హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Rihanna: రైతులకు మద్దతు తెలిపిన పాప్ సింగర్ రిహానా ముస్లిమేనా? ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్

Rihanna: రైతులకు మద్దతు తెలిపిన పాప్ సింగర్ రిహానా ముస్లిమేనా? ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్

రిహానా (Image; Tiwtter)

రిహానా (Image; Tiwtter)

Rihanna Religion అనే సెర్చ్ కీ వర్డ్ గూగుల్‌లో ఎక్కువగా వెతికినట్టు గూగుల్ విశ్లేషణల విభాగం ద్వారా కనిపిస్తోంది. అలాగే, Rihanna Muslim అనే సెర్చ్ కీ వర్డ్ కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగా వచ్చింది.

  భారత ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ సంస్కరణల చట్టాలపై దేశ రాజధాని ఢిల్లీలో రైతులు 75 రోజులుగా పోరాటం చేస్తున్నారు. ఈ క్రమంలో జనవరి 26 ఎర్రకోట ఘర్షణల తర్వాత పోలీసులు, రైతుల మధ్య ఉద్రిక్త పూరిత వాతావరణం నెలకొంది. తాజాగా, అమెరికన్ పాప్ సింగర్ రిహానా చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. సీఎన్ఎన్ కథనాన్ని పోస్ట్ చేసిన రిహానా.. ‘మనం దీని గురించి ఎందుకు మాట్లాడడం లేదు.’ అని రైతుల ఆందోళన గురించి ప్రస్తావించింది. ఈ ట్వీట్ చేసిన వెంటనే చాలా మంది సెలబ్రిటీలు ముందుకొచ్చారు. కొందరు ఆమెకు వ్యతిరేకంగా ట్వీట్లు చేశారు. మరికొందరు ఆమెకు మద్దతుగా ట్వీట్లు చేశారు. భారత అంతర్గత విషయాల్లో విదేశీయుల జోక్యం అనవసరం అని కేంద్రం ఇప్పటికే స్పష్టం చేసింది. ఓ వైపు వివాదం ఇలా ఉంటే.. మరోవైపు అసలు రైతులకు మద్దతుగా ట్వీట్ చేసిన పాప్ సింగర్ రిహానాది ఏ మతం? ఆమె ముస్లిం మహిళా? అనే సమాచారం కోసం నెటిజన్లు గూగుల్ చేస్తున్నారు.

  ఫిబ్రవరి 2న ఆమె ట్వీట్ చేస్తే.. ఆ తర్వాత అసలు ఈ రిహానా ఎవరని ఎక్కువ మంది సెర్చ్ చేశారు. ఆ తర్వాత ఫిబ్రవరి 2వ తేదీ సాయంత్రానికి ఆమె మతానికి సంబంధించిన సెర్చ్ ఎక్కువగా చేశారు. Rihanna Religion అనే సెర్చ్ కీ వర్డ్ గూగుల్‌లో ఎక్కువగా వెతికినట్టు గూగుల్ విశ్లేషణల విభాగం ద్వారా కనిపిస్తోంది. అలాగే, Rihanna Muslim అనే సెర్చ్ కీ వర్డ్ కూడా ఈ సమయంలో చాలా ఎక్కువగా వచ్చింది.

  బార్బడోస్‌కు చెందిన రిహానా క్రిస్టియన్. ఆమె చిన్నప్పటి నుంచి క్రైస్తవాన్ని అవలంభిస్తోంది. తన మతం గురించి, మతాచారం గురించి 2019 లో ఓ మేగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టంగా, సుదీర్ఘంగా ప్రస్తావించింది. తనకు ఏడేళ్ల వయసున్నప్పుడు తాను ఉపవాసం చేశానని చెప్పింది. తాను న్యూయార్క్‌కి వెళ్లాలనుకున్నానని, అక్కడి వరకు వెళ్లాలంటే తాను కొన్ని త్యాగం చేయక తప్పదని భావించానని తెలిపింది.

  రిహాన్నా మతం గురించి గూగుల్ సెర్చ్

  కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ సంస్కరణల చట్టాలను రద్దు చేయాలంటూ 75 రోజులుగా రైతులు ఢిల్లీలో పోరాటం చేస్తున్నారు. కేంద్రం, రైతుల మధ్య ఇప్పటి వరకు 11 సార్లు చర్చలు జరిగాయి. కానీ, వారి మధ్య ఎలాంటి అంగీకారం కుదరలేదు. మొత్తం మూడు చట్టాలు రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తుండగా, ఆ ఒక్కటి తప్ప మిగిలిన అంశాలు ఏవైనా ఉంటే చెప్పండని కేంద్రం చెబుతోంది. మరోవైపు 18 నెలల పాటు ఈ మూడు చట్టాల అమలును నిలిపివేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా పార్లమెంట్ ఆల్ పార్టీ సమావేశంలో ఈ కామెంట్స్  చేశారు. రైతులతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. తాజాగా, ఢిల్లీలో రైతులను రానివ్వకుండా రోడ్ల మీద పోలీసులు మేకులు బిగించడం తీవ్ర దుమారానికి దారి తీసింది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Farmers Protest, New Agriculture Acts

  ఉత్తమ కథలు