• HOME
  • »
  • NEWS
  • »
  • TRENDING
  • »
  • ISRAELIS CHANT OM NAMAH SHIVAY TO PRAY FOR INDIA IN FIGHT AGAINST COVID WATCH THIS GOOD VIDEO NK

Israel Om Namah Shivay: ఇండియాలో కరోనా తగ్గాలని ఇజ్రాయెల్‌లో శివనామస్మరణ

Israel Om Namah Shivay: ఇండియాలో కరోనా తగ్గాలని ఇజ్రాయెల్‌లో శివనామస్మరణ

Israel Om Namah Shivay: ఇండియాలో కరోనా తగ్గాలని ఇజ్రాయెల్‌లో శివనామస్మరణ (image credit - instagram)

Israel Om Namah Shivay: ఫైజర్ వ్యాక్సిన్ వాడి కరోనా నుంచి బయటపడిన ఇజ్రాయెల్‌లో... ఓం నమఃశివాయ అంటూ శివుడి భజనలు చేస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

  • Share this:
    Israel Om Namah Shivay: ఇండియాలో కరోనా కేసులు వివరీతంగా పెరుగుతున్నాయి. రోజూ 4 లక్షలకు పైగా వస్తున్నాయి కదా... అందువల్ల ఈ కరోనాను ఎలా ఎదుర్కోవాలా అని ఇండియా నానా ఇబ్బందులు పడుతోంది. మన దేశంలో జనాభా ఎక్కువ కావడం వల్ల ఎక్కువ మందికి వ్యాధి సోకుతుంటే... ఆస్పత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్ సిలిండర్లు, మందులు ఏవీ చాలట్లేదు. ఉత్పత్తి అవుతున్న వ్యాక్సిన్లు ఓ మూలకు రావట్లేదు. ఐతే... 80 లక్షల మంది జనాభా ఉండే ఇజ్రాయెల్... అమెరికాలోని ఫైజర్ వ్యాక్సిన్ వేసుకొని... కరోనా నుంచి బయటపడింది. ఇప్పుడు అక్కడి ప్రజలు మాస్కులు కూడా వాడాల్సిన అవసరం లేకుండా పోయింది. ఐతే... ఇజ్రాయెల్‌తో మొదటి నుంచి ఇండియాకి సత్సంబంధాలే ఉన్నాయి. అందువల్ల ఇండియా కరోనా నుంచి కోలుకోవాలని శివనామస్మరణ చేశారు.

    రాజధాని టెల్ అవీవ్‌లో వందల మంది ఇజ్రాయెలీలు... ఓ చోటికి చేరారు. భారతీయులు మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుతూ... ఓం నమఃశివాయ అంటూ ప్రార్థనలు చేశారు. భారత్‌కు తాము అండగా ఉంటామని... త్వరలోనే ఇండియా కోలుకోవాలని వాంతా కోరారు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మీరు కూడా ఆ వీడియోను ఇక్కడ చూడవచ్చు.

    ఈ వీడియోని ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారి పవన్ కే పాల్... ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. ఇజ్రాయెల్ అంతా ఒక్కటై... భారతీయులకు అండగా నిలిచింది. ఈ కరోనా తగ్గుతుందా లేదా అని టెన్షన్ పడేవారికి ఈ వీడియో ఒకింత ఉపశమనం కలిగిస్తోంది.



    ఇలాంటివి చూస్తే... మాకు ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. మా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ధన్యవాదాలు అని ఓ యూజర్ చెప్పగా... ధన్యవాదాలు ఇజ్రాయెల్... ఇదో అందమైన స్పందన. ఇజ్రాయెల్ పూర్తిగా కరోనా నుంచి కోలుకోవాలి అని మరో యూజర్ కోరారు.

    ప్రస్తుతం మన దేశంలో కరోనాను ఎలా తగ్గించాలో చెప్పేవారి కంటే... దాన్ని చూపించి భయపెట్టేవారు ఎక్కువగా ఉంటున్నారు. అందువల్ల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కరోనా వచ్చినా టెన్షన్ అక్కర్లేదు. ఈ జాగ్రత్తలు తీసుకోండి... అదే తగ్గుతుంది... అని ప్రభుత్వాలూ, డాక్టర్లూ ధైర్యం చెప్పాలి. ప్రజల్లో పాజిటివ్ ఆలోచనలను పెంచాలి. సోషల్ మీడియాలో భయంకర వార్తల్ని అడ్డుకోవాలి. అప్పుడు ప్రజల్లో ఈ వైరస్‌తో పోరాడగలం అనే కాన్ఫిడెన్స్ కలుగుతుంది.

    ప్రపంచంలో ప్రస్తుతం రోజుకు 10 కరోనా కేసులు కూడా నమోదవ్వని దేశాలు 81 ఉన్నాయంటే నమ్మగలరా. ఆ దేశాలన్నీ కరోనాను జయించినట్లే. ప్రపంచంలో ప్రస్తుతం రోజుకు 1 కరోనా మరణం కూడా నమోదవ్వని దేశాలు 100కు పైగానే ఉన్నాయి. స్వయంగా మీరే ఆ వివరాలు ఇక్కడ (https://www.worldometers.info/coronavirus/#countries) చూసుకోవచ్చు. నిజాలు తెలుసుకుంటే మనకే మంచిది.

    ఇది కూడా చదవండి: Viral video: అరటి తోటంతా నాశనం చేసిన ఏనుగులు... ఒక్క చెట్టు తప్ప... ఎందుకో తెలుసా?

    ఈ దేశాలన్నీ కరోనాను జయించినప్పుడు భారతీయులు మాత్రం ఎందుకు జయించలేరు. జయించగలరు. కాస్త టైమ్ పడుతుందంటే. ఈ కొత్త స్ట్రెయిన్లు, వేరియంట్లు, అవి పాకడాలూ ఇవేవీ టీవీల్లో చూడకుండా... జస్ట్ మాస్క్ పెట్టుకుంటూ, డిస్టాన్స్ పాటిస్తూ... శానిటైజర్ వాడుతూ... మంచి ఆహారం తింటూ ఉంటే... కరోనా మనల్ని టచ్ చెయ్యలేదు అని గుర్తుంచుకుంటే చాలు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు