IS TAJ HOTEL OFFERING FREE STAY TO COUPLES DURING VALENTINES DAY HERE IS THE FACT MS
Fact Check: వాలైంటైన్స్ డే సందర్భంగా TaJ Hotels లో 7 రోజుల పాటు ఉచిత బస.. నిజమెంత..?
ప్రతీకాత్మక చిత్రం
ప్రేమికుల దినోత్సవం (valentines day) సందర్భంగా.. దేశంలోని తాజ్ హోటల్స్ (taj hotels) బంపర్ ఆఫర్ ప్రకటించాయని ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రేమ జంటలకు దేశంలోని తాజ్ హోటల్స్ లో ఎక్కడైనా ఏడు రోజుల పాటు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తున్నారని దాని సారాంశం.
మరో పన్నెండు రోజుల్లో ప్రేమికుల దినోత్సవం (valentines day). ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరిగే ఈ వేడుకను.. మన దేశంలోనూ పలువురు విబేధించినా ప్రేమ జంటలు మాత్రం ఆనందంగా జరుపుకుంటాయి. ఇక ఈరోజు వ్యాపార కార్యకలాపాలకు కూడా పండగే. ఇష్టమైన వారికి గిఫ్ట్ లు కొనవ్వడానికి ప్రేమికులు తెగ షాపింగ్ చేస్తుంటారు. అప్పటిదాకా గిఫ్ట్ షాప్ ముఖం చూడని వాళ్లు కూడా గంటల తరబడి అందులోనే గడిపేస్తూ ఉంటారు. కొద్దిమందైతే తాము ప్రేమించిన వారితో ఒంటరిగా గడపటానికి ఇష్టపడతారు. అందుకే ప్రత్యేకంగా వేరే ప్రదేశానికి వెళ్లి అక్కడ హోటల్ లో ఉంటూ.. ప్రేమికుల దినోత్సవాన్ని తమ ప్రేమికులతో గడుపుతూ ఉంటారు. అయితే.. తాజాగా వాలైంటైన్స్ డే సందర్భంగా ప్రముఖ తాజ్ హోటల్ ప్రేమికులకు బంపర్ ఆఫర్ ఇస్తుందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ప్రేమికుల దినోత్సవం సందర్భంగా.. దేశంలోని తాజ్ హోటల్స్ బంపర్ ఆఫర్ ప్రకటించాయని ఒక సందేశం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రేమ జంటలకు దేశంలోని తాజ్ హోటల్స్ లో ఎక్కడైనా ఏడు రోజుల పాటు ఉచిత వసతి సౌకర్యం కల్పిస్తున్నారని దాని సారాంశం. ఇందుకు సంబంధించి ఒక మెసేజ్ వైరలైంది.
@TajHotels 🎉👫🎫I received a gift card from TAJ Hotel and finally got the chance to stay in TAJ Hotel for 7 days for free.😍 https://t.co/QyVhHGu2qD
What is this? I think it is phishing.
అందులో.. ‘నేను తాజ్ హోటల్ నుంచి గిఫ్ట్ కార్డు పొందాను. ఏడు రోజుల పాటు తాజ్ హోటళ్లో ఉండబోతున్నాను. మీరు కూడా తాజ్ లో ఉండాలనుకుంటే కింద ఉన్న కూపన్ ను క్లిక్ చేయండి..’ అని వస్తుంది. దాన్ని క్లిక్ చేయగానే.. ఈ సందేశాన్ని వాట్సాప్ లో ఐదు గ్రూపులకు, 20 మందికి పంపించాలని నిబంధన ఉంది.
It has come to our notice that a website has been promoting a Valentine’s Day initiative, offering a Taj Experiences Gift Card via WhatsApp. We would like to inform that Taj Hotels/IHCL has not offered any such promotion. We request to take note of this and exercise due caution.
అయితే దీనిపై తాజ్ హోటల్స్ యాజమాన్యం స్పందించింది. అలాంటి ఆఫరేమీ తాము ప్రవేశపెట్టలేదని.. ఇది నకిలీ వార్త (ఫేక్ న్యూస్) అని స్పష్టం చేసింది. తాజ్ హోటల్స్ గానీ ఐహెచ్‌సీఎల్ గానీ అలాంటి ప్రకటనేమీ చేయలేదని స్పష్టతనిచ్చింది. అనవసరంగా ఆ లింక్ లు క్లిక్ చేసి మోసపోవద్దని హెచ్చరించింది.
ఇదే విషయమై ముంబయి సైబర్ పోలీసులు కూడా ఒక హెచ్చరికను జారీ చేశారు. ఇలాంటి లింక్ లను క్లిక్ చేస్తే.. వాళ్లు మీ వ్యక్తిగత సమాచారాన్ని అడుగుతారని.. తద్వారా బ్యాంకు ఖాతాల నుంచి నగదును స్వాహా చేస్తారని వివరించారు.
Published by:Srinivas Munigala
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.