Home /News /trending /

INTERNATIONAL YOGA DAY 2020 YOGA WITH MODI INSTRUCTIONAL YOGA SERIES FEATURING 3D AVATAR OF PM MODI IS NOW STREAMING NK

Yoga with Modi : ప్రధాని మోదీతో కలిసి యోగా చెయ్యండి... త్రీడీ అవతార్‌ వీడియో...

ప్రధాని మోదీతో కలిసి యోగా చెయ్యండి... త్రీడీ అవతార్‌ వీడియో... (credit - Youtube)

ప్రధాని మోదీతో కలిసి యోగా చెయ్యండి... త్రీడీ అవతార్‌ వీడియో... (credit - Youtube)

International Yoga Day 2020 : యోగాసనాలపై మీకు ఏ అవగాహనా లేకపోయినా... మోదీ త్రీడీ అవతార్ వీడియో చూస్తే అన్నీ అర్థమైపోతాయి.

    International Yoga Day 2020 : ఆరో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా... కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కలిసి... ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... త్రీడీ అవతార్ యోగాసనాల్ని ప్రజల ముందుకు తెచ్చాయి. ఇదో యానిమేషన్ యోగా సిరీస్. ఇందులో ప్రధాని మోదీ లాంటి త్రీడీ అవతారం ఉంటుంది. ఈ అవతారం రకరకాల యోగాసనాలు వేస్తుంది. ఏ ఆసనం ఎలా వెయ్యాలో, దాని వల్ల కలిగే లాభాలేంటో చెబుతుంది. ఈ అవతారం అచ్చం ప్రధానమంత్రి నరేంద్ర మోదీలా ఉంటుంది. అందువల్ల స్వయంగా ప్రధాని మోదీయే అవి చెబుతున్నట్లుగా ఫీలవుతున్నారు నెటిజన్లు.

    యోగాపై మరింత ఎక్కువ మందికి అవగాహన కలిగించేందుకు ఈ యూట్యూబ్ వీడియోని అందుబాటులోకి తెచ్చారు. ఇది మొత్తం 47 నిమిషాలు ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్కరూ కామన్‌గా చేసే యోగాసనాల్ని చూపించారు. అందుకే దీన్ని కామన్ యోగా ప్రోటోకాల్ (CYP) అంటున్నారు. ఇందులో మోదీ అవతారం వేసే యోగాసనాల్ని... మోరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా వారు వేస్తుంటారు.

    ప్రస్తుతం కరోనా కాలం కావడంతో... ఈ డిజిటల్ యోగా క్లాస్ చాలా మందికి నచ్చుతోంది. పిల్లలు, పెద్దలు అందరూ వేయతగ్గ విధంగా ఇందులో ఈజీ ఆసనాల్ని చూపించారని అంతా అంటున్నారు. ఇంత హై క్వాలిటీలో త్రీడీ అవతారం ఉండటం చాలా బాగుందంటున్నారు. దీన్ని యూట్యూబ్‌లో Yoga With Modi అని సెర్చ్ చేస్తే లభిస్తోంది. బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్... మొత్తం 17 యోగాసనాల యానిమేషన్ వీడియోలను కలిపి ఈ పెద్ద వీడియోని తయారుచేసింది.


    యోగాసనాల్ని సరైన పద్ధతిలో నేర్చుకోవాల్సి ఉంటుంది. అందుకు ఈ వీడియోలో ప్రతీ యోగాసనమూ 100 శాతం కరెక్టుగా త్రీడీ అవతారం చేస్తుందని తెలిపారు. ఆ అవతారం చెప్పినట్లే చేస్తే... కండరాలు, అస్థి పంజరం, ఊపిరి వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ అన్నీ బాగా పనిచేస్తాయని తెలిపారు.

    మొత్తానికి యోగాకి ఎంత ప్రజాదరణ కల్పించాలో అంతా కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది. వీలైనంత ఎక్కువ మందికి యోగాను చేర్చేందుకు ఈ త్రీడీ అవతార్ వీడియో ఉపయోగపడుతోంది.
    First published:

    Tags: Yoga day 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు