ప్రపంచంలోనే అతిపెద్ద పురాతన వైన్ తయారీ ఫ్యాక్టరీలో ఇజ్రాయెల్ పురావస్తు శాస్త్రవేత్తలు ఓ బంగారు ఉంగరాన్ని కనుగొన్నారు. ఇది మామూలు ఉంగరం అయితే పెద్దగా చర్చించుకోవాల్సిన పనిలేదు. దీనికో ప్రత్యేకతో ఉంది. అసలు వివరాల్లోకెళితే..ఇజ్రాయిల్‌లోని యవ్నే నగరంలోని ఓ పురాతన బైజాం కాలం నాటి వైన్ తయారీ ఫ్యాక్టరీలో ఈ ఉంగరాన్ని పురావస్తు శాస్త్రవేత్తలు కొనుగొన్నారు. దీంతో పాటు వేల సంవత్సరాల నుంచి సురక్షితంగా ఉన్న మట్టి జాడీలను గుర్తించారు.ఈ పురాతన వైనరీ సంవత్సరానికి 20 లక్షల లీటర్ల వైన్ తయారు చేసే సామర్థ్యం కలిగిన ప్రపంచంలోనే అతిపురాతన వైనరీ అని పురావస్తు శాస్త్రవేత్తలు డైలీ మెయిల్ కు తెలిపారు. పురాతన కాలంలో వైన్ తాగిన తరవాత వచ్చే హ్యాంగోవర్ ను నివారించడానికి ఈ ఉంగరాన్ని అలంకరించుకునే వారని పురావస్తు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ఉంగరం ఏడో శతాబ్ధం నాటిదని, ఆ కాలంలో సంపన్నులు వారి ఉన్నత హోదాకు సూచికగా హ్యాంగోవర్ ఉంగరం అలకంరించుకునే వారని పురావస్తు శాస్త్రవేత్తలు తేల్చారు.
ఊదారంగులో ఉండే రాయితో కూడిన బంగారు ఉంగరం హ్యాంగోవర్ ను దూరం చేయగలదని ఆనాటి సంపన్నులు నమ్మేవారు. ఇజ్రాయెల్ యాంటిక్విటీస్ అథారిటీ ( IAA) అధికారిక ఫేస్ బుక్ పేజీలో ఈ అన్వేషణ వివరాలను పంచుకుంది. ఈ విషయాన్ని అమెథిస్ట్ బైబిల్లో కూడా ప్రస్తావించారని ఆ సంస్థ గుర్తు చేసింది. ఈ ఉంగరం హ్యాంగోవర్ ను నివారించడంతో పాటు అనేక రోగాలకు వైద్యం చేసే లక్షణాలను కూడా కలిగి ఉందని అప్పటి జనం నమ్మేవారు. ముదురు ఎరుపు ఊదా రంగులో ఉండే స్పటికాకారక్వార్జ్ రాయిని చాలా విలువైనది ఆ కాలంలో పరిగణించేవారు.
1400 ఏళ్ల క్రితం నాటి ఉంగరం
తాజాగా కొనుగొన్న ఉంగరం ఇజ్రాయెల్ లోని సంపన్నులకు చెందిందని పురాతన ఆభరణాల నిపుణుడు డాక్టర్ అమీర్ గోలానీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి ఉంగరం ధరించిన వారు చాలా సంపన్నులు, ఉన్నతమైనవారని, పురుషులు, మహిళలు ఇద్దరూ అలంకరించుకునే వారని ఆయన గుర్తు చేశారు. ఈ ఉంగరం ఏడవ శతాబ్దం నాటిది. అంటే దాదాపు 1400 సంవత్సరాల పురాతనమైనదిగా అంచనా వేశారు.
ఇజ్రాయెల్ ల్యాండ్ అథారిటీ ( ISRAEL LAND AUTHORITY) యవ్నే నగరాన్ని అభివృద్ధి చేయడం కోసం తవ్వకాలు జరుపుతున్నారు. హ్యాంగోవర్ బంగారు ఉంగరం దొరికిన ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తల సహకారంతో 75000 చదరపు అడుగుల స్థలంలో రెండు సంవత్సరాలుగా తవ్వకాలు జరుపుతున్నారని డెయిలీ హంట్ నివేదిక తెలిపింది. తవ్వకాలు జరిపిన ప్రాంతం ఇజ్రాయెల్ మధ్యలో ఉంది. జెరూసలేం పవిత్ర నగరంతో పాటు ఇది అత్యంత వ్యూహాత్మక ప్రాంతంగా పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Israel, Trending news, VIRAL NEWS