news18-telugu
Updated: May 20, 2019, 6:34 PM IST
IRCTC: రైలు టికెట్ కన్ఫామ్ కావాలా? ఇలా బుక్ చేయండి
(ప్రతీకాత్మక చిత్రం)
రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం భారతీయ రైల్వే ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టుంది. ముఖ్యంగా ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా గమ్యస్థానానికి చేరేలా అనేక చర్యలు తీసుకుంటోంది. అలాంటిదే 'వికల్ప్ స్కీమ్' కూడా. నాలుగేళ్ల క్రితమే ఈ పథకాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. 'వికల్ప్ స్కీమ్' గురించి పూర్తి అవగాహన లేక ఉపయోగించుకుంటున్నవారు తక్కువే. ఒకవేళ మీరు ప్రయాణించాలనుకున్న రైలులో టికెట్ వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉంటే ప్రత్యామ్నాయంగా మరో రైలులో టికెట్ పొందే అవకాశం కల్పిస్తుంది ఐఆర్సీటీసీ వికల్ప్ స్కీమ్. అయితే టికెట్ రిజర్వేషన్ చేసిన తర్వాత ఈ ఆప్షన్ ఎంచుకోవాల్సి ఉంటుంది. మరి మీ రైలు టికెట్ కన్ఫామ్ అయ్యేలా వికల్ప్ స్కీమ్ ఎలా వాడుకోవాలో తెలుసుకోండి.
Read this:
IRCTC: రైలులో వెళ్తున్నారా? ఈ 11 ఐడీ ప్రూఫ్స్ చూపించొచ్చు
(ప్రతీకాత్మక చిత్రం)
IRCTC Vikalp Scheme: ఐఆర్సీటీసీ వికల్ప్ స్కీమ్‌తో ఉపయోగాలివే...
సాధారణంగా రైలు టికెట్ రిజర్వేషన్ చేయించుకుంటే రైలు బోగీలో ఖాళీ ఉంటే వెంటనే టికెట్ కన్ఫామ్ అవుతుంది. లేదా ఆర్ఏసీ వస్తుంది. బోగీలు నిండిపోతే వెయిటింగ్ లిస్ట్‌లోకి వెళ్తుంది. చార్ట్ ప్రిపేర్ చేసేవరకు వెయిటింగ్ లిస్ట్‌లోనే ఉంటే ఇక టికెట్ దొరకనట్టే. మీరు టికెట్ కోసం చెల్లించిన డబ్బులు వెనక్కి వస్తాయి. అయితే డబ్బులు వెనక్కి వస్తాయి కానీ మీ జర్నీ ప్లాన్ డిస్టర్బ్ అవుతుంది. గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుంది. రైలు ప్రయాణికులు ఇలాంటి ఇబ్బందులు పడకుంటా వికల్ప్ స్కీమ్ ప్రారంభించింది రైల్వే. ఈ స్కీమ్ రైళ్లు, క్లాసులు, కన్సెషన్తో సంబంధం లేకుండా వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న అన్ని టికెట్లకు వర్తిస్తుంది.
Read this:
IRCTC: రైలు టికెట్లో 50% డిస్కౌంట్... ఇలా బుక్ చేయండి

(ప్రతీకాత్మక చిత్రం)
మీరు టికెట్ బుక్ చేసిన తర్వాత వికల్ప్ ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడే మీకు ప్రత్యామ్నాయంగా మరో రైలులో టికెట్ దొరికే ఛాన్స్ ఉంటుంది. వికల్ప్ ఆప్షన్ ఎంచుకున్న ప్రయాణికులు చార్ట్ ప్రిపేర్ అయిన తర్వాత పీఎన్ఆర్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. కొత్త రైలు వివరాలు అప్డేట్ అవుతాయి. ఒకవేళ మీకు వికల్ప్ స్కీమ్‌లో మీరు బుక్ చేసుకున్న రైలు కాకుండా మరో రైలులో టికెట్ కన్ఫామ్ అయితే మీరు ఆ టికెట్ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. టికెట్ క్యాన్సలేషన్‌కు కన్ఫామ్డ్ ప్యాసింజర్‌కు వర్తించే నియమనిబంధనలే ఉంటాయి. వికల్ప్ స్కీమ్‌లో ప్రత్యామ్నాయ రైలులో టికెట్ కన్ఫామ్ అయిన తర్వాత జర్నీ మాడిఫికేషన్ సాధ్యం కాదు. ప్రయాణంలో మార్పులు చేసుకోవాలంటే మాత్రం టికెట్ క్యాన్సిల్ చేసుకొని మరో టికెట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
Read this:
IRCTC-SBI offer: ఫ్రీగా రైలు టికెట్... 10% క్యాష్‌బ్యాక్... ఆఫర్ ఇలా పొందండి

(ప్రతీకాత్మక చిత్రం)
ఒక్కసారి మీరు వికల్ప్ స్కీమ్ ఎంచుకున్న తర్వాత మార్చుకోవడానికి వీలుండదు. మీరు వికల్ప్ స్కీమ్ ఎంచుకున్నారంటే పక్కాగా కన్ఫామ్డ్ టికెట్ లభిస్తుందని కాదు. కాకపోతే మీరు ఎంచుకున్న రైలులో కాకపోయినా ఆ తర్వాత రైలులో బెర్త్ ఖాళీ ఉంటే మాత్రం టికెట్ కన్ఫామ్ అవుతుంది. మీరు మొదట ఎంచుకున్న రైలు బయల్దేరే సమయం తర్వాత 30 నిమిషాల నుంచి 72 గంటల మధ్య ప్రత్యామ్నాయ రైలు ఉంటుంది. మీరు గరిష్టంగా ఏడు రైళ్లను వికల్ప్ స్కీమ్‌లో ఎంచుకోవచ్చు.
Redmi Note 7S: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రెడ్మీ నోట్ 7ఎస్ రిలీజ్... ఎలా ఉందో చూశారా?
ఇవి కూడా చదవండి:
LIC Jobs: ఎల్ఐసీలో 8581 ఏడీఓ పోస్టులు... హైదరాబాద్ జోన్లో 1251 ఖాళీలు
SBI Jobs: ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు... వివరాలివే
EPFO Jobs: డిగ్రీ పాసైతే చాలు... ఈపీఎఫ్ఓలో 280 ఉద్యోగాలు
First published:
May 20, 2019, 6:34 PM IST