Man earn 3 crore in a year without work : ఆఫీసులో ఎక్కువ పని చేయనవసరం లేకుండా, సులభంగా డబ్బు సంపాదించాలని కోరుకునే వారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు. అయితే ఇది ఒక కలలా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ప్రైవేట్ కంపెనీలో పని చేసినా లేదా ప్రభుత్వ ఉద్యోగమైనా కష్టపడి పనిచేయాలి. కానీ ఐర్లాండ్(Ireland)కు చెందిన ఒక వ్యక్తి ఆఫీసులో ఏ పని చేయడు.. అయినప్పటికీ అతను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఆడిటీ సెంట్రల్ న్యూస్ వెబ్సైట్ నివేదిక ప్రకారం.. ఐర్లాండ్ నివాసి అయిన డెర్మోట్ అలెస్టర్ మిల్స్ ఉద్యోగంలో కోటి రూపాయలు సంపాదిస్తాడు. కానీ అతను ఒక్క పని కూడా చేయనవసరం లేదు. దీని కారణంగా అతను ఇప్పుడు కోపంతో తను పనిచేసే కంపెనీపై కేసు పెట్టాడు.
ఉద్యోగంలో కేవలం వార్తాపత్రికలు మాత్రమే చదువుతాడు, ఆహారం తింటాడు
డెర్మోట్... ఐరిష్ రైల్లో ఫైనాన్షియల్ మేనేజర్. కంపెనీ క్యాపిటల్ బడ్జెట్ బాధ్యత చూసుకునేవాడు. 2010లో ప్రమోషన్ కూడా ఇచ్చారు. కానీ 2013లో బలవంతంగా మరో పదవిలో కూర్చోబెట్టి, ఆ తర్వాత 3 నెలల స్టడీ లీవ్ ఇచ్చారు. సెలవు పెట్టి తిరిగి రాగానే బకాయిదారుల సొమ్ము విషయంలో కంపెనీలో కొంత గొడవ జరుగుతోంది. దీంతో 2014లో అతను కంపెనీ ఆర్థిక వ్యవహారాల గురించి,సంస్థలోని లోటుపాట్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం రవాణా శాఖ మంత్రికి కూడా ఈ విషయాన్ని తెలియజేశారు. అప్పటి నుండి అతను ఆఫీసులోని అన్ని పనుల నుండి తొలగించబడ్డాడు, కానీ ఉద్యోగం నుండి తొలగించబడలేదు. రోజూ ఆఫీసుకి వచ్చిన తర్వాత అతను కేవలం వార్తాపత్రికలు చదువుతాడు, ఆహారం తింటాడు. అంతేకాకుండా అతను ప్రతి నెలా జీతం పొందుతున్నాడు.
పెళ్లికి మందు శృంగారం నేరం..వచ్చే వారం పార్లమెంట్ లో బిల్లు!
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Job, Trending news