IPHONE 13 GIFTED TO KACHA BADAM SINGER BY DELHI FAN PVN
Kacha Badam Singer : సోషల్ మీడియా పుణ్యం..మొన్నటిదాకా సైకిల్ పై పల్లీలు అమ్ముకునేవాడు ఇప్పుడు ఐఫోన్ తో బిజీ
కచ్చా బాదం సింగర్ భూబన్ బద్యాకర్
Kacha Badam Singer : పశ్చిమ బెంగాల్(West Bengal)కు చెందిన భూబన్ బద్యాకర్(Bhuban Badyakar )అనే పల్లీల వ్యాపారి..సైకిల్ పై పల్లీలు అమ్ముతూ చేతిలో డొక్కు ఫోన్ పట్టుకొని సరదాగా కచ్చా బాదం(Kacha Badam) అంటూ పాడిన పాటకు ప్రపంచమే ఫిదా అయిపోయింది. సెలబ్రెటీల నుంచి ప్రతిఒక్కరూ కచ్చా బాదం అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు.
Kacha Badam Singer : పశ్చిమ బెంగాల్(West Bengal)కు చెందిన భూబన్ బద్యాకర్(Bhuban Badyakar )అనే పల్లీల వ్యాపారి..సైకిల్ పై పల్లీలు అమ్ముతూ చేతిలో డొక్కు ఫోన్ పట్టుకొని సరదాగా కచ్చా బాదం(Kacha Badam) అంటూ పాడిన పాటకు ప్రపంచమే ఫిదా అయిపోయింది. సెలబ్రెటీల నుంచి ప్రతిఒక్కరూ కచ్చా బాదం అంటూ తెగ ట్రెండ్ చేస్తున్నారు. ఇప్పటికీ ఈ కచ్చా బాదం క్రేజ్ తగ్గనేలేదు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతిఒక్కరిని ఆకట్టుకుంటోంది ఈ పాట. అంత క్రేజ్ వచ్చింది. ఈ పాట సోషల్ మీడియా(Social Media)లో సెన్సేషన్ అవడంతో సైకిల్ పై పల్లీలు అమ్ముకునే స్థాయి నుంచి సెలబ్రిటీగా ఎదిగాడు భూబన్ బద్యాకర్. ఓవైర్ నైట్ స్లార్ గా మారిపోయిన భూబన్ బద్యాకర్ ఇప్పుడు..లైవ్ షోలలో అతని పాట "కచా బాదం"ని ప్రదర్శించడం ప్రారంభించాడు. తాజాగా భూబన్ బద్యాకర్... ఢిల్లీలో ఉన్న తన అభిమాని నుండి సరికొత్త Apple iPhone 13ని బహుమతిగా అందుకున్నాడు.
ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భూబన్ బద్యాకర్ పాల్గొన్నారు. ఢిల్లీలో భూబన్ బద్యాకర్ నిర్వహించిన ప్రదర్శన కార్యక్రమానికి జనం పెద్ద ఎత్తున తరలివచ్చారు. . ఆ ప్రదర్శనలో, అతను తన ప్రసిద్ధ హిట్ కచా బాదం సాంగ్ పాడి అందరినీ ఆకట్టుకున్నాడు. కార్యక్రమం అనంతరం ఓ వ్యక్తి సార్ నేను మీ అభిమానిని అంటూ ఐఫోన్ 13ని గిఫ్ట్ గా భూబన్ బద్యాకర్ కి ఇచ్చాడు. మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భుబన్ మాట్లాడుతూ.. ఈ ఐఫోన్ అందుకోవడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. తన పాట విన్న తర్వాత, ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి తనకు ఊహించని గిఫ్ట్ ఇచ్చాడని చెప్పారు." ప్రజలు నన్ను ఆశీర్వదించారు మరియు ఇప్పుడు నేను గుర్తించబడ్డాను. ఇది జరుగుతుందని మరియు నా జీవితంలో ఇంత మంచి విషయాలు వస్తాయని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేను ఈ ఫోన్‌తో ఫోటోలు క్లిక్ చేస్తున్నాను" అని భూబన్ బద్యాకర్ చెప్పారు.
Apple iPhone 13 ఇప్పటి వరకు వచ్చిన స్మార్ట్‌ఫోన్ లలో కొన్ని ఉత్తమ కెమెరాలను అందిస్తుంది. రెండు 12-మెగాపిక్సెల్ కెమెరాలు వెనుక డ్యూయల్-కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. కెమెరాల ద్వారా 4కె రిజల్యూషన్ వీడియోలను క్యాప్చర్ చేయవచ్చు. అదనంగా, ముందు వైపున ఉన్న 12-మెగాపిక్సెల్ కెమెరా మెరుగైన కాంట్రాస్ట్ కోసం స్మార్ట్ HDRతో 4K వీడియోని క్యాప్చర్ చేస్తుంది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.