Home /News /trending /

IS THIS GOOSE FLYING UPSIDE DOWN PHOTO GONE VIRAL NETIZENS TROLLING GOESE FOR HER SKILLS JNK GH

Viral Video: ఈ పెద్ద బాతు ఉల్టా తిరిగి ఎగురుతుందా..? స్కిల్స్ చూపిస్తోందంటూ చమత్కరిస్తున్న జనం..

ఈ పెద్ద నీటి బాతు ఉల్టా తిరిగి ఎగురుతోందా? (PC:  Vincent Cornelissen )

ఈ పెద్ద నీటి బాతు ఉల్టా తిరిగి ఎగురుతోందా? (PC: Vincent Cornelissen )

ఇంతగా వైరల్ అవుతున్న ఈ ఫొటోను నెదర్లాండ్ లోని అర్న్ హెమ్ అనే ప్రదేశంలో విన్సెంట్ కార్నెల్లిసెన్ అనే ఫొటోగ్రాఫర్ తీశారు.

సాధారణంగా మనలో చాలామందికి యోగా చేయడం వచ్చు. కానీ శీర్షాసనం వేయాలంటే మాత్రం చాలా ప్రాక్టీస్ అవసరమే. అలా తల కిందకు, కాళ్లు పైకి పెట్టి మీరు నడవగలరా? ఇది కాస్త కష్టమే. కానీ రెక్కలు కిందికి.. మిగిలిన శరీరం అంతా పైకి ఉంచి రివర్స్‌లో గాలిలో ఎగురుతోంది ఒక పెద్ద నీటి బాతు (గూస్). దీంతో దాని స్కిల్స్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఆ బాతుకు అలా ఎలా సాధ్యమైందా? అని కామెంట్లు పెడుతున్నారు.

ఇంతగా వైరల్ అవుతున్న ఈ ఫొటోను నెదర్లాండ్ లోని అర్న్ హెమ్ అనే ప్రదేశంలో విన్సెంట్ కార్నెల్లిసెన్ అనే ఫొటోగ్రాఫర్ తీశారు. ఇందులో ఈ బూడిద రంగు గూస్ శరీరాన్ని తిరగేసి ఉంచి మెడను సవ్య దిశలో ఉంచి గాలిలో ఎగురుతోంది. దీని గురించి ఆ ఫొటోగ్రాఫర్ మాట్లాడారు. ‘ఆరోజు వాతావరణం అస్సలు బాగా లేదు. నేను వాటర్ ప్రూఫ్ దుస్తులు వేసుకొని చెరువు పక్కనే ఉన్న ఓ చెట్టుకు ఒరిగి కూర్చున్నా. కానీ ఓ పక్షి ఎగరడానికి ఇబ్బంది పడుతున్నట్లుగా నేను గమనించాను. గాలి వేగంగా వీస్తుండడం వల్ల అలా జరుగుతుందని నేను భావించాను. అందుకే దాని ఫొటోలు తీయడానికి నిర్ణయించుకున్నా. కానీ ఫొటో తీసిన తర్వాతే నాకు అర్థమైంది. ఇది ఏదో వింతలా ఉంది అని..’ అని చెప్పారు.

ఈ ఫోటోను చూసి ఆశ్చర్యపోయానని చెప్పారు ఆ ఫోటోగ్రాఫర్. అది ఫొటోషాప్ చేసింది కాదు అని ఎవరికైనా చెప్పినా.. నమ్మరని అతడికి అర్థమైంది. ఎందుకంటే ఇది కాస్త విభిన్నంగా, వింతగా ఉంది. ఆ పావురానికి ఏదో గాయం అయినట్లుగా ఉందని, అందుకే అది అలా ఎగురుతుందేమోనని చెప్పారు విన్సెంట్.

దీనిపై మరో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్, బర్డ్ ప్రొటెక్టివ్ ఏజెన్సీ అధినేత అయిన లార్స్ సొరెంక్ స్పందించారు. ‘సాధారణంగా మనం ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకుంటే మన స్నేహితులకు దాన్ని చూపించేందుకు ఆసక్తి చూపిస్తాం. అలా పక్షులు కూడా చేస్తాయి. ఆ గూస్ కొత్త ట్రిక్స్ నేర్చుకోవడానికి లేదా తోటి వాటికి చూపించేందుకు ప్రయత్నిస్తున్నప్పుడు తీసిన ఫొటో అది. పక్షులు తమకు ఎగరడం బాగా వచ్చిన తర్వాత ఇంకా ఏదైనా ప్రత్యేకంగా చేయడానికి లేదా వీలైనంత ఎక్కువ దూరం ఎగరడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. తోటి వాటి దగ్గర తమ ప్రత్యేకత చూపించుకోవడానికి ఇలా చేస్తాయి’ అని సొరెంక్ చెప్పడం విశేషం.
Published by:John Naveen Kora
First published:

Tags: Photography, Viral photos

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు