పులి ఏంటి..? స్మోక్ చేయడమేంటని అంటారా.. ?. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) అధికారి ప్రవీణ్ కాస్వాన్ ఓ వీడియో పోస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఈ దాన్ని రికార్డు చేశారు. పార్క్ చేసిన ఓ వాహనంలో నుంచి దిగిన ఆడపులి నోట్లో నుంచి పొగలు వచ్చాయి. ఒక్కసారిగా వాహనం నుంచి బయటకు రాగానే చాలా మరింత దట్టంగా పొగలు కక్కింది.
“బంధవ్గఢ్కు చెందిన ఈ టైగర్ స్మోక్ చేస్తోందా” అని ఐఎఫ్ఎస్ అధికారి ప్రవీణ్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అయితే ఆయన సరదగా ఆ మాట రాశారు. సాధారణంగా పులులు పొగ తాగవు. అయితే ప్రస్తుతం తీవ్రమైన చలికాలం ఉంది. ఈ వీడియో తీసింది రాత్రివేళ కావడంతో పులి నోట్ల నుంచి పొగలు వచ్చాయి. ఇక బయటికి వచ్చాక మంచు ఎక్కువవడంతో పులి నోట్లో నుంచి దట్టంగా పొగలు వచ్చాయి. ఆ పులి శ్వాస విడిచినప్పుడు మరింత ఎక్కువగా పొగ కనిపించింది.
అయితే సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కాసేపటికే ఈ వీడియో వైరల్‌గా మారింది. 30వేలకు పైగా వ్యూస్ వచ్చాయి. కామెంట్లు లైక్‌లు సైతం వెల్లువెత్తాయి.
కాగా గత ఈ పులి నెల బావిలో పడగా అటవీ శాఖ అధికారులు ఎంతో శ్రమించి ఈ బయటకు తీసుకొచ్చారు . వలలు, తాళ్ల సాయంతో గంటలపాటు కష్టపడి ఈ పులిని కాపాడారు. ఈ విషయాన్ని కూడా ప్రవీణ్ కాస్వాన్ తెలిపారు.
“ఫారెస్ట్ అధికారులు ఎంత అద్భుతంగా పని చేస్తున్నారో ఇలాంటి వీడియోలు చెబుతాయి. ఈ పులిని కాపాడి మళ్లీ అడవిలోకి వదిలారు. అన్నీ సంరక్షణ కోసమే. అయితే మీడియా స్పాట్ లైట్‌కు ఇవి దూరంగా ఉంటాయి” అని రాసుకొచ్చారు. ఈ పులి బావిలో నుంచి రక్షించినదే అంటే ఆశ్చర్యపోతారు కదూ అని పేర్కొన్నారు. దీంతో అటవీ శాఖ అధికారులను నెటిజన్లు ప్రశంసించారు.