చిన్న చిన్న చేప పిల్లలను కొంగలు, గద్దలు ఎత్తుకెళ్లడం కామన్..! చెరువులు, కాల్వలో ఇలాంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి. కానీ ఏకంగాఓ షార్క్ (సొర చేప)ను పక్షి ఎత్తుకెళ్లడం చూశారా..? ఏంటి అంతపెద్ద చేపను పక్షి ఎత్తుకెళ్లడమా..? అసాధ్యం.. అని చాలా మంది అనుకుంటారు. కానీ ఇది నిజంగా జరిగింది. ఓ పెద్ద షార్క్‌ని భారీ పక్షి ఎత్తుకెళ్లింది. అమెరికా సౌత్ కరోనాలినాలో ఉన్న మైర్టల్ బీచ్‌లో ఈ ఘటన జరిగింది. బీచ్‌లో పర్యాటకులు సముద్ర అందాలను ఆస్వాదిస్తూ.. జలకాలాట ఆడుతున్న సమయంలో..ఒక్కసారిగా ఓ భారీ పక్షి వచ్చింది. సముద్రం మీదకు వచ్చి ఓ షార్క్‌ను అమాంతం ఎత్తుకెళ్లింది. అదేదో పిల్ల చేప కాదు. భారీ చేపనే అ పక్షి ఎత్తుకెళ్లిది. దాన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది.
Anyone know what type of bird this is and is it holding a shark? #myrtlebeach 📽 Kelly Burbage pic.twitter.com/gc59xihiM7
— Tracking Sharks (@trackingsharks) June 30, 2020
ఐతే ఇక్కడ ఓ ప్రశ్న ఉత్పన్నమైంది. షార్క్‌ని ఎత్తుకెళ్లిన ఆ పక్షి ఏంటో ఎవరికైనా తెలుసా అని ట్రాకింగ్ షార్క్స్ ప్రశ్నించింది. దీనిపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఎవరికి తోచిన సమాధానం వారు చెప్పారు. కానీ చివరకు ఓ వ్యక్తి ఆ పక్షి పేరు చెప్పాడు. అది ఖచ్చితంగా ఓస్‌ప్రే (Osprey) అని ధీమా వ్యక్తం చేశాడు. అంతేకాదు ఆ పక్షికి సంబంధించిన ఫొటోలను కూడా పోస్ట్ చేశాడు.
Definitely an Osprey... check out some of these images taken from our hide in England..amazing birds! pic.twitter.com/mmbJdiboLC
— River Gwash Ospreys (@GwashOspreys) July 1, 2020
షార్క్‌ని ఎత్తుకెళ్లిన ఓస్‌ప్రే పక్షిని సముద్ర గద్దలని కూడా పిలుస్తారు. నదులు, సముద్రాల వద్ద ఎక్కువగా ఇలాంటి పెద్ద పక్షులు కనిపిస్తుంటాయి. చేపలతో పాటు తమ కంటే ఎక్కువ బరువు ఉంటే షార్క్‌లను కూడా అమాంతం ఎత్తుకెళ్తాయని నిపుణులు చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Trending videos, USA