దేశంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేతల్లో రతన్ టాటా ఒకరు. మంచి మనసు, వినూత్న ఆలోచనలు, సింప్లిసిటీతో ఆయన ప్రజల మనసుల్లో అత్యున్నతంగా ఉన్నారు. 1937లో ఇదే రోజు (డిసెంబర్ 28న) ఆయన గుజరాత్‌లోని సూరత్‌లో జన్మించారు. పాజిటివ్ థింకింగ్ ఆయనను ప్రస్తుతం ఈ స్థాయికి చేర్పించింది. ఈ రోజు ఆయన 83వ పుట్టిన రోజు కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.
- రతన్ తండ్రి నవల్ను టాటా సంస్థల వ్యవస్థాపకుడు జమ్సేట్జీ టాటా దత్తత తీసుకున్నారు.నానమ్మ హీరాబాయి టాటా దగ్గరే రతన్ టాటా చిన్నప్పటి నుంచి పెరిగారు.
- రతన్ టాటా హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువు పూర్తి చేసుకున్నారు (1975).
- ఐబీఎంలో ఉద్యోగం వచ్చినా వద్దనుకొని కుటుంబ వ్యాపారమైన టాటా స్టీల్‌లో ఉద్యోగిగా ఆయన ప్రస్థానం ప్రారంభించారు.
- జేఆర్డీ టాటా తర్వాత సంస్థకు ఐదో చైర్మన్‌గా రతన్ నాటా ఎంపికయ్యారు.
- టాటా చైర్మన్ అయ్యాక.. రతన్ టాటా ఎంతో విజయవంతమైన నిర్ణయాలు తీసుకున్నారు.
- జాగ్వార్, కోరస్, లాండ్ రోవర్, టెట్లీ లాంటి సంస్థలను కైవసం చేసుకొని టాటా గ్రూప్‌ను అంతర్జాతీయ సంస్థగా తీర్చిదిద్దారు.

రతన్ టాటా (ఫైల్)
- ప్రస్తుతం టాటా గ్రూప్స్ 96 వ్యాపారాల్లో ఉంది. 28 కంపెనీలు స్టాక్ ఎక్చేంజీలో ఉన్నాయి. దీంట్లో ఎక్కువ సంస్థలు రతన్ టాటా ఉన్నప్పుడు నెలకొల్పివే.
- ఖాళీ సమయాల్లో తన ఫెరారీ కాలిఫోర్నియా కారును నడిపేందుకు రతన్ టాటా ఇష్టపడతారు.
- జేఆర్డీ టాటా లాగే విమానయాన రంగం అంటే రతన్‌కు కూడా ఎంతో ఇష్టం. ఆయనకు పైలెట్ లైసెన్సు కూడా ఉంది. ఆయన అప్పుడప్పుడూ సంస్థ విమానాన్నినడుపుతుంటారు.
- సామాన్యులు, మధ్య తరగతి వారి కలలను నెరవేర్చేందుకు రూ.లక్షకే నానో కారును తీసుకొచ్చి సంచలనం సృష్టించారు.
- 25 ఏళ్ల వయసులో 1962లో టాటా గ్రూపులో రతన్ తన ప్రస్థానాన్ని ప్రారంభించారు.
- దేశం కోసం చేసిన సేవలకు గాను ఆయనకు పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అవార్డులు దక్కాయి. అలాగే సీఎన్ఎన్.ఐబీసీ అత్యున్నత భారత వ్యాపారవేత్తగానూ ఆయన పురస్కారం లభించింది.
సంస్థ నుంచి కార్లు మాత్రమే కాకుండా అందరికి చేరురువవ్వాలనే లక్ష్యంతోనూ రతన్ టాటా ముందుకు వెళుతున్నారు. అందుకే టాటా ఉప్పు సహా అనేక నిత్యావసర సరుకులను సైతం ఉత్పత్తి చేస్తున్నారు. విజయవంతమవుతూనే ఉన్నారు. ప్రస్తుతం సంస్థకు సమర్థుడైన వారసుడిని వెతికే పనిలోనూ ఉన్నారు.