనిపించాయి. స్టీఫెన్ గ్రెన్ఫెల్... ఆ దృశ్యాన్ని వీడియో తీసి... ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అఫ్‌కోర్స్ చాలా వైరల్ వీడియోల్లాగే అదీ వైరల్ అయ్యింది.

First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...