రాఫెల్ రాకతో వణికిన ఇరాన్... సరిహద్దుల్లో మూడు క్షిపణుల మోహరింపు...

ఫ్రాన్స్ నుంచి సోమవారం భారత్ బయల్దేరిన రాఫెల్ యుద్ధ విమానాలు... UAEలో ల్యాండ్ అవ్వడంతో... ఇరాన్ అలర్ట్ అయ్యింది. ఎందుకైనా మంచిదని మూడు క్షిపణుల్ని మోహరించింది.

news18-telugu
Updated: July 29, 2020, 11:17 AM IST
రాఫెల్ రాకతో వణికిన ఇరాన్... సరిహద్దుల్లో మూడు క్షిపణుల మోహరింపు...
రాఫెల్ రాకతో వణికిన ఇరాన్... సరిహద్దుల్లో మూడు క్షిపణుల మోహరింపు...
  • Share this:
రాఫెల్ యుద్ధ విమానాలు భారత్‌కి వస్తున్నాయంటే చాలు... చాలా దేశాలకు వెన్నులో వణుకు పుడుతోంది. ముందుగా అనుకున్న ప్రకారమే... 5 రాఫెల్ యుద్ధ విమానాలు... ఫ్రాన్స్‌లోని ఇస్ట్రెస్ ఎయిర్‌బేస్ నుంచి సోమవారం టేకాఫ్ అయ్యాయి. అవి UAEలోని అల్ ధఫ్రా ఎయిర్‌బేస్ దగ్గర ల్యాండ్ అయ్యాయి. ఆ తర్వాత బుధవారం ఇండియాలోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో ల్యాండ్ అవ్వాలన్నది షెడ్యూల్. ఇది మొత్తం 7364 కిలోమీటర్ల ప్రయాణం. ఐతే... జులై 28న అల్ ధఫ్రాలో రాఫెల్ విమానాలు ల్యాండ్ అవ్వగానే... UAE పక్కనే ఉండే ఇరాన్ టెన్షన్ పడింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్... మిలిటరీ ఎక్సర్‌సైజ్ తర్వాత... మూడు మిస్సైళ్లను (క్షిపణులను), అల్ ధఫ్రా ఎయిర్‌బేస్‌కి దగ్గర్లో మోహరించారు. అల్ ధఫ్రా అనేది... UAE రాజధాని నగరం అబు దాబీకి గంట ప్రయాణ దూరంలో ఉంటుంది.

ఇరాన్ ఎప్పుడైతే మిస్సైళ్లను మోహరించిందో... అల్ ధఫ్రాతోపాటూ... ఖతార్‌లోని AI యుడీడ్ ఎయిర్‌బేస్‌కి అలర్ట్ మెసేజ్‌లు వెళ్లాయి. అటు వైపుగా ఇరాన్ క్షిపణులు వచ్చే అవకాశం ఉందన్నది ఆ అప్రమత్త సందేశం. ఐతే... ఇరాన్ ఏ మిస్సైళ్లనూ పంపలేదు. ఆ రెండు ఎయిర్‌బేస్‌లలో అమెరికా దళాలు ఉన్నాయి. అవి పూర్తిగా అలర్ట్ అయ్యాయి. ఇరాన్ తన సముద్ర జలాల్లో మిస్సైళ్లను మోహరించిందని తెలుసుకున్నాయి. ఐతే... ఇరాన్ వర్గాలు మాత్రం తమ మిలిటరీ ఎక్సర్‌సైజ్‌లో అది భాగమంటున్నాయి.

మంగళవారం ఇరాన్ సైన్యానికి చెందిన ఓ స్పీడ్ బోట్ నుంచి ఓ క్షిపణి దూసుకెళ్లింది. అది కూడా మిలిటరీ ఎక్సర్‌సైజులో భాగమే అని ఇరాన్ తెలిపింది.

రాఫెల్ యుద్ధ విమానాలతో తమపై దాడి చేస్తారేమో అనే భయంతోనే ఇరాన్... క్షిపణుల్ని రెడీ చేసుకొని ఉంటుందనే అనుమాలు కలుగుతున్నాయి. ఆ విమానాలు ఇండియా వెళ్తాయని తెలిసినా... ఎందుకైనా మంచిదని ఇరాన్ అప్రమత్తమై ఉంటుందనే అభిప్రాయం ఉంది. ఇదివరకు ఇరాన్, ఇండియా మధ్య సత్సంబంధాలు ఉండేవి. అమెరికా ఒత్తిడి కారణంగా... భారత్... ఇరాన్‌కి దూరమైంది. అప్పటి నుంచి ఇరాన్... చైనా వైపు మాట్లాడుతూ... భారత్‌ను తనకు శత్రుదేశం అన్నట్లుగా చూస్తోంది. భారత్ మాత్రం ఇరాన్ పట్ల సానుకూలంగానే వ్యవహరిస్తోంది.
Published by: Krishna Kumar N
First published: July 29, 2020, 11:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading