International Cat Day 2020: కాఫీ వాసన నచ్చక పిల్లి ఏం చేసిందంటే...ఫన్నీ వీడియో...

International Cat Day 2020 | నేడు అంతర్జాతీయ పిల్లుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు జంతుప్రియులు. శునకాల తర్వాత తమ ఇళ్లలో చాలా మంది పిల్లలను పెంచుకుంటారు. వాటిని తమ కుటుంబంలో ఓ సభ్యుడిగా చూసుకుంటూ...లాలించి ‘పాలు’స్తారు. ఈ సందర్భంలో ఓ పిల్ల వీడియో వైరల్ అవుతోంది.

news18-telugu
Updated: August 8, 2020, 10:26 AM IST
International Cat Day 2020: కాఫీ వాసన నచ్చక పిల్లి ఏం చేసిందంటే...ఫన్నీ వీడియో...
కాఫీ కప్పును కప్పెట్టేసిన పిల్లి... వాసన నచ్చలేదు... వైరల్ ఫన్నీ వీడియో... (credit - reddit)
  • Share this:
పెంపుడు జంతువుల్లో శునకం తర్వాత ఎక్కవ మంది పెంచుకునేది పిల్లలు. పిల్లలను తమ కుటుంబ సభ్యుడిగా లాలించి ‘పాలు’ ఇస్తారు. నేడు అంతర్జాతీయ పిల్లుల దినోత్సవం(ఆగస్టు 8వ తేదీ)ను జరుపుకుంటున్నారు జంతు ప్రియులు. వాటితో ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నిస్తున్నారు.  ఈ సందర్భంగా ఓ పిల్లి వ్యవహారానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై ఓ ప్రత్యేక కథనం..

పిల్లులకు ఓ ప్రత్యేకత ఉంది. అవి ఎక్కడైనా ఉన్నాయంటే.... అందరి దృష్టీ వాటిపైనే ఉంటుంది. ఎందుకంటే... అవి అటెన్షన్ సీకర్స్. ఏదో ఒక చిలిపి పనిచేస్తూ... అందరూ తమవైపే చూసేలా చేసుకుంటాయి. ఇప్పటికే పిల్లులకు సంబంధించి చాలా ఫన్నీ వీడియోలు వచ్చాయి. మనం చూశాం. చాలా పిల్లులు తమ ఓనర్లతో ఆడుకుంటూ ఫన్ జెనరేట్ చేస్తాయి. ఇంకొన్ని కీర దోసకాయను చూస్తే చాలు... పరుగు అందుకుంటాయి. ఇంకొన్ని ఇంట్లోని వస్తువులతో ఎగురుతూ, అటూ ఇటూ కదులుతూ ఎంజాయ్ చేస్తాయి. తాజాగా రెడ్డిట్‌లో ఓ యూజర్... తన ఇంట్లో పెంచుకుంటున్న పిల్లి వీడియోని షేర్ చేసి... అందర్నీ నవ్విస్తున్నారు.

పిల్లులు మూత్రానికి వెళ్లినప్పుడు ఆ వాసన బయటకు రాకుండా మట్టితో కప్పెట్టేస్తాయి. అదే విధంగా ఈ పిల్లికి కాఫీ వాసన నచ్చలేదు. దాంతో... దాన్ని కప్పెట్టేందుకు ప్రయత్నించింది. అక్కడ మట్టి లేకపోయినా... టేబుల్‌పై తన కాళ్లతో మట్టిని కదుపుతున్నట్లు కదిపింది. ఆ ఫన్నీ వీడియోని నెట్‌లో షేర్ చేశారు.
He ‘buries’ coffee because he doesn’t like the smell. from r/cats


20 సెకండ్ల ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. కామెంట్లు టన్నుల కొద్దీ వస్తున్నాయి. చాలా మంది పిల్లుల ఓనర్లు... తమ అనుభవాల్ని షేర్ చేస్తున్నా్రు. ఓ యూజర్... తన పిల్లి... ఇంట్లోని ప్రతీదీ కప్పెట్టేస్తోందని చెప్పారు. బొమ్మలు, నీటి గిన్నెలు ఇలా దేన్నీ వదలట్లేదని తెలిపారు. మరో వ్యక్తి... తమ పిల్లికి తాము గిన్నెలో ఆహారం పెడితే... ఆహారం తినేసి... గిన్నెను కప్పెట్టేసిందని తెలిపారు. అది అలా ఎందుకు చేసిందో అర్థం కాలేదన్నారు. కాఫీలో తన వెంట్రుకల్ని పడేలా చేసేందుకే ఆ తుంటరి పిల్లి అలా చేసిందని మరో యూజర్ జోక్ చేశారు.
Published by: Krishna Kumar N
First published: August 8, 2020, 10:17 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading