Viral Video: 11 అడుగుల పాముతో చిన్నారి ఫ్రెండ్షిప్.. కలిసి ఈత కూడా.. చూస్తే షాకవుతారు

పాముతో కలిసి ఈత కొడుతున్న చిన్నారి

Viral Video: ఇజ్రాయిల్ కు చెందిన ఎనిమిదేళ్ల చిన్నారి పాముతో ఫ్రెండ్షిప్ చేస్తోంది. ఆ పాముతో కలిసి ఈత కూడా కొడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

  • Share this:
    పాములంటే చిన్న పిల్లలకే కాదు... పెద్దవాళ్లకు కూడా భయమే. ఓ ప్రదేశంలో పాము ఉందంటే చాలు దాదాపు అందరూ అక్కడి నుంచి పరిగెడతారు. అయితే ఇజ్రాయిల్ దేశానికి చెందిన ఓ ఎనిమిదేళ్ల పాప మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నం. 11 అడుగుల కొండ చిలువ, ఆ చిన్నారి మంచి ఫ్రెండ్స్. ఇద్దరు కలిసి ఆడుకోవడమే కాదు.. ఈత కూడా కొడతారు. ఇదంతా జోక్ అనుకుంటున్నారేమో.. కాదండీ నిజం. ఇందుకు సంబంధించిన వీడియో ఇంటర్ నెట్లో వైరల్ గా మారింది. ఇన్బార్ అనే బాలిక తన చిన్నప్పటి నుంచి ఓ పాముతో ఫ్రెండ్షిప్ చేస్తోంది. ఆ పాము, ఆ చిన్నారి ఇద్దరూ కలిసి పెరిగారు. ఆ పాముకు ఆ చిన్నారి బల్లే అని పేరు కూడా పెట్టింది. కరోనా కారణంగా పాఠశాలలు మూసివేసినప్పటి నుంచి తన బల్లే తనకు కంపెనీ ఇస్తోందని ఇన్బార్ చెబుతోంది. తనకు పాములతో సమయం గడపడం ఇష్టమని అంటోంది. అవి సంతోషంగా ఉండేందుకు తాను సహాయం చేస్తున్నానని ఇన్బార్ చెబుతోంది.

    కేవలం ఇన్బార్ మాత్రమే కాదు దక్షిణ ఇజ్రాయేల్ ప్రాంతంలోని వ్యవసాయ కుటుంబాలకు చెందిన అనేక మంది జంతువులను పెంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఈ క్రమంలో ఇన్బార్ సైతం అన్ని జంతువులను చూస్తూ పెరిగింది. ముఖ్యంగా పాములను చూస్తూ, వాటితో ఆడుకుంటూ పెరిగింది. ‘ఇన్బార్ చిన్నగా ఉన్నప్పుడు పాముతో కలిసి ఈత కొట్టేది. ఇప్పుడు ఇన్బార్ తో పాటు పాము కూడా పెద్దగా అయ్యింది. దీంతో ఇప్పుడు కూడా కలిసి ఈత కొడుతోంది. ఇది మాకు అత్యంత సహజం’ అని ఇన్బార్ తల్లి సరిత్ రెజేవ్ అంటున్నారు.


    ఎవరైనా ఆమె పెంపకంపై విమర్శలు చేస్తే.. జంతువులతో కలిసి ఉండడం ఒక అద్భుతమైన జీవితం అని సరిత్ అంటున్నారు. పిల్లలు జంతువులతో కలిసి పెరిగితే .. పెద్దైన తర్వాత వారు ఇతర ప్రజలను కూడా ప్రేమిస్తారని ఆమె చెబుతున్నారు. కేవలం తన గురించే కాకుండా ఇతరుల గురించే పట్టించుకునే వ్యక్తులుగా అలాంటి పిల్లలు మారుతారని అభిప్రాయపడుతున్నారు. అయితే అనేక మంది నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్లు పెడుతున్నారు. ఇది ఆ అమ్మాయికి మంచి కాదంటూ కొందరు కామెంట్లు పెడుతుండగా.. ఆ అమ్మాయి స్థానంలో నేనుంటే మూడ్చపోతానంటూ మరి కొందరు అంటున్నారు. పాములు శాఖాహారులు కాదంటూ మరి కొందరు వంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published: