హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

అమెరికా మిలటరీ బేస్ క్యాంప్‌‌లపై రాకెట్లతో విరుచుకుపడ్డ ఇరాన్.. వీడియో..

అమెరికా మిలటరీ బేస్ క్యాంప్‌‌లపై రాకెట్లతో విరుచుకుపడ్డ ఇరాన్.. వీడియో..

ఇరాన్ క్షిపణి దాడులు

ఇరాన్ క్షిపణి దాడులు

ఇరాన్ ఆర్మీ చీఫ్ సులేమాన్ హత్యకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఆ దేశం అనుకున్నట్లుగానే దాడులకు దిగింది. అమెరికా చేసిన దాడికి ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది.

ఇంకా చదవండి ...

    ఇరాన్ ఆర్మీ చీఫ్ సులేమాన్ హత్యకు అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించిన ఆ దేశం అనుకున్నట్లుగానే దాడులకు దిగింది. అమెరికా చేసిన దాడికి ప్రతీకారంగా ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా బాలిస్టిక్ క్షిపణులతో దాడులు చేసింది. అసద్, ఎర్బిల్ బేస్‌లపై దాదాపు 12 క్షిపణులతో ఇరాన్ సైన్యం దాడులు చేసింది. అమెరికా మిత్ర దేశాలపైనా దాడులు చేస్తామని ఇరాన్ ప్రకటించింది. ఇది ఆరంభమేనని, మున్ముందు దాడులు తీవ్రతరం చేస్తామని ఆ దేశం మంగళవారం ఒక ప్రకటనలో హెచ్చరించింది. ఈ చర్యపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఘటన నేపథ్యంలో గల్ఫ్‌లో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నెలకొంది.

    Published by:Shravan Kumar Bommakanti
    First published:

    Tags: Donald trump, Iran, Iraq, USA

    ఉత్తమ కథలు