IRCTC: రైలులో వెళ్తున్నారా? ఈ 11 ఐడీ ప్రూఫ్స్ చూపించొచ్చు

IRCTC | డిజీ లాకర్ యాప్‌లో ఉన్న ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ ఏదైనా చూపించొచ్చు. అయితే డిజీ లాకర్ యాప్‌లో “Issued” సెక్షన్‌లో ఉన్న డాక్యుమెంట్స్‌నే అనుమతిస్తారు. “Uploaded” సెక్షన్‌లో ఉన్నవాటిని అనుమతించరు.

news18-telugu
Updated: May 19, 2019, 3:02 PM IST
IRCTC: రైలులో వెళ్తున్నారా? ఈ 11 ఐడీ ప్రూఫ్స్ చూపించొచ్చు
IRCTC: రైలులో వెళ్తున్నారా? ఈ 11 ఐడీ ప్రూఫ్స్ చూపించొచ్చు (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఐఆర్‌సీటీసీలో రైలు టికెట్ బుక్ చేసుకున్నవారు ప్రయాణం సమయంలో ఏదో ఒక ఐడీ ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. అయితే చాలామంది ఐడీ ప్రూఫ్స్ విషయంలో కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. ఒక్కోసారి ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లడమే మర్చిపోతుంటారు. బుకింగ్ సమయంలో ఫోటో ఐడీ కార్డ్ వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ ప్రయాణం సమయంలో ఐడీ ప్రూఫ్ తప్పనిసరిగా చూపించాలి. అది కూడా ఒరిజినల్ కార్డ్ తీసుకెళ్లాలి. జిరాక్స్ అనుమతించరు. మరి ఇ-టికెట్ తీసుకున్నవాళ్లు రైలులో చూపించాల్సిన ఫోటో ఐడెంటిటీ కార్డ్స్ ఏవో తెలుసుకోండి.


1. పాస్‌పోర్ట్.
2. ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఫోటో ఓటర్ ఐడీ కార్డ్.3. డ్రైవింగ్ లైసెన్స్.
4. పాన్ కార్డ్.
5. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఫోటో ఐడీ కార్డ్.
6. విద్యాసంస్థలు ఫోటోతో జారీ చేసిన స్టూడెంట్ ఐడీ కార్డ్.
7. ఫోటోతో ఉన్న నేషనలైజ్డ్ బ్యాంక్ పాస్ బుక్.
8. ఫోటోతో బ్యాంకులు ఇచ్చిన క్రెడిట్ కార్డ్స్.
9. ఆధార్ కార్డ్. మొబైల్ ఆధార్ కూడా చూపించొచ్చు.
10. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, జిల్లా పాలనా సంస్థలు, మున్సిపల్ సంస్థలు, పంచాయతీలు జారీ చేసిన ఫోటో ఐడీ కార్డ్.
11. డిజీ లాకర్ యాప్‌లో ఉన్న ఒరిజినల్ ఐడీ ప్రూఫ్ ఏదైనా చూపించొచ్చు. అయితే డిజీ లాకర్ యాప్‌లో “Issued” సెక్షన్‌లో ఉన్న డాక్యుమెంట్స్‌నే అనుమతిస్తారు. “Uploaded” సెక్షన్‌లో ఉన్నవాటిని అనుమతించరు.

రైలు టికెట్ రిజర్వ్ చేసుకొని ప్రయాణించే సమయంలో ఈ ఐడీ కార్డుల్లో ఏదో ఒకటి తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ ఐడీ కార్డు చూపించకపోతే టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నట్టు పరిగణిస్తుంది రైల్వే. అలాంటివారిపై రైల్వే నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయి.

Realme C2: బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ రియల్‌మీ సీ2... ధర రూ.5,999 మాత్రమే


ఇవి కూడా చదవండి:

Samsung: సాంసంగ్ గెలాక్సీ ఎం20 ధర తగ్గింది

IRCTC: రైలు టికెట్‌లో 50% డిస్కౌంట్... ఇలా బుక్ చేయండి

IRCTC-SBI offer: ఫ్రీగా రైలు టికెట్... 10% క్యాష్‌బ్యాక్... ఆఫర్ ఇలా పొందండి
Published by: Santhosh Kumar S
First published: May 19, 2019, 3:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading