IRCTC: రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు పరిహారం.. రైల్వే శాఖ కీలక నిర్ణయం..

ఢిల్లీ నుంచి లక్నో, ముంబై నుంచి అహ్మదాబాద్‌ మధ్య చక్కర్లు కొట్టనున్న తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు.. గంట ఆలస్యంగా వస్తే రూ.100, రెండు గంటలు ఆలస్యంగా వస్తే రూ.250 పరిహారంగా ప్రయాణికులను చెల్లించనున్నారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: October 1, 2019, 5:35 PM IST
IRCTC: రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు పరిహారం.. రైల్వే శాఖ కీలక నిర్ణయం..
IRCTC: రైలు (image: PTI)
  • Share this:
మనం ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు.. మహా ప్రజ్ఞాశాలి, కవి ఆరుద్ర రైళ్ల సమయపాలనపై వ్యంగంగా అన్న వ్యాఖ్యలివి. అవును నిజంగానే రైళ్లు సమయానికి రావు. కనీసంలో కనీసం అర గంట పాటు ఆలస్యంగా ప్లాట్‌ఫాంపై వస్తాయి. ఒక సమయానికి మనం టికెట్ బుక్ చేసుకుంటే మరో రైలు రావాల్సిన సమయానికి మనకు కావాల్సిన రైలు వస్తుంది. అయితే.. ఈ మధ్య రైళ్లు మరీ ఆలస్యంగా కాకపోయినా దాదాపుగా అటూ ఇటూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని చర్యల వల్ల రైళ్ల సమయపాలన మెరుగుపడింది. తాజాగా.. కేంద్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో మొట్టమొదటి సారి పట్టాలెక్కుతున్న ప్రైవేటు రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యంగా వస్తే పరిహారం చెల్లించనుంది. ఢిల్లీ నుంచి లక్నో, ముంబై నుంచి అహ్మదాబాద్‌ మధ్య చక్కర్లు కొట్టనున్న ఈ రైలు.. గంట ఆలస్యంగా వస్తే రూ.100, రెండు గంటలు ఆలస్యంగా వస్తే రూ.250 పరిహారంగా ప్రయాణికులను చెల్లించనున్నారు. ఈ మేరకు రైల్వే మంత్రి పీయుష్ గోయల్ ట్వీట్ చేశారు. అదీకాక.. ఈ రైల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఉచితంగా రూ.25లక్షల ఇన్సూరెన్స్ కూడా ఉండనుంది.

అక్టోబరు 4న పట్టాలెక్కబోతున్న ఈ ప్రైవేట్ రైలులో పలు ప్రత్యేకతలు ఉండబోతున్నాయి. ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు లభించబోతున్నాయి. మొదట ఢిల్లీ-లక్నో మధ్య తేజస్ ఎక్స్‌ప్రెస్ నడిపించనుంది ఐఆర్‌సీటీసీ. ఫీడ్‌బ్యాక్ ఆధారంగా మార్పుచేర్పులు చేసి ముంబై-అహ్మదాబాద్ తేజస్ ఎక్స్‌ప్రెస్‌ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ప్రైవేట్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో టీ, కాఫీ వెండింగ్ మెషీన్స్ ఏర్పాటు చేయాలని భావిస్తోంది ఐఆర్‌సీటీసీ. ఇక ఎయిర్‌లైన్స్ తరహాలో తేజస్ ఎక్స్‌ప్రెస్‌లో టాయిలెట్లను తీర్చిదిద్దబోతోంది. ప్రతీ కోచ్‌లో అత్యాధునిక సౌకర్యాలతో రెండు టాయిలెట్స్ ఉంటాయి.



First published: October 1, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...