Watch Video: ‘మంచు కొండ‘కి ఎండ తగలకుండా దుప్పట్లు కప్పుతున్నారు.. కామెడీ కాదు నిజంగానే.. ఇదిగో

మంచుకొండకు దుప్పట్లు (Miguel Medina / AFP)

వేగంగా కుంచించుకుపోతున్న నార్త్​ ఇటలీలోని ప్రెసేనా హిమానీనదంను కాపాడటానికి పొడవాటి వస్త్రాలతో మంచు తెరలను కప్పారు. ఇలా చేయడం వల్ల సూర్యకిరణాలు మంచుపై నేరుగా పడకుండా ఆపొచ్చని.. తద్వారా మంచు కరగడాన్ని నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

  • Share this:
బాగా చలిగా ఉంటే ఏం చేస్తాం.. దుప్పటి కప్పుకొని పడుకుంటాం. మరి చల్లగా ఉండే మంచుకే దుప్పటి కప్పితే ఎలా ఉంటుంది?.. ఈ ఆలోచన వింతగా అనిపించినా దీన్ని చేసి చూపించారు ఇటలీ వాతావరణ శాస్త్రవేత్తలు. వేగంగా కుంచించుకుపోతున్న నార్త్​ ఇటలీలోని ప్రెసేనా హిమానీనదంను కాపాడటానికి పొడవాటి వస్త్రాలతో మంచు తెరలను కప్పారు. ఇలా చేయడం వల్ల సూర్యకిరణాలు మంచుపై నేరుగా పడకుండా ఆపొచ్చని.. తద్వారా మంచు కరగడాన్ని నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ పద్దతి ద్వారా వేసవిలో 70 శాతం మంచును కరగకుండా కాపాడుకోవచ్చని భావిస్తున్నారు. ఇటలీలోని 1,20,000 చదరపు మీటర్ల విస్తీర్ణం గల విశాలమైన మంచు కొండను.. 5 మీటర్ల వెడల్పు, 70 మీటర్ల పొడవైన వస్త్రాలతో కప్పి ఉంచారు. దీనికి సంబంధించిన వీడియోను ఆన్​లైన్​లో షేర్​ చేశారు శాస్త్రవేత్తలు.

2008 నుంచి ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. అయితే, మొత్తం మంచు కప్పడానికి మరో నెల రోజుల సమయం పడుతుందని చెబుతున్నారు. గ్లోబల్​ వార్మింగ్ పుణ్యామా అని ప్రపంచవ్యాప్తంగా మంచుకొండలు కరిగిపోతున్నాయి. సముద్ర నీటి మట్టం అమాంతం పెరుగుతోంది. అందుకే మంచు కొండలను కాపాడుకోవాలనే లక్ష్యంతో రాబోయే రోజుల్లో, ఎటువంటి ఉపద్రవం రాకుండా ఉండేందుకు ఇలా చేస్తున్నట్లు ట్రెంటో సైన్స్ మ్యూజియానికి చెందిన హిమానీనద శాస్త్రవేత్త క్రిస్టియన్ కాసారోట్టో చెప్పారు.

ఉపద్రవాన్ని గుర్తు చేసిన చమోలి ఘటన..
మంచు కొండలు కరిగిపోతున్న సమస్య ఒక్క ఇటలీలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఫిబ్రవరి నెలలో ఉత్తరాఖండ్​ చమోలి జిల్లాలో ప్రఖ్యాత నందా దేవి హిమానీనదం విరిగిపోయిన సంగతి తెలిసిందే. ఇది ధౌలిగంగా, అలకనంద నదీ తీర ప్రాంతాల్లో భారీ వరదలకు కారణమైంది. మంచు కరిగి పోవడంతో కొండచరియలు విరిగి ఇళ్లు నాశనం అయ్యాయి. దీంతో అనేక మంది చనిపోయారు. అంతేకాదు చమోలి జిల్లా పరిసరాల్లో రెండు జల విద్యుత్ ప్రాజెక్టులు దెబ్బతిన్నాయి.


వాతావరణ మార్పు కారణంగా హిమాలయ మంచు వేగంగా కరిగిందని, తద్వారా కొండచరియలు విరిగి ఇంతటి ఉపద్రవం సంభవించిందని అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ ఘటనకు సంబంధించిన పరిశోధనా విషయాలను "హిమాలయ-కరాకోరం గ్లాసియో-హైడ్రాలజీ" అనే సైన్స్​ జర్నల్‌​లో ప్రచురించారు. అధ్యయనం ప్రకారం హిమానీనదాల మంచు కరిగి పోవడం వల్ల హిమాలయ- కరాకోరం (హెచ్‌కె)లోని సింధూ, గంగా, బ్రహ్మపుత్ర వంటి నదుల నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
Published by:Ashok Kumar Bonepalli
First published: