హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

ఓమైగాడ్.. నడి సముద్రంలో భయానకం.. బోట్ పై తిమింగలం దాడి.. వైరల్ వీడియో..

ఓమైగాడ్.. నడి సముద్రంలో భయానకం.. బోట్ పై తిమింగలం దాడి.. వైరల్ వీడియో..

బోట్ మీద దాడిచేస్తున్న తిమింగిలం

బోట్ మీద దాడిచేస్తున్న తిమింగిలం

Viral video: మసాచు సెట్స్ తీరంలో ఆదివారం షాకింగ్ ఘటన జరిగింది. వైట్ హార్స్ బీచ్ ప్రాంతంలో.. ప్లైమౌత్ లో ఉన్న ఒక బోట్ సముద్రంలో ప్రయాణిస్తుంది. అప్పుడు ఎవరు ఊహించని ఘటన జరిగింది.

కొన్ని సార్లు సముంద్రంలో షాకింగ్ ఘటనలు జరుగుతుంటాయి. మనం అప్పుడుడప్పుడు వార్తలలో సొరచెపలు, తిమింగలాలు, ఒడ్డుకు కొట్టుకొని రావడం వంటి ఘటనలు చూస్తుంటాం. మరికొన్ని సార్లు.. అవి నీళ్లలో ఉన్నవారిపైన దాడులు కూడా చేస్తుంటాయి. సొరచేపలు మనిషిపై దాడులు చేస్తుంటాయి. పొరపాటున మనం నీళ్లలో వాటికి చిక్కితే.. ఇక అంతే సంగతులు. మనిషిని కరకర నమిలి తినేస్తుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. అమెరికాలోని మసాచుసెట్స్ తీరంలో ఊహించని ఘటన జరిగింది. ప్లైమౌత్‌లోని వైట్ హార్స్ బీచ్ ప్రాంతంలో ఉదయం 10 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని ఒక నివేదికలో పేర్కొంది. కొంత మంది సముద్రంలో బోట్ పైన ప్రయాణిస్తున్నారు. అప్పుడు అనుకొని సంఘటన జరిగింది. అప్పుడు.. ఒక పెద్ద తిమింగిలం ఎగిరి.. బోట్ పైన పడింది.

బోట్ దాదాపు.. 19 అడుగుల పెద్దదిగా ఉంది. అక్కడున్న వారు భయంతో వణికిపొయారు. పొరపాటున.. వేల్ ధాటికి బోట్ బోల్తా పడుంటే.. తమపరిస్థితి ఏంటని అనుకుంటున్నారు. అయితే.. తీరంలో ఉన్న ఒక వ్యక్తి మసాచు సెట్స్ సముంద్రం అందాలను రికార్డుచేస్తుండగా దానిలో ఈ ఘటన రికార్డు అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గామారింది.

ఇదిలా ఉండగా.. ఏనుగులు చాలా ఫన్నీగా ప్రవర్తిస్తుంటాయి.

కొన్ని సార్లు వాటి ప్రవర్తన తెగ నవ్వు తెప్పిస్తుంటుంది. కొంత మంది మావటి వాళ్లు, ట్రైనర్స్ ఏనుగులను తమ ఇంట్లోనే పెంచుకుంటారు. తమ ఇంట్లోని ఒక వ్యక్తిలాగ చూసుకుంటారు. మెయిన్ గా గున్న ఏనుగులు (Elephant)  చాలా ఫన్నీగా ప్రవర్తిస్తుంటాయి. అవి పరిగెత్తుకుంటూ వెళ్లడం, ఏదైన బాల్ ను తన్నడం లాంటివి చేస్తుంటాయి. ఈ మధ్య కాలంలో ఏనుగుల ఫన్నీ వీడియోలు కొన్ని వైరల్ గా (Viral videos)  మారాయి.

నీటిలో కొట్టుకుపోతున్న వ్యక్తిని , ఒక గున్నఏనుగు వెళ్లి కాపాడుతుంది. మరికొన్ని చోట్ల ఏనుగులు.. గోడలను పగల కొట్టి.. కిచెన్ లోకి ప్రవేశించి, అక్కడ ఉన్న పదార్థాలను తింటుంటాయి. అదే విధంగా.. కొన్ని చోట్ల ఏనుగులు గ్రామాలపైకి, రోడ్డుపైన వెళ్తున్న వారిపైన దాడులకు పాల్పడిన సంఘటనలు అనేకం ఉన్నాయి. అదే విధంగా, ఏనుగులు కొన్నిసార్లు.. ఫన్నీగాను ప్రవర్తిస్తుంటాయి. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. థాయిలాండ్ లో (Thailand)  ఫన్నీ ఘటన జరిగింది. చియాంగ్ మయి సిటిలో ఉన్న ఒక రిసార్ట్ లో ఇది జరిగింది. ఒక యువతి.. లోకల్ గా ఉన్న రిసార్ట్ లో కిటికి పక్కన పడుకుంది. ఈ క్రమంలో.. కిటికి దగ్గరకు ఒక ఏనుగు వచ్చింది. మెల్లగా కిటికి నుంచి తుండాన్ని దూర్చింది. అక్కడ పడుకుని ఉన్న మహిళ నడుమును తట్టింది. అంతటితో ఆగకుండా.. తన తుండంతో గాలిని ఉదుతూ.. ఆమె నిద్రను చెడగొట్టింది. యువతి.. ఎవరో తడుతున్నట్లు భావించింది. వెంటనే.. దుప్పటి తీసి చూసింది. అప్పుడు కిటికి నుంచి ఏనుగు తుండం కన్పించింది.

వెంటనే ఆమె షాక్ నకు గురైంది. బెడ్ మీద లేచి కూర్చుని ఏనుగువైపుకు చూస్తు ఉండిపోయింది. ప్రస్తుతం ఈ వీడియోను (Video) సాక్షి జైన్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేశారు. దీంతో ఇది కాస్త వైరల్ గా (Viral video) మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. వామ్మో.. ఇదేం రా నాయన అంటూ కామెంట్ లను పెడుతున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Viral Video

ఉత్తమ కథలు