విరాట్ కోహ్లీ చెత్త రికార్డు...ఐపీఎల్‌ చరిత్రలో ఓటమిలో నెం.1

IPL 2019: విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో ఓ చెత్త రికార్డును తన ఖాతాలు వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లలో ఓడిపోయిన ఆటగాడుగా కోహ్లీ అపఖ్యాతి మూటగట్టుకున్నాడు.

news18-telugu
Updated: April 6, 2019, 12:02 PM IST
విరాట్ కోహ్లీ చెత్త రికార్డు...ఐపీఎల్‌ చరిత్రలో ఓటమిలో నెం.1
విరాట్ కోహ్లీ
  • Share this:
ఐపీఎల్ 2019: విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో ఓ చెత్త రికార్డును తన ఖాతాలు వేసుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక మ్యాచ్‌లలో ఓడిపోయిన ఆటగాడుగా కోహ్లీ అపఖ్యాతి మూటగట్టుకున్నాడు. ఐపీఎల్ 86 మ్యాచ్‌లలో ఓడిపోయిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు కోహ్లీ. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ ఆటగాడూ ఇన్ని మ్యాచ్‌లలో ఓడిపోలేదు. అయితే వ్యక్తిగతంగా ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడి రికార్డు కూడా విరాట్ కోహ్లీ సొంతం కావడం విశేషం. ఐపీఎల్‌లో అత్యధిక ఓటములు చెవిచూసిన జట్టు సభ్యుల జాబితాలో విరాట్ కోహ్లీ తర్వాత అమిత్ మిశ్రా, ఏబీ డీ విల్లియర్స్ ఉన్నారు. వీరు 75 సార్లు ఓటమి చెందిన జట్టులో సభ్యులుగా ఉన్నారు.

RCB vs KKR, rcb vs kkr live score, royal challengers Bangalore vs kolkata knight riders ipl 2019, ipl 2019, royal challengers bangalore, RCB Ipl 2019, ipl points table rcb, virat kohli runs in ipl 2019, ab de Villiers ipl 2019, chahal wickets ipl 2019, umesh yadav wickets 2019 ipl, ఐపిఎల్ 2019, ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ 2019, విరాట్ కోహ్లీ 2019, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 2019 ఐపీఎల్, యజ్వేంద్ర చాహాల్ వికెట్స్ 2019 ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2019, ఐపీఎల్ పాయింట్ల పట్టిక ఆర్‌సీబీ, బెంగళూరు విరాట్ కోహ్లీ ఏబీ డివిల్లియర్స్
విరాట్ కోహ్లీకి ఇది ఐపీఎల్‌ కెరీర్‌లో 35వ హాఫ్ సెంచరీ...


ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు పరాజయాల పరంపర కొనసాగుతోంది. శుక్రవారం వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ రాయల్ ఛాలెంజర్స్ జట్టు పరాజయం చెందింది. శుక్రవారంనాటి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై కోల్‌కత్తా నైట్ రైడర్స్‌ ఐదు వికెట్ల తేడాతో విజయం సాదించింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ(84) అర్ధ శతకంతో మెరుపు ఇన్నింగ్స్ ఆడినా వృధా ప్రయాసగానే మిగిలిపోయింది.
Published by: Janardhan V
First published: April 6, 2019, 12:01 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading