హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Tallest Dog: వామ్మో ఇది శునకం కాదు.. జిరాఫీనా..? దీనికి ఉన్న ఫాలోవర్ల సంఖ్య ఎంతో తెలుసా..?

Tallest Dog: వామ్మో ఇది శునకం కాదు.. జిరాఫీనా..? దీనికి ఉన్న ఫాలోవర్ల సంఖ్య ఎంతో తెలుసా..?

ఇది కుక్కా లేకా జిరాఫీనా..?

ఇది కుక్కా లేకా జిరాఫీనా..?

సోషల్ మీడియాలో ఓ కుక్క హాట్ టాపిక్ గా మారింది. దాని పేరుతో అకౌంట్ ఓపెన్ చేసిన వెంటనే లక్షల ఫాలోవర్లు పెరిగారు. ఇప్పుడు ఆ కుక్క చేష్టలు చూసి నెటిజన్లు తెగ ఫిధా అవుతున్నారు. ఇంతకీ దాని స్పెషల్ ఏంటో తెలుసా..?

  కొన్ని ముచ్చట్ల క్షణాల్లో వైరల్ గా మారిపోతాయి.. తాజాగా ఓ శునకం ఇప్పుడు నెట్టింట ట్రెండిగ్ గా మారింది. ఎందుకంటే దాని హైట్ హాట్ టాపిక్ అయ్యేలా చేసింది. దాని పొడువు చూసి అంతా విస్తుపోతున్నారు. వామ్మో.. అని నోరెళ్లబెడుతున్నారు. ఇంత పొడవు ఎలా ఉందిరా బాబు.. అంటూ విస్తుపోతున్నారు. ఎరిస్.. అనే శునకం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరిని అట్రాక్ట్ చేస్తోంది. ఇది కుక్కనా? లేక జిరాఫీనా? అని అనే అనుమానం కలుగుతోంది. తెలుపు రంగులో ఉన్న ఈ కుక్క టాన్ బొర్జాయ్ జాతికి చెందినది. ఫైవ్ ఫీట్ ఉంది. పొడవు ఏడు ఇంచులు ఉంది. ఈ కుక్క తన రెండు కాళ్లపై నిలబడితే.. జిరాఫీనే తలదన్నేలా ఉంది. దీంతో యజమానికి కూడా పాట్లు తప్పడం లేదు. ఆ కుక్క బయటకు వెళ్లిపోతుంది అనే భయంతో యజమాని ఇంటి గేటుని చాలా ఎత్తుగా కట్టించాడు. తన పెంపుడు కుక్క గేటు దూకి బయటకు వెళ్లకుండా చాలా ఎత్తులో గేటుని నిర్మించాడు. ఎరిస్ ఫొటోలను దాని యజమాని సోషల్ మీడియాలో షేర్ చేసిని క్షణాల్లో వైరల్ గా మారాయి. దీంతో ఇది కుక్క కాదు జిరాఫీ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

  అంతేకాదు ఎరిస్ పేరుతో ఇన్ స్టాలో అకౌంట్ కూడా ఉంది. దీంతో ఆ కుక్కకు సైతం అభిమానులు విపరీతంగా పెరిగిపోయాడు. ఆ పేజ్ కు ఇప్పటికే రెండున్నర లక్షల ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఆది ఆడుతున్న సమయంలో తీసిన ఫొటోలు దాని యజమాని సోషల్ మీడియాలో పోస్టు చేస్తాడు. వాటిని చూసి అంతా ఎంజాయ్ చేస్తున్నారు.

  http://  View this post on Instagram

  A post shared by Eris The Borzoi (@eriszoi)
  ఎరిస్.. రష్యన్ హంటింగ్ సైట్ హౌండ్ జాతి కుక్క. సాధారణంగా వీటిని ఇళ్లలో పెంచుకుంటారు. చాలా ఎత్తైన బాడీ కలిగుంటాయి. పొడవైన కాళ్లు ఉంటాయి. మగ కుక్కలు 30-34 ఇంచుల పొడవు ఉంటాయి. ఆడ కుక్కలు 26-29 అంచుల పొడవు ఉంటాయి. ఈ జాతి శునకాలు 10 నుంచి 12ఏళ్లు వరకు జీవిస్తాయి. కానీ వాటిలో కూడా ఈ కుక్క మరింత హైట్ ఎక్కువగా ఉండడంతో ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ గా మారింది.

  ఇదీ చదవండి: నీ ధైర్యానికి జోహారు.. వట్టి చేతులతోనే పాముని ఎలా పట్టుకుందో చూడండి

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Dog, International news, Viral photo, Viral post, Viral Videos

  ఉత్తమ కథలు