హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Delhi Metro : అవ్వ.. అవేం బట్టలు.. మండిపడుతున్న నెటిజన్లు

Delhi Metro : అవ్వ.. అవేం బట్టలు.. మండిపడుతున్న నెటిజన్లు

అవ్వ.. అవేం బట్టలు (image credit - twitter - @barkhatrehan16)

అవ్వ.. అవేం బట్టలు (image credit - twitter - @barkhatrehan16)

Delhi Metro : ఢిల్లీ మెట్రోలో ఓ యువతి.. అర్థనగ్నంగా బికినీతో ప్రయాణించడం కలకలం రేపింది. ఆమె డ్రెస్సింగ్ సెన్స్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

విదేశాల్లో ఎవరు ఎలా ఉన్నా.. మన దేశంలో ప్రజలు వస్త్రధారణ విషయంలో కొన్ని కట్టుబాట్లు పాటిస్తారు. ముఖ్యంగా నలుగురిలో ఉన్నప్పుడు.. నిండైన వస్త్రాలు ధరిస్తారు. అందుకే మన దేశాన్ని ప్రపంచదేశాలు గౌరవిస్తాయి. అయినా బట్టలున్నది.. శరీరాన్ని కప్పుకోవడానికి గానీ.. చూపించడానికి కాదు కదా.. కానీ.. కొంతమంది ఆ సంస్కృతిని దెబ్బతీస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఢిల్లీ మెట్రోలో ఓ యువతి బికినీలో ప్రయాణించడం కలకలం రేపింది.

బికినీ వేసుకున్న ఆ యువతి.. అసౌకర్యంగానే రైల్లో ప్రయాణించింది. స్కిన్ షో నుంచి తప్పించుకునేందుకు తన బ్యాగ్‌ని శరీరానికి అడ్డుగా పెట్టుకుంది. అలాంటి డ్రెస్ వేసుకోవడమెందుకు.. ఇలా ఇబ్బంది పడటమెందుకు అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

"ఇది మహిళా సాధికారతకు ఉదాహరణే అయితే.. మన యంగ్ జనరేషన్ అమ్మాయిలు.. దీనికి బాధితులు అవుతున్నట్లే. సిగ్గులేని ఫెమినిస్టులు కోరుకునేది ఇదేనా? నేను దీనిని సాంస్కృతిక హననం అని పిలుస్తాను" అని ఓ నెటిజన్ ట్విట్టర్‌లో ఈ వీడియోని పోస్ట్ చేశారు.

ఆ వీడియోని ఇక్కడ చూడండి (viral video)

ఈ వీడియోపై నెటిజన్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. "ఆమె మెట్రో స్టేషన్ సెక్యూరిటీని దాటి లోపలికి ఎలా వచ్చింది? చూడటానికి దరిద్రంగా ఉంది. సెక్యూరిటీ వారు ఇలాంటి ప్రయాణికుల్ని ఎలా అనుమతిస్తున్నారు?" అని ఓ యూజర్ ప్రశ్నించారు. "ఆమె ఎట్రాక్షన్ కోరుకుంటోంది.. అది పొందుతోంది" అని మరో యూజర్ స్పందించారు.

"ఇది పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్. బీచ్ కాదు. ఫ్రీడమ్ పేరుతో ప్రతి ఒక్కరూ తమ ఇష్టం వచ్చినట్లు చేస్తే ఎలా? ఇవాళ ఆమెను చూసి మరింత మంది రేపు అలాగే తయారవుతారు. ఇలాంటి వారిపై ఎలాంటి వివక్షా లేకుండా చర్యలు తీసుకోవాలి" అని మరో యూజర్ కామెంట్ ఇచ్చారు. ఇంకా చాలా మంది దీన్ని వ్యతిరేకించారు.

First published:

Tags: Delhi metro, Viral, Viral Video, Viral Videos

ఉత్తమ కథలు