పారిశ్రామిక వేత్త మేఘా కృష్ణారెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు..

మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి ఐటీ రిటర్న్స్‌పై అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో మేఘా కృష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచే ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు.

news18-telugu
Updated: October 11, 2019, 11:58 AM IST
పారిశ్రామిక వేత్త మేఘా కృష్ణారెడ్డి ఇల్లు, ఆఫీసుల్లో ఐటీ సోదాలు..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 11, 2019, 11:58 AM IST
మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్(మెయిల్) కంపెనీకి సంబంధించి ఐటీ రిటర్న్స్‌పై అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త పిచ్చిరెడ్డి పామిరెడ్డి, మేఘా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో అర్ధరాత్రి 12 గంటల నుంచే ఏకకాలంలో ఐటీ అధికారులు సోదాలు ప్రారంభించారు. మేఘా కంపెనీకి సంబంధించి దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై సహా 30 చోట్ల, హైదరాబాద్‌లో నాలుగు చోట్ల, గెస్ట్ హౌజ్‌లో సోదాలు నిర్వహిస్తున్నారు. బాలానగర్‌, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్‌‌లో ఉన్న కార్యాలయాలతో పాటు ఎంసీహెచ్‌ఆర్డీ సమీపంలోని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇంకా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి.

దేశంలో పలు భారీ ప్రాజెక్టులు కాంట్రాక్టులను నిర్వహిస్తోంది మేఘా సంస్థ. తెలుగు రాష్ట్రాల్లోనూ అనేక భారీ ప్రాజెక్టులు మేఘా సంస్థే చేపట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు, జార్ఖండ్, మహారాష్ట్ర, ఏపీల్లో భారీ విద్యుత్తు ప్రాజెక్టులను కలిగి ఉంది. మధ్యప్రదేశ్‌లో ఖార్గోన్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును కూడా మెయిల్ నిర్వహిస్తోంది.మెయిల్ గ్రూప్ కింద మొత్తం 12 కంపెనీలు ఉన్నాయి. విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, నీటిపారుదల, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రవాణా రంగాలలో ఈ కంపెనీ పనిచేస్తోంది. రైల్వే, విమానాశ్రయాలు, ఓడరేవుల రంగంలో కంపెనీ విస్తరిస్తోంది.

ఇదిలా ఉండగా, ఐటీ సోదాలపై మేఘా కృష్ణారెడ్డి స్పందించారు. తమ ఆఫీసు, ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయని వెల్లడించారు. అధికారులు చేసినవి సోదాలు మాత్రమేనని, దాడులు కాదని ఆయన స్పష్టం చేశారు. గత 20 ఏళ్లుగా సాగుతున్న రెగ్యులర్ సోదాల్లో భాగంగానే తమ ఆఫీసులో, ఇళ్లలో సోదాలు నిర్వహించారని ఆయన స్పష్టం చేశారు. అయితే, హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంలోనే సోదాలు జరిగాయని, దేశవ్యాప్తంగా జరగలేదని వివరించారు.

First published: October 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...