ఆకాశం నుంచి వర్షం కురవాలి కానీ అక్కడ పురుగులు కురుస్తున్నాయి.. గతంలో వడగళ్లు, రాళ్లు పడిన ఘటనల గురించి విన్నాం కానీ.. అక్కడ మాత్రం పురుగులు మీద పడిపోతున్నాయి. రోడ్లన్నీ పురుగులతోనే నిండిపోతున్నాయి. కరోనా తర్వాత చైనా(China) అంటేనే దరిద్రాలకు అడ్డా అని ప్రపంచం చర్చించుకుంటున్న కాలమిది.. ఏదైనా వింత జరిగితే.. ఏదైనా ఊహించనది జరిగితే అది ముందుగా చైనాలోనే జరుగుతుందని జనాలు ఫిక్స్ ఐపోయారు. ఇలా ఆకాశం నుంచి పురుగులు పడ్డది కూడా చైనాలోనేనట..! దీనిపై ప్రముఖ అమెరికా సంస్థ ఓ కథనం ప్రచురించింది. అయితే దీనిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇలా ఎందుకు జరుగుతుంది?
బీజింగ్ రోడ్డుపై నిలిచిన కార్లపై ఆకాశం నుంచి వర్షంతో పాటు పెద్ద సంఖ్యలో పురుగులు(worm rain) పడినట్లు న్యూయార్క్ పోస్ట్ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే ఇలా పడటానికి కొన్ని కారణాలను విశ్లేషిస్తున్నారు నిపుణులు. భారీ గాలులకు బురదలోని పురుగులు పైకి కొట్టుకెళ్లి వర్షంతో పాటు ఇలా పడి ఉంటాయని సైంటిఫిక్ జర్నల్ మదర్ నేచర్ నెట్వర్క్ తెలిపినట్లు చెప్పింది. తుపాను తర్వాత వీచే భారీ గాలుల్లో పురుగులు, కీటకాలు చిక్కుకున్నప్పుడు ఇలాంటి ఘటనలు జరుగుతాయని జర్నల్ చెబుతోంది. చైనాలో పురుగుల వర్షానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్‌ను ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోందిది. పురుగులు మీద పడకుండా ఉండేలా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించినట్టు ప్రచారం జరుగుతోంది. పురుగులు తమపై పడకుండా ఉండేందుకు కొందరు వ్యక్తులు గొడుగులు వినియోగిస్తూన్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఇక పురుగుల వాన పడుతుండటంతో జనాలు బెంబేలెత్తిపోతున్నారట. ఇంట్లో ఉండే హాహా కారాలు చేస్తున్నారట. బయటకెళ్లాలంటేనే జంకుతున్నారట. అయితే ఇదంతా అమెరికా వెర్షన్ న్యూస్. చైనా మాత్రం ఈ న్యూస్‌ను ఖండిస్తోంది.
WATCH ???? China citizens told to find shelter after it looked like it started to rain worms pic.twitter.com/otVkuYDwlK
— Insider Paper (@TheInsiderPaper) March 10, 2023
ఇదంతా ఫేక్:
పురుగుల వర్షం వీడియోలు ఓవైపు సోషల్‌మీడియాలో ఫుల్‌గా వైరల్ అవుతుండగా.. మరోవైపు చైనా ఈ వీడియోలను ఫేక్ అని కొట్టిపారేసింది. చైనా జర్నలిస్ట్ షేన్ షివే ఈ న్యూస్‌ను ఖండించారు. పురుగుల వర్షం వీడియో ఫేక్ అని తెలిపారు. బీజింగ్ నగరంలో ఇటీవలి కాలంలో ఎలాంటి వర్షాలు కురవలేదని చెప్పారు. అసలు వర్షమే పడనప్పుడు.. ఇక తుపాను, పురుగుల వర్షం ఎక్కడ నుంచి పడుతుందో తనకైతే అర్థం కావడంలేదన్నారు. దీంతో ఈ వీడియో అసలైనదా కాదా అని నెటిజన్లు అయోమయంలో పడ్డారు. మరికొందరూ మాత్రం దొరికిందే ఛాన్స్ అన్నట్లు చైనాపై విమర్శలు గుప్పిస్తున్నారు. చైనాలో పురుగులు తింటారని.. అందుకే పురుగుల వర్షం కురిసిందంటూ కామెంట్లు పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: China, Rain, Viral Video