ఎన్నికల సంవత్సరం కావడంతో ఈసారి ఐపీఎల్ ఎక్కడ జరుగుతుందనే అంశంపై క్రీడా ప్రపంచంలో ఎడతెరిపి లేని చర్చ జరుగుతోంది. ఈ అంశంపై ఇప్పుడొక క్లారిటీ వచ్చేసింది. ఇండియాలోనే ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరగబోతోంది.
సమ్మర్ సీజన్లో మరింత హాట్‌గా మార్చి.. క్రీడాభిమానుల్లో జోష్ నింపే ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్).. ఈసారి ముందే హాట్ టాపిక్‌గా నిలిచింది. ఎన్నికల సంవత్సరం కావడంతో (ఇండియన్ ప్రీమియర్ లీగ్) ఐపీఎల్ 12వ ఎడిషన్ ఎక్కడ జరుగుతుందనే దానిపై పెద్ద చర్చే జరిగింది. ఒకానొక సమయంలో ఈసారి ఐపీఎల్ విదేశాల్లో జరిగే అవకాశం ఉందనే ప్రచారమూ జరిగింది. అయితే, ఆ పుకార్లన్నింటికి పుల్‌స్టాప్ పెట్టేస్తూ.. వివో ఐపీఎల్ 2019 ఇండియాలోనే జరగబోతోందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ ప్రకటించింది.
గత డిసెంబర్లో ఐపీఎల్ -12కు సంబంధించి ఆటగాళ్ల కొనుగోళ్ల కోసం జైపూర్‌లో బీసీసీఐ వేలం పాట నిర్వహించింది. అయితే, లీగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం మాత్రం తెలియరాలేదు. అయితే తాజాగా, సుప్రీంకోర్టు వేసిన అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ.. ఐపీల్ -12 నిర్వహణపై స్పష్టమైన ప్రకటన చేసింది. ఈ ఏడాది మార్చి 23 నుంచి వివో ఐపీఎల్ 2019 ప్రారంభమవుతుందని తెలిపింది. అయితే, ఐపీఎల్ -12కు సంబంధించి ప్రారంభం వేడుక, మ్యాచ్‌లు నిర్వహించే వేదికలు, వాటి తేదీలు.. తదితర వివరాలను వెల్లడించలేదు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్‌ను బట్టి.. త్వరలోనే మ్యాచ్‌ల తేదీలపై క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఐపీఎల్‌లోని అన్ని ఫ్రాంచైజీలకు సమాచారం అందించింది.
బీసీసీఐ ఆద్వర్యంలో నిర్వహించబడుతున్న ఐపీఎల్.. దేశంలోకాదు, అంతర్జాతీయంగానూ ఫేమస్సైంది. ఈ లీగ్.. గతంలో రెండుసార్లు మాత్రమే విదేశాల్లో జరిగింది. 2009లో సాధారణ ఎన్నికల రావడంతో లీగ్ వేదిక సౌతాఫ్రికకు తరలిపోయింది. 2014లో మరోసారి ఎన్నికల కారణంగా యూఏఈకి తరలిపోయింది. అయితే, ఈసారి కూడా ఎన్నికల సంవత్సరం కావడంతో మరోసారి ఐపీఎల్ విదేశీ వేదికగా జరుగుతుందనే ప్రచారం జరిగింది. అయితే, తాజాగా సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన ప్రకటనతో ఆ ప్రచారానికి తెరపడినట్టైంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.