హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

PUBG Mobile India: భారత్‌లో PUBG గేమ్‌కు అనుమతులు వచ్చాయా?.. ఐటీ శాఖ కీలక ప్రకటన

PUBG Mobile India: భారత్‌లో PUBG గేమ్‌కు అనుమతులు వచ్చాయా?.. ఐటీ శాఖ కీలక ప్రకటన

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

PUBG గేమ్ ప్రియులకు ఒక బ్యాడ్ న్యూస్. ఈ మొబైల్ గేమ్‌ భారత్‌లో ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపించట్లేదు.

PUBG గేమ్ ప్రియులకు ఒక బ్యాడ్ న్యూస్. ఈ మొబైల్ గేమ్‌ భారత్‌లో ఇప్పట్లో అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపించట్లేదు. సాధ్యమైనంత త్వరలోనే భారత్‌లో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని PUBG కార్పొరేషన్ ఎప్పటినుంచో చెబుతోంది. కానీ దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వలేదని తాజాగా తెలిసింది. పబ్జీ గేమ్‌కు అనుమతులపై సమాచార హక్కు చట్టం కింద అందిన రెండు దరఖాస్తులకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సమాధానం ఇచ్చింది. వెబ్‌సైట్, మొబైల్ యాప్, ఇతర సర్వీస్‌లలో ఈ గేమ్‌కు ఎలాంటి అనుమతులూ ఇవ్వలేదని అధికారులు స్పష్టం చేశారు. గూగుల్, యాపిల్ సంస్థల యాప్ స్టోర్స్ ద్వారా భారతదేశంలో ప్రవేశించడానికి పబ్జీ మొబైల్ ఇండియాకు అధికారులు అనుమతులు ఇచ్చారో లేదో చెప్పాలని RTI కింద కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్ శాఖకు రెండు దరఖాస్తులు అందాయి. వీటిని మీడియానామా, జిఇఎం ఎస్పోర్ట్స్ సంస్థలు దాఖలు చేశాయి.

* అనుమతులు తప్పనిసరి

గతంలో ఉన్న మొబైల్ గేమ్‌కు మార్పులు చేర్పులు చేసి ప్రత్యేకంగా భారత్‌ కోసమే సరికొత్త ‘PUBG మొబైల్ ఇండియా’ గేమ్‌ను అభివృద్ధి చేస్తున్నామని పబ్జీ కార్పొరేషన్ చాలాసార్లు ప్రకటించింది. కానీ ఈ సంస్థకు మన దేశంలో అవరోధాలు ఎదురవుతూనే ఉన్నాయి. చైనా మూలాలున్న పబ్జీ కార్పొరేషన్‌ను మనదేశం నిషేధించింది. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశాలు ఉన్నాయనే కారణాలతో చైనాకు చెందిన యాప్‌లను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ లిస్ట్‌లో పెట్టింది. చట్ట ప్రకారం అనుమతులు లభిస్తేనే PUBG మన దేశంలో మళ్లీ అందుబాటులోకి వస్తుంది.

* మార్పులు చేసింది.. కానీ...

భారత్‌లో గేమ్‌ను లాంచ్ చేయడానికి PUBG కార్పొరేషన్ కొత్తగా ‘పబ్జీ మొబైల్ ఇండియా’ సంస్థను ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపింది. కస్టమర్ల డేటాను దేశీయంగానే స్టోర్ చేస్తామని భరోసా ఇచ్చేందుకు అజూర్ క్లౌడ్, మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం కూడా చేసుకుంది. గేమ్‌లో నేక్‌డ్ అవతార్‌లు, గ్రీన్‌ హిట్ ఎఫెక్ట్‌ వంటి వాటికి మార్పులు చేస్తామని, పిల్లలు గేమ్‌ను ఆడేటప్పుడు దానిపై తల్లిదండ్రులు ఒక కన్నేసి ఉంచేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆ సంస్థ తెలిపింది. కానీ ఈ ప్రతిపాదనలతో కేంద్రం సంతృప్తి చెందినట్లు కనిపించట్లేదు. ఒకవేళ రీ బ్రాండెడ్ పబ్జీ గేమ్‌కు మళ్లీ అనుమతులు ఇస్తే.. బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టిన మరిన్ని చైనా యాప్‌లు కూడా రీబ్రాండెడ్ వెర్షన్‌ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అందువల్ల పబ్జీపై కేంద్రం కఠినంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్టీఐ దరఖాస్తులకు ఐటీ శాఖ ఇచ్చిన సమాధానంపై పబ్జీ కార్పొరేషన్ (PUBG Corporation), దాని మాతృ సంస్థ క్రాఫ్టన్ అధికారికంగా స్పందించలేదు.

First published:

Tags: India, PUBG, PUBG Mobile India

ఉత్తమ కథలు