Home /News /trending /

IT WAS HARD TO BELIEVE MAN WINS 250000 IN LOTTERY USING NUMBERS HE SAW IN DREAM PAH

అదృష్టం అంటే ఇతడిదే.. కలలో కన్పించిన నంబర్ కు భారీ లాటరీ.. ఎంతంటే..

లాటరీ  గెలుచుకున్న కోల్ మాన్

లాటరీ గెలుచుకున్న కోల్ మాన్

America: వ్యక్తికి కలలో లాటరీ టికెట్ తగిలినట్లు కల పడింది. అంతే కాకుండా లాటరీ నంబర్ కూడా కన్పించింది. వెంటనే పొద్దునే లేచాడు. అక్కడ దగ్గరలో ఉన్న షాప్ లకు వెళ్లాడు.

కొన్ని సార్లు.. మనం ఉదయం పడే కలలు నిజమవుతాయని పెద్దలు తరచుగా ఉంటుంటారు. అందుకే సూర్యదయం కంటే కొన్ని గంటల ముందు పడే కలలు నిజమవ్వడానికి అవకాశాలు ఎక్కువ అని చాలా మంది నమ్ముతుంటారు. మరికొందరు ఏవి పనులు చేయకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండేలా చూస్తుంటారు. దీంతో వీరు గొప్ప స్థానానికి వెళ్లాలని కలలు కంటుంటారు. కానీ ప్రయత్నాలు మాత్రం చేయరు. అందుకే వీరికి పడే కలలను పగటి కలలు అంటారు. అయితే, కొందరకి మాత్రం లక్ కలిసి వస్తుంటుంది. కలలో ఏమైన అనుకుంటే అవి వెంటనే జరిగిపోతుంది. ఈ కోవకు చెందిన ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. యూఎస్ లో (America)  ఒక వ్యక్తి నక్కతోకను తొక్కినట్టున్నాడు. వర్జీనియా కు చెందిన అలోంజో కోల్ మాన్ అనే వ్యక్తికి లాటరీ టికెట్ లు (lottery ticket)  కొనడం అంటే ఎంతో ఆసక్తి. దీంతో అతనికి కలలో ఒక నంబర్ కన్పించింది. వెంటనే ఉదయం లేవగానే.. షాక్ కువెళ్లి అదే నంబర్ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.



ఈ క్రమంలో. జూన్ 11 న డ్రా తీశారు. అందులో అతను.. దాదాపు.. 250,000 డాలర్లు గెలుచుకున్నాడు. మొదట అతను నమ్మలేకపోయాడు. ఆ తర్వాత.. తన నంబర్ ను చూసుకుని.. ఆనందంతో పొంగిపోయాడు. తనకు కలలో కన్పించిన నంబర్ ను తీసుకున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ ఘటన నెట్టింట (Social media)  వైరల్ గా మారింది.

ఇదిలా ఉండగా అమెరికాలో తుఫాను సమయంలో లేదంటే బాగా వర్షం పడుతున్న సమయంలో... అప్పుడప్పుడు ఆకాశం నుంచి చేపలు పడుతుంటాయి.

వడగళ్ల పాటు చేపలు, కప్పలు భూమిపై కురుస్తుంటాయి. ఈసారి శాన్‌ఫ్రాన్సిస్కోలో పడ్డాయి. సీగల్‌, పెలికాన్‌లు వంటి కొన్ని పెద్ద పక్షులు దీనికి కారణమని అక్కడి ప్రజలు నమ్ముతుంటారు. శాన్ ఫ్రాన్సిస్కో సముద్ర ప్రాంతం కాబట్టి ఇక్కడ చేపల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది. సీగల్స్ , పెలికాన్ అనే పక్షులు వీటిని తింటాయి. చేపలను తినేందుకు పెద్ద మొత్తంలో ఈ పక్షలు కూడా సముద్రతీరానికి వస్తుంటాయి. సముద్రంలో ఉండే చేపలను వేటాడి తింటాయి.

SFGate ప్రకారం.. ఈ పక్షులకు పెద్ద మొత్తంలో చేపలు లభ్యమైనప్పుడు... కొత్త చేపలను పట్టుకునే ప్రయత్నంలో... పాత చేపలను ఈ పక్షులను వదిలించుకుంటాయి. వేరొక ప్రాంతంలో వాటిని పడేస్తాయి. అలా భూభాగంపై అప్పుడు చేపలు కనిపిస్తుంటాయి. చేపల వర్షానికి ఇది కూడా ఒక కారణం. కానీ ఇదే ప్రధానమైనది కాదు. చేపల వర్షం కూడా  నిజంగానే కురుస్తుంది. అందువల్లే అప్పుడప్పుడూ పంట పొలాల్లో చేపలు పడుతుంటాయి.
Published by:Paresh Inamdar
First published:

Tags: America, Lottery, VIRAL NEWS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు