International Yoga Day 2020 : యోగాకి పుట్టినిల్లు భారత్. ఇది ప్రపంచమంతా విస్తరించింది. అన్ని దేశాలూ దీన్ని పాటిస్తున్నాయి. ఐతే... యోగాకి ప్రత్యేకంగా ఓ రోజును కేటాయించేందుకు ప్రపంచ దేశాలు ఎలా ఒప్పుకున్నాయి. జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం ఎలా సాధ్యమైంది? అన్నది ఆసక్తికర అంశం. 2015లో అంటే... ప్రధానిగా మోదీ అధికార బాధ్యతలు చేపట్టిన ఏడాది తర్వాత.... తొలిసారిగా ప్రపంచం జూన 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంది. ఈసారి కరోనా కారణంగా... ఇంట్లోనే యోగా... కుటుంబంతో యోగా అనే నినాదాన్ని ప్రపంచం తీసుకుంది.
యోగా దినోత్సవాన్ని ప్రపంచం జరుపుకునే ముందు... 2014 సెప్టెంబర్‌లో... ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో... ప్రధాని మోదీ... జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుందామని పిలుపిచ్చారు. పక్కనే ఉన్న చైనా ముందుగా... ఈ ప్రతిపాదనను ఒప్పుకుంది. ఆ తర్వాత అమెరికా, రష్యా, జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ వెంటనే ఒప్పుకున్నాయి. ఆఫ్రికా దేశమైన మొజాంబిక్ సైతం... ఈ ప్రతిపాదనను వేగంగా అంగీకరించింది.
యోగా ఎంత డెవలప్ అయితే ఇండియాకి అంత మంచిది. ఎందుకంటే... ఇండియాలో యోగా స్కూల్స్ ఉన్నాయి. యోగా గురువులు ఉన్నారు. యోగాతో టూరిజం కూడా డెవలప్ అవుతుంది. ప్రధాని కోరికను మొత్తం 177 దేశాలు వరుసగా ఒప్పుకున్నాయి. మోదీ ప్రతిపాదించిన 75 రోజుల్లో ఈ సర్వవ్యాప్త ఆమోదం లభించింది. దాంతో ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి... అధికారికంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న జరుపుతోంది.
ఇప్పుడు యోగాతో ఇండియా ఖ్యాతి మరింత పెరిగింది. ప్రపంచ దేశాల ప్రజలంతా యోగా నేర్చుకొని ఆరోగ్యాన్ని పెంచుకుంటున్నారు. అదే సమయంలో ఇండియా గొప్పదనాన్ని తెలుసుకుంటున్నారు. యోగా నేర్చుకోవడానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు ఇండియా వస్తున్నారు. మొదటిసారి 2015లో ఢిల్లీ... రాజ్‌పథ్ దగ్గర జరిగిన యోగా డేకి 37వేల మంది వచ్చి పాల్గొన్నారు. ఆ రోజున ప్రధాని మోదీ స్వయంగా అరగంటపాటూ రకరకాల ఆసనాలు వేశారు. అప్పటి నుంచి ఏటా యోగా అత్యద్భుతంగా జరుగుతోంది. 2015లో మోదీ ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి... యోగా మంత్రిని కూడా నియమించారు.
పురాతన కాలం నాటి ఆరోగ్య సూత్రాన్ని ప్రపంచం మొత్తం పాటించేలా చేయడంలో ప్రధాని మోదీ చాలా చక్కగా వ్యవహరించారు. ఆర్యభట్ట కనిపెట్టిన జీరో ఎలాగైతే ప్రపంచానికి ఉపయోగపడుతోందో... యోగా కూడా అలాగే హెల్త్ ఫార్ములాగా మారింది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.