ప్రపంచం అంతం కాబోతోంది.. ఈ వీడియోనే సాక్ష్యం.. తేల్చిచెబుతున్న క్రైస్తవ ప్రముఖులు.. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే..

సౌదీ ఎడారిలో కురుస్తున్న మంచు

విధి ఎన్నడూ చూడని ప్రకృతి వైపరీత్యాలు ఓ వైపు, కుప్పలు తెప్పలుగా మరణాలు మరో వైపు. ప్రపంచం అంతరించిపోతోందా అన్న భావన ప్రతి ఒక్క పౌరుడిలోనూ వచ్చింది. తాజాగా జరిగిన ఓ ఘటన ప్రపంచం అంతానికి సూచన అని క్రైస్తవ మత ప్రముఖులు నమ్ముతున్నారు.

 • Share this:
  కనిపించని చిన్న వైరస్ కు ప్రపంచ దేశాలే భయపడిపోయాయి. కరోనా వైరస్ ధాటికి అగ్రదేశాలే వణికిపోయాయి. ఎల్లలు లేని ప్రపంచం అని చెప్పుకున్న దేశాలన్నీ గిరిగీసుకున్నాయి. విదేశాల్లో ఉన్న తమ పౌరులను స్వదేశాలకు రానివ్వడానికి కూడా నానా ఆంక్షలు పెట్టాయి. ఏమిటీ వైపరీత్యం. ఏదైనా కష్టం వస్తే వెంటనే దేవుడి గుడికి వెళ్లి మొక్కుకుంటాం. కరోనా టైమ్ లో దేవుళ్ల గుళ్లు కూడా మూతపడ్డాయి. హతవిధీ.. మాకు దిక్కెవరు? అంటూ ప్రపంచ దేశాల పౌరులంతా మూగరోధన అనుభవించారు. డాక్టరు దేవుళ్లనే నమ్ముకున్నారు. శాస్త్రవేత్తల వైపు ఆశగా చూశారు. విధి ఎన్నడూ చూడని ప్రకృతి వైపరీత్యాలు ఓ వైపు, కుప్పలు తెప్పలుగా మరణాలు మరో వైపు. ప్రపంచం అంతరించిపోతోందా అన్న భావన ప్రతి ఒక్క పౌరుడిలోనూ వచ్చింది. కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత తాజాగా జరిగిన ఓ ఘటన ప్రపంచం అంతానికి సూచన అని క్రైస్తవ మత ప్రముఖులు నమ్ముతున్నారు.

  కింద  కనిపిస్తున్న వీడియోను ఓ సారి చూడండి. అదో ఎడారి. అక్కడ లెక్కకు మించిన ఒంటెలు ఎన్నో ఉన్నాయి. విపరీతంగా పడుతున్న మంచులోనే అవన్నీ గడుపుతున్నాయి. ఈ ఘటన జరిగింది ఎక్కడో కాదు. ఎడారి ప్రాంతం ఎక్కువగా కలిగిన గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాలో. గడిచిన 50 ఏళ్లలో సౌదీలో ఈ స్థాయిలో మంచు ఎప్పుడూ పడలేదని ఆ దేశ అధికారిక లెక్కలు చెబుతున్నాయి. బయటకు వస్తే చాలు చెమటలు పట్లే ఆ దేశంలో మైనస్ రెండు డిగ్రీల సెల్సియస్ కు ఉష్ణోగ్రతలు పడిపోయాయి. అక్కడే కాకుండా అల్గేరియాలోని ఎయిన్ సెఫ్రీ నగరంలో కూడా మంచు వర్షం విపరీతంగా పడింది. గేట్ వే ఆఫ్ ది సహారాగా ఈ ప్రాంతానికి పేరుంది. ఏడాదిలో ప్రతీ రోజూ ఈ ప్రాంతం పొడిగానే ఉంటుంది. అలాంటి చోట కూడా విపరీతమైన స్థాయిలో మంచు కురిసింది. ఈ రెండు ఉదాహరణలనే పేర్కొంటూ ప్రపంచం అంతం కాబోతోందని క్రైస్తవ ప్రముఖులు కొందరు చెబుతున్నారు.  ఇది కూడా చదవండి: స్కేటింగ్ చేస్తుండగా విరిగిపోయిన మంచు.. సరస్సులో పడిపోయి నానా తిప్పలు.. వైరల్ వీడియో

  ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న కొన్ని సంఘటనలు మానవాళి అంతాన్ని సూచిస్తోందనీ, త్వరలోనే ప్రపంచం అంతం కాబోతోందని ప్రముఖ పాస్టర్ పౌల్ బెగ్లే చెబుతున్నారు. క్రీస్తు రెండో రాకడకు ఇవి సూచనలు అని కూడా ఆయన వివరిస్తున్నారు. నీళ్లు దొరకని ఎడారిలో మంచు కురవడం అన్నది ప్రపంచం అంతం కాబోతోందనడానికి మరో చిహ్నమని చెబుతున్నారు. ప్రపంచం అంతానికి సూచనలను బైబిల్ లో ఎప్పుడో ఏసుప్రభువు చెప్పాడంటున్నారు. ’ఎడారిలో మంచు కురుస్తుంది. మనుషులు భయపడే అడవులే గులాబీల్లా వికసిస్తాయి. నేను కొత్తగా ఎవరూ ఊహించని కార్యాలను జరపబోతున్నాను. అకస్మాత్తుగా జరిగే ఆ అద్భుత కార్యాలను మీరు గ్రహించాలి. ఎడారిలో నదులను సృష్టిస్తాను, అరణ్యంలో రహదారిని కలుగజేస్తాను‘ అంటూ బైబిల్ లో ఉన్న వాక్యాలను పాస్టర్లు గర్తు చేస్తున్నారు.
  ఇది కూడా చదవండి: రెస్టారెంట్ కు వచ్చిన కస్టమర్ ఇచ్చిన టిప్ చూసి కంగుతిన్న వెయిటర్.. అదేంటని అడిగితే ఆమె చెప్పింది విని..

  ఇదిలా ఉండగా, ఈ తరహా ప్రచారాన్ని శాస్త్రవేత్తలు ఖండిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని సంఘటనలు జరుగుతున్నది వాస్తవమేనని వారు చెబుతూనే ఇదేం ప్రపంచం అంతం అనే వాదనలను కొట్టి పారేస్తున్నారు. భారత్ లో ఢిల్లీ సహా కొన్ని ప్రాంతాల్లో 119 ఏళ్లలో ఎప్పుడూ లేనంత చలి వచ్చిందన్నారు. స్పెయిన్ లో 1971వ సంవత్సరం తర్వాత ఈ స్థాయిలో చలి ఉండటం ఇదే ప్రథమమన్నారు. పర్యావరణ సమతుల్యతలో మానవాళి ప్రమోయమే దీనికి ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతన్నారు. కర్భన ఉద్గారాల వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటోందన్నారు. అందుకే అనూహ్య రీతిలో వాతావరణ పరిస్థితులు మారిపోతున్నాయంటున్నారు.
  Published by:Hasaan Kandula
  First published: