Video: పబ్లిక్‌లో ప్రపోజ్ చేసినందుకు జైలుపాలైన ప్రేమజంట

అందరి ముందు ఉంగరం తొడిగి ప్రేమను వ్యక్తం చేశాడు. అక్కడే ఉన్నవాళ్లు ఈ దృశ్యాలను చిత్రీకరించారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తే ఇప్పటి వరకు 33 లక్షల మంది చూడటం విశేషం.

news18-telugu
Updated: March 12, 2019, 1:12 PM IST
Video: పబ్లిక్‌లో ప్రపోజ్ చేసినందుకు జైలుపాలైన ప్రేమజంట
పబ్లిక్‌లో ప్రపోజ్ చేసినందుకు జైలుపాలైన ప్రేమజంట (ప్రతీకాత్మక చిత్రం)
news18-telugu
Updated: March 12, 2019, 1:12 PM IST
పబ్లిక్‌లో పెళ్లికి ప్రపోజ్ చేయడం... ఆ దృశ్యాలను అందరూ చిత్రీకరిస్తుండటం... అబ్బాయి ప్రతిపాదనకు అమ్మాయి ఓకే చెప్పడం... ఆ తర్వాత ఇద్దరూ భావోద్వేగాలతో తమ ప్రేమను పంచుకోవడం... ఇలాంటి వీడియోలు కుప్పలుతెప్పలుగా కనిపిస్తుంటాయి. ఇలా పబ్లిగ్గా ప్రపోజ్ చేయడం కొత్తేమీ కాదు. కానీ... పబ్లిక్‌లో ప్రపోజ్ చేసినందుకు ఓ జంట జైలుపాలైన ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ప్రేమజంట కటకటాలపాలవడానికి కారణం... వారిద్దరూ ఇస్లామిక్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని పోలీసులు భావించడమే. ఇరాన్‌లో జరిగింది ఈ ఘటన.





ఇరాన్‌లోని అరక్‌ పట్టణంలో ఓ షాపింగ్‌ మాల్‌లో తన ప్రేయసికి ప్రపోజ్ చేసేందుకు ఓ యువకుడు చాలా ఏర్పాట్లే చేశాడు. గులాబీ పువ్వుల రెక్కలతో హార్ట్ షేప్ డెకరేట్ చేశాడు. బెలూన్లతో అలంకరించాడు. తన ప్రేయసికి ప్రేమను ప్రపోజ్ చేశాడు. అందరి ముందు ఉంగరం తొడిగి ప్రేమను వ్యక్తం చేశాడు. అక్కడే ఉన్నవాళ్లు ఈ దృశ్యాలను చిత్రీకరించారు. ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తే ఇప్పటి వరకు 33 లక్షల మంది చూడటం విశేషం. ఈ మ్యారేజ్ ప్రపోజల్ వీడియో వైరల్‌గా మారింది. చివరకు ఆ జంటకు ఊహించని షాకిచ్చింది. ఇస్లామిక్ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆ తర్వాత బెయిల్‌పై విడుదల చేశారు. అయితే ప్రేమజంటను అరెస్ట్ చేయడంపై పోలీసులు విమర్శలు ఎదుర్కొంటున్నారు. వారిద్దరూ ఎలాంటి తప్పు చేయలేదని, ఎందుకు అరెస్ట్ చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Loading...
Photos: యంగెస్ట్ సెల్ఫ్-మేడ్ బిలియనీర్‌గా 21 ఏళ్ల కైలీ జెన్నర్

ఇవి కూడా చదవండి:

SBI Money Transfer: మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఎస్‌బీఐలో IMPS NEFT వివరాలు ఇవే...

www: వాల్డ్ వైడ్ వెబ్‌కు 30 ఏళ్లు... గూగుల్ స్పెషల్ డూడుల్... ఆసక్తికరమైన 10 అంశాలివే...

Railway Jobs: పది పాసైతే చాలు... రైల్వేలో 1,00,000 ఉద్యోగాలు... మార్చి 12 నుంచి రిజిస్ట్రేషన్
First published: March 12, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...