దొంగల మధ్య తిరిగితే సాధారణ మనుషులు కూడా దొంగలుగా మారిపోతారంటారు పెద్దలు. అయితే సామాన్యులే కాదు.. ఎలుకలు కూడా ఈ మధ్య చోరీలకు పాల్పడుతున్నాయి. దొంగల మధ్య తిరుగుతూ దొంగ బుద్ధిలు వచ్చాయో ఏమో కానీ.. అప్పుడెప్పుడో ఓ ఎలుకల ముఠా బంగారాన్ని ఎత్తుకెళ్లిన ఘటన మరవకముందే.. అలాంటి ఘటనే మరొకటి రిపీట్ అయ్యింది. ఈసారి బంగారం కాదు.. ఏకంగా డైమండ్‌కే గురి పెట్టింది ఓ ఎలుక. సైలెంట్‌గా షాప్‌లోకి వచ్చి నెక్లెస్‌ను పట్టుకుపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
#अब ये चूहा डायमंड का नेकलेस किसके लिए ले गया होगा.... ???????? pic.twitter.com/dkqOAG0erB
— Rajesh Hingankar IPS (@RajeshHinganka2) January 28, 2023
బంగారం షాపుల్లో కస్టమర్లను ఆకట్టుకునేందుకు కొన్ని ఆభరణాలను డిస్‌ప్లేలలో ఉంచుతుంటారు. అయితే.. ఉన్నట్లుండి ఉండి డిస్‌ప్లే ఉన్న ఉంచిన ఓ ఖరీదైన నెక్లెస్ మాయమైంది. చోరీ ఎలా జరిగింది అన్న విషయం సిబ్బందికి అర్థం కాలేదు. షాపు ఓనర్‌తో కలిసి సీసీ టీవీ పుటేజీని చెక్ చేస్తుండగా.. అందులో కనిపించిన సీన్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఓ ఎలుక ఆ నెక్లెస్‌ను ఎత్తుకెళ్లింది. ఈ ఘటన కేరళలోని కాసర్‌గడ్‌లో జరిగింది. అర్థరాత్రి సమయంలో షాప్‌లోకి దొంగలాగా ఎంట్రీ ఇచ్చిన ఎలుక .. డిస్ ప్లేలో ఉంచిన నెక్లెస్‌ల వద్దెకు వెళ్లింది. దానికి ఏమీ అనిపించిందో తెలీదు కానీ.. టైమ్ వేస్ట్ చేయకుండా వెంటనే నెక్లెస్‌ను నోటి దగ్గర పెట్టుకొని అక్కడ నుంచి పరారైంది.
వజ్రాల హారాన్ని ఎలుక చోరీ చేసిన వీడియోను ఐపీఎస్ అధికారి రాజేష్ హింగస్కర్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు. వీడియోకు 'ఈ ఎలుక ఆ డైమండ్ నెక్లెస్ ఎవరికి తీసుకెళ్లిందో?' అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. అంతే.. వీడియో ఫుల్ వైరల్‌గా మారింది. దీనిపై ట్విట్టర్ యూజర్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. వాలెంటైన్స్ డే దగ్గరి వస్తుంది కదా.. ఆ ఎలుక తన లవర్ కోసం నెక్లెస్‌ను తీసుకువెళ్లి ఉంటుందని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది ఇది ధూమ్-4 సినిమారా అంటూ కామెంట్లు పెడుతున్నారు.మరి కొందరు తన గర్ల్‌ఫ్రెండ్ కోసమే డైమండ్ నెక్లెస్ కొట్టేసిందంటూ ట్వీట్స్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Viral Videos