మంచులో గడ్డకట్టిన బట్టలు... తెగ నవ్విస్తున్న వైరల్ వీడియో...

వైరల్ వీడియోలన్నీ నవ్వు తెప్పించవు. ఈ వీడియో మాత్రం వాటికి భిన్నంగా ఉంది. దీన్ని చూసిన వాళ్లంతా పగలబడి నవ్వుతున్నారు.

news18-telugu
Updated: January 20, 2020, 11:51 AM IST
మంచులో గడ్డకట్టిన బట్టలు... తెగ నవ్విస్తున్న వైరల్ వీడియో...
మంచులో గడ్డకట్టిన బట్టలు... తెగ నవ్విస్తున్న వైరల్ వీడియో... (credit - YT - Joshua the Cat)
  • Share this:
అది కెనడా లోని కాల్గరీ (Calgary) ఒకటే మంచు. ఎటు చూసినా మంచే. రోడ్లు, చెట్లు, ఇళ్లూ అన్నీ మంచుతో కప్పుకుపోయాయి. మంచు ఎంత తీవ్రంగా కురిసిందంటే... కనిపించిన దేన్నీ వదలకుండా అన్నింటినీ గడ్డ కట్టేలా చేసేసింది. ఐతే... కొందరు ఆ మంచులో బట్టలు ఆరేసుకున్నారు. అవి కూడా గడ్డ కట్టేశాయి. కొద్దిగా కూడా వాటిని వంచే పరిస్థితి లేదు. అంతలా గడ్డకట్టాయి. ఇక వాటిని ఎలా మెత్తబరచాలో తెలియక వాళ్లు... వాటితో ఫ్రిస్బీ గేమ్ ఆడుకున్నారు. అందుకు సంబంధించిన 30 సెకండ్ల వీడియో వైరల్ అవుతోంది. ఇప్పటికే దాన్ని దాదాపు లక్ష మంది దాకా చూశారు. చూసిన వాళ్లంతా తెగ నవ్వుకుంటూ... షేర్ చేసుకుంటున్నారు. మరి ఆ వీడియోని మీరూ చూసి నవ్వుకోండి.First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు