బాలీవుడ్‌లో ఎంట్రీకి షారుఖ్ కుమార్తె సుహానా సిద్ధమయ్యారా?

Bollywood News - Suhana Khan | బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ లేటెస్ట్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలీవుడ్‌లో ఎంట్రీకి సుహానా సన్నద్ధమయ్యారా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

news18-telugu
Updated: July 29, 2019, 7:47 PM IST
బాలీవుడ్‌లో ఎంట్రీకి షారుఖ్ కుమార్తె సుహానా సిద్ధమయ్యారా?
సుహానా ఖాన్(ఫైల్ ఫోటో)
  • Share this:
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ తెరంగేట్రానికి ముందే మీడియాను తన వైపు తిప్పుకుంటోంది. సోషల్ మీడియా వేదికలపై ఇప్పటికే ఆమె భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకుంది. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రమ్‌లో సుహానా ఖాన్ ఫ్యాన్ పేజీలు చాలా మొదలయ్యాయి. ఫ్యాన్ పేజీలలో సుహానా ఒక్క ఫోటో షేర్ చేస్తే...లైక్స్ కొట్టేందుకు కుర్రకారు కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు.

ఇక నేరుగా విషయానికి వస్తే షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ ఇటీవల మాల్దీవుల్లో వెకేషన్‌కు వెళ్లింది.ఈ సందర్భంగా తీసిన ఓ హాట్ ఫోటోను సుహానా ఖాన్ ఫ్యాన్ పేజ్‌లో చేయగా...ఇది వైరల్‌గా మారింది. మరెందుకు ఆలస్యంగా...బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేయండి అంటూ నెటిజన్స్ సుహానాకు స్వాగతం పలుకుతున్నారు. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు సుహానా సన్నద్ధమైనట్లు ఈ ఫోటో చెప్పకనే చెబుతోందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.


 Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి
 

Oh God !! This Pose ❤🎉😵 . . . @suhanakhan2 💕💕💕 Love you xoxoxo . . . #suhanakhan #jahankapoor #janhvikapoor #ananyapandey #ahaanpanday #shanayakapoor #deepikapadukone #mishakapoor #aliabhatt #shahrukhkhan #mumbai #bollywood #bombay #bombayfilms #bollywoodmovie #bollywooddance #bollywoodactresses


Suhana ✨ (@suhanakhan143) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


బాలీవుడ్ సెలబ్రిటీ పిల్లలు సారా అలీఖాన్, అనన్య పాండే, జాన్వీ కపూర్‌లు ఇప్పటికే బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. సుహానా ఖాన్ ఎప్పుడు ఎంట్రీ ఇస్తారన్న అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంటోంది. సుహానా ఖాన్ బాలీవుడ్ ఎంట్రీపై ఇప్పటి వరకు షారుఖ్ ఖాన్ లేదా కుటుంబ సభ్యులు ఎలాంటి కామెంట్ చేయలేదు.

First published: July 29, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు