Train Tickets: చివరి క్షణాల్లోనూ రైలు టికెట్.. 5 నిమిషాల ముందే 2వ చార్ట్..ఐఆర్ సీటీసీ కొత్త రూల్స్

రైలు టికెట్ (train ticket) అనగానే అందరికీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. మనదేశంలో రైలు టికెట్ దొరకడం రానురాను అంత కష్టమైన పనిగా మారుతోంది.

news18-telugu
Updated: November 6, 2020, 3:02 PM IST
Train Tickets: చివరి క్షణాల్లోనూ రైలు టికెట్.. 5 నిమిషాల ముందే 2వ చార్ట్..ఐఆర్ సీటీసీ కొత్త రూల్స్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
రైలు టికెట్ (train ticket) అనగానే అందరికీ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతాయి. మనదేశంలో రైలు టికెట్ దొరకడం రానురాను అంత కష్టమైన పనిగా మారుతోంది. ఎప్పుడు చూసినా రైళ్లు ఫుల్, టికెట్లు నిల్ (tickets nill) అన్నట్టు సాగుతోంది ఈ తంతు అంతా. ఇక పండుగలు (festive season), పెళ్లిళ్ల సీజన్ (marriage season), సెలవుల సమయంలో (vacations time) అయితే 3 నెలల ముందే టికెట్లు అయిపోతాయి. ఇక ఇలాంటి టెన్షన్ల నుంచి మీరు ఈజీగా బయటపడచ్చు. మీరు చేయాల్సిందల్లా మీరు క్యాచ్ చేయాలనుకున్న ట్రైన్ కు రిజర్వేషన్ (train reservation) దొరక్కపోయినా, లగేజ్ తీసుకుని రైల్వే స్టేషన్ కు వెళ్తే సరి. లాస్ట్ మినిట్ లో రైలు ఎక్కే చాన్స్ దొరకచ్చు. ఎందుకంటే రైల్వే రిజర్వేషన్ విధానంలో విప్లవాత్మకమైన మార్పులు శరవేగంగా చోటుచేసుకుంటున్నాయి.

జస్ట్ 5 నిమిషాల ముందు

ఇక 5 నిమిషాల్లో రైలు బయలుదేరుతుందనగా (5 minutes before train starts) మీకు టికెట్ దొరకచ్చు. ఐఆర్ సీటీసీ తెచ్చిన కొత్త నియమాల ప్రకారం (IRCTC new rules) ఇకమీదట రైళ్లకు సెకెండ్ రిజర్వేషన్ చార్టును (second reservation chart) రిలీజ్ చేస్తారు. దీంతో రైలు బయలుదేరడానికి 30 నిమిషాల ముందు (30 minutes before) కూడా టికెట్ బుక్ చేసుకునే వెసులుబాటును రైల్వే శాఖ అమల్లోకి తెచ్చిందన్నమాట. అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా ఇంటర్నెట్ వినియోగదారులు, లేదా కౌంటర్లో టికెట్లు తీసుకునే వారికి ఈ సదుపాయం వర్తిస్తుంది. దీంతో ఇప్పటివరకు ఒకసారే చార్ట్ సిద్ధం చేసే రైల్వేలు ఇక రెండుసార్లు చార్ట్ (2 times chart) సిద్ధం చేయాల్సి వస్తుంది. రైలు బయలుదేరే ముందు టీటీఈలకు ఈ చార్ట్ అందజేస్తారు.

పెద్ద ఊరటే
ఈ కొత్త విధానంతో ప్యాసింజర్లకు పెద్ద ఊరట లభించనుంది. ముఖ్యంగా దూరప్రాంతాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు ఈ విధానం ఎంతో లాభదాయకం. నిజానికి కరోనా రాకముందు కూడా ఈ సౌలభ్యం ఉండగా కరోనా కారణంగా రైలు సర్వీసులను నిలుపు చేశారు. ఆతరువాత అన్నీ ప్రత్యేక రైళ్లనే నడిపారు కనుక ఈ విధానాన్ని రద్దు చేశారు.

లాస్ట్ మినిట్
రైలు బయలు దేరడానికి అరగంట ముందే 2వ రిజర్వేషన్ చార్టు విడుదల చేస్తారు. దీంతో మీరు ఎక్కాల్సిన రైల్లో లాస్ట్ మినిట్ లో ఏమైనా సీట్లు ఖాళీగా కనిపిస్తే వెంటనే బుక్ చేసేసుకుని, రైలు ఎక్కేయ్యచ్చు. మళ్లీ పాత విధానం అమల్లోకి రావడంతో మీరు ఎక్కాల్సిన రైలును చివరి నిమిషంలో అయినా క్యాచ్ చేసే చాన్స్ దొరికినట్టే.

2 గంటల ముందే స్టేషన్ కు
ఇందుకు అనుగుణంగా సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టం (CRIS) సాఫ్ట్ వేర్ లో అవసరమైన మార్పులన్నీ చేసినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ (railway ministry) వెల్లడించింది. ఐఆర్ సీటీసీ ఈ-టికెట్ (ITCTC E-ticket) బుకింగ్ విధానంలో మాత్రం ఎటువంటి మార్పులు లేనట్టు రైల్వే శాఖ స్పష్టంచేసింది. రైల్వే ప్రయాణికులంతా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అరగంట ముందు లేదా చివరి నిమిషంలో టికెట్ బుక్ చేసుకున్నప్పటికీ రైల్వే స్టేషన్ కు మాత్రం యథావిధిగా 2 గంటల ముందే చేరుకోవాలన్న రైల్వే శాఖ నిబంధనల్లో ఎటువంటి మార్పు లేదు.

4 గం. ముందు చార్ట్
రైల్వే టికెట్ బుకింగ్ సంబంధించిచ రిజర్వేషన్ చార్ట్ రైలు బయలు దేరడానికి సుమారు 4 గంటల ముందే రెడీ అవుతుంది. ఈ చార్ట్ లో రైల్లో ఎన్నిఖాళీ సీట్లున్నాయో తెలుస్తుంది. అప్పుడు ప్రయాణికులు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టం కౌంటర్ (PRS) లేదా ఆన్ లైన్ (online) ద్వారా మిగిలిపోయిన సీట్లను హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు.

e-టికెట్ బుక్ చేయడం ఎలా (how to book e ticket)?
ఐఆర్ సీటీసీ డాట్ కో డాట్ ఇన్ పేజ్ లాగిన్ (IRCTC.co.in)అవ్వండి. ఆతరువాత ఐఆర్ సీటీసీ అకౌంట్ ను క్రియేట్ (create IRCTC account) చేసుకోండి. మీరు వెళ్లాలనుకుంటున్న ఊరు, ప్రయాణం తేదీ, ఏ క్లాస్ లో ప్రయాణించాలనుకుంటే ఆ క్లాస్ ఆప్షన్స్ ను ఎంచుకుని ఫైండ్ ట్రైన్స్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఈ లిస్టులో మీకు నచ్చిన రైలును ఎంచుకుని, చెక్ అవైలబిలిటీ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి, ఆతరువాత టికెట్ ధరను క్లిక్ చేయాలి. ఇప్పుడు బుక్ నౌ (book now)ఆప్షన్ క్లిక్ చేసి, ప్రయాణికుల పేరు, వయసు, లింగం, కావాల్సిన బర్త్ వంటి వివరాలన్నీ నమోదు చేయాలి. కోడ్, ఫోన్ నంబరు ఎంటర్ చేసి, బుకింగ్ ఆప్షన్ పై కంటిన్యూ అని క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు పేమెంట్ ఆప్షన్ వస్తుంది. టికెట్ ధర చెల్లించగానే మీ ఈ టికెట్ (e ticket) బుక్ అయినట్టు ఎస్ ఎంఎస్, మెయిల్ ద్వారా, కన్ఫర్మేషన్ వస్తుంది. అంతే మీ ఎలక్ట్రానిక్ టికెట్ బుక్ అయిపోయినట్టే.
Published by: Sumanth Kanukula
First published: November 6, 2020, 3:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading