IRCTC: రైలులో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? జాగ్రత్త అంటున్న ఐఆర్‌సీటీసీ

IRCTC | ఇతర వెబ్‌సైట్స్, యాప్స్ ద్వారా ఆర్డర్ చేసే ఫుడ్‌కు ఐఆర్‌సీటీసీ ఎలాంటి బాధ్యత వహించదు. అంతేకాదు మీకు వచ్చిన పార్శిల్‌లో నాణ్యత లేకపోయినా, క్వాంటిటీ తక్కువగా ఉన్న ఐఆర్‌సీటీసీకి ఎలాంటి సంబంధం ఉండదు.

news18-telugu
Updated: May 22, 2019, 2:19 PM IST
IRCTC: రైలులో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? జాగ్రత్త అంటున్న ఐఆర్‌సీటీసీ
IRCTC: రైలులో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? జాగ్రత్త అంటున్న ఐఆర్‌సీటీసీ (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: May 22, 2019, 2:19 PM IST
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC రైలు ప్రయాణికులకు అనేక సేవలు అందిస్తోంది. అందులో ఇ-క్యాటరింగ్ ఒకటి. అంటే మీకు రైలులో అమ్మే ఫుడ్ మాత్రమే కాకుండా మీరు ప్రయాణించే దారిలో ఎంపిక చేసిన రెస్టారెంట్ల నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. www.ecatering.irctc.co.in వెబ్‌సైట్ లేదా ఇ-క్యాటరింగ్ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. రైలు ప్రయాణికులు తాము కోరుకున్న ఆహారాన్ని పొందేందుకు ఐఆర్‌సీటీసీ కల్పించిన అవకాశం ఇది. అయితే ఫుడ్ ఆర్డర్ చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు తప్పవని ఐఆర్‌సీటీసీ చెబుతోంది. రైలులో ఫుడ్ అందిస్తామని చెప్పే ఇతర వెబ్‌సైట్స్, యాప్స్‌లో బుక్ చేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దంటుంది ఐఆర్‌సీటీసీ.


Read this: IRCTC: రైలు టికెట్ కన్ఫామ్ కావాలా? ఇలా బుక్ చేయండి


ఫుడ్ ఆర్డర్ చేసేముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి...


ఫుడ్ ఆర్డర్ చేసేందుకు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ అయిన www.ecatering.irctc.co.in లేదా ఇ-క్యాటరింగ్ యాప్ ద్వారానే ఫుడ్ ఆర్డర్ చేయాలని సూచిస్తోంది ఐఆర్‌సీటీసీ. ఇతర వెబ్‌సైట్స్, యాప్స్ ద్వారా ఆర్డర్ చేసే ఫుడ్‌కు ఐఆర్‌సీటీసీ ఎలాంటి బాధ్యత వహించదు. అంతేకాదు మీకు వచ్చిన పార్శిల్‌లో నాణ్యత లేకపోయినా, క్వాంటిటీ తక్కువగా ఉన్న ఐఆర్‌సీటీసీకి ఎలాంటి సంబంధం ఉండదు. మీరు ఇ-క్యాటరింగ్ ప్లాట్‌ఫామ్‌లో ఫుడ్ బుక్ చేయాలనుకున్నా నియమనిబంధనలన్నీ ఓసారి చూసుకోవడం మంచిది. మీకు ఏ స్టేషన్‌లో పార్శిల్ కావాలో ఆ స్టేషన్‌కు రైలు చేరడానికి రెండు గంటల ముందే ఫుడ్ ఆర్డర్ చేయాలి. రైలు స్టేషన్‌కు చేరుకోవడానికి ఇంకా రెండు గంటలు ఉన్నప్పుడు ఆర్డర్ క్యాన్సిల్ చేయొచ్చు. ఫుడ్ ఆర్డర్ చేసేప్పుడు మీ వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేయాలి. మీ ఫుడ్ పార్శిల్ తీసుకునే సమయంలో మీ టికెట్‌ను చూపించాల్సి ఉంటుంది. రైలు సమయానికి స్టేషన్‌కు చేరుకోకపోతే ఐఆర్‌సీటీసీ బాధ్యత వహించదు. ఇ-క్యాటరింగ్‌కు సంబంధించిన నియమనిబంధనల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Read this: IRCTC: రైలులో వెళ్తున్నారా? ఈ 11 ఐడీ ప్రూఫ్స్ చూపించొచ్చు

ఐఆర్‌సీటీసీ ఇ-క్యాటరింగ్ యాప్‌లో ఫుడ్ ఆర్డర్ చేయండి ఇలా...


ముందుగా ఐఆర్‌సీటీసీ ఇ-క్యాటరింగ్ యాప్‌ లేదా వెబ్‌సైట్ ఓపెన్ చేయండి.
మీ రైలు టికెట్‌పై ఉండే పీఎన్ఆర్ నెంబర్ ఎంటర్ చేయండి.
మీకు ఫుడ్ డెలివరీ కావాల్సిన రైల్వే స్టేషన్ ఎంచుకోండి.
లిస్ట్‌లో ఉన్న రెస్టారెంట్‌ను ఎంచుకోండి.
ఆ రెస్టారెంట్‌లో ఉన్న మెనూ నుంచి మీకు కావాల్సిన ఫుడ్ సెలెక్ట్ చేసుకోండి.
క్యాష్ ఆన్ డెలివరీ లేదా ఆన్‌లైన్ పేమెంట్ ఎంచుకోవచ్చు.
చివరగా కన్‌ఫామ్ చేస్తే మీ ఆర్డర్ ప్లేస్ అవుతుంది.
సుమారు 500 పైగా రెస్టారెంట్లలో ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు.

Hyundai Venue: స్మార్ట్ ఫీచర్లతో హుందాయ్ వెన్యూ... కారు ఎలా ఉందో చూడండి


ఇవి కూడా చదవండి:

Aadhaar: ఆధార్ కార్డులో ఫోటో నచ్చలేదా? మార్చేయండి ఇలా...

WhatsApp: వాట్సప్‌లో నైట్ మోడ్ ఎలా ఉందో చూశారా?

PAN Card: మీ పాన్ కార్డ్ నెంబర్ అర్థమేంటో తెలుసా?
First published: May 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...