Home /News /trending /

Ripped jeans: రిప్డ్ జీన్స్ ను మొట్టమొదటిసారి ధరించింది ఎవరో తెలుసా..? జీన్స్‌కు అసలు చిరుగులు ఎందుకు పెట్టారంటే..

Ripped jeans: రిప్డ్ జీన్స్ ను మొట్టమొదటిసారి ధరించింది ఎవరో తెలుసా..? జీన్స్‌కు అసలు చిరుగులు ఎందుకు పెట్టారంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అసలు జీన్స్ కు చిరుగులు ఎందుకు పెడతారు.? దాని అర్థమేంటి? ఈ ట్రెండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మొట్టమొదటిసారి చిరుగులు కలిగిన జీన్స్ ను ధరించి ట్రెండ్ సృష్టించింది ఎవరు?

తాజాగా బాగా చర్చకు వస్తున్న అంశం రిప్డ్ జీన్స్ (చిరిగిన, రంధ్రాలు ఉండే జీన్స్). యువతులు, మహిళలు చిరిగిపోయినట్టు ఉండే జీన్స్ ధరిస్తూ సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ ఇటీవల వ్యాఖ్యానించారు. పాశ్చాత్య దేశాలు మన సంస్కృతి సంప్రదాయాలపై ఆసక్తి చూపుతుంటే.. మనవాళ్లు మాత్రం ఫ్యాషన్ పేరుతో విపరీతమైన పోకడలకు అలవాటు పడుతున్నారని చెప్పారు. అప్పటి నుంచి రిప్డ్ జీన్స్‌పై చర్చలు మొదలయ్యాయి. చాలామంది తమ దుస్తులు తమ ఇష్టం అంటూ ట్విట్టర్ లో కామెంట్లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు జీన్స్‌కు కోతలు పెట్టాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? ఇది క్రమంగా ఫ్యాషన్‌గా ఎలా మారింది? వంటి వివరాలను తెలుసుకుందాం. జీన్స్‌పై అక్కడక్కడా దారాలు బయటకు వచ్చినట్టు కనిపించడం, కోతలు పెట్టడం, ఒక పొర దారాలు వేరే రంగులో ఉండటం.. వంటివి రిప్డ్ జీన్స్ ఫ్యాషన్‌లో భాగం. ప్రస్తుతం యువతీయువకులకు ఇష్టమైన డిజైన్లలో ఇవి ఒక భాగంగా ఉన్నాయి. మొదట్లో వీటిని చూసినవారు నవ్వుకునేవారు. కానీ ఇప్పుడు చాలామంది ఇలాంటి ఫ్యాషన్‌కు అలవాటుపడ్డారు. సెలబ్రిటీలు కూడా చిరిగిపోయిన జీన్స్‌ను ఎక్కువగా ధరిస్తున్నారు.

ఎవరు కనిపెట్టారు?
జీన్స్‌ను 1870ల్లోనే డిజైన్ చేశారు. లోబ్ స్ట్రాస్ అనే జర్మన్ వ్యాపారవేత్త జీన్స్‌ను మొదటిసారి డిజైన్ చేశారు. అప్పటి నుంచి అది అనేక మార్పులు, రీడిజైన్లతో కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. ఈ ప్యాంటును ముఖ్యంగా కార్మికుల కోసం రూపొందించారు. ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయనే ఉద్దేశంతో వారి కోసం ప్రత్యేకంగా వీటిని తయారు చేశారు. జీన్స్‌కు ఉండే గాఢమైన ఇండిగో రంగును భారతదేశం నుంచి వెలికితీసిన అద్దకం రంగుతోనే తయారు చేయడం విశేషం.
ఇది కూడా చదవండి: హైదరాబాద్.. రోడ్డు పక్కనే ఓ అట్టపెట్టె చుట్టూ కుక్కలు చేరి అరుపులు.. ఏముందా అని ఓపెన్ చేసి చూసిన వాళ్లందరికీ..

కోతలు ఎందుకు?
రిప్డ్ జీన్స్ గురించి 1970ల్లోనే మొదటిసారి వార్తలు వచ్చాయి. ఒక సామాజిక ఉద్యమంలో భాగంగా జీన్స్‌ను ఇలా చేశారు. సమాజంపై నెలకొన్న అసంతృప్తి, కోపానికి గుర్తుగా ఉద్యమకారులు జీన్స్‌ ప్యాంటులపై కోతలు పెట్టేవారు. ఆ తరువాత మడోన్నా వల్ల ఈ ట్రెండ్‌ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఒక సందర్భంలో ఆమె రిప్డ్ జీన్స్ వేసుకొని కనిపించింది. ఈ కొత్త డిజైన్‌ నచ్చిన అభిమానులు.. ఆమెను అనుసరించడం మొదలుపెట్టారు. మొదట్లో మడోన్నా అభిమానులు, అనుచరులు తమ జీన్స్ ప్యాంట్లను కత్తిరించుకునేవారు. ఆ తరువాత డెనిమ్ కంపెనీలు ఈ ట్రెండ్‌ను వ్యాపారంగా మార్చుకొని 'రిప్డ్ జీన్స్'ను పరిచయం చేశాయి. దీంతో.. కోపం, నిరసనల రాజకీయ వ్యక్తీకరణ అనేది కొన్ని సంవత్సరాలకు ఒక ఫ్యాషన్ ట్రెండ్‌గా మారింది.
ఇది కూడా చదవండి: ఆ రోడ్డు కింద ప్రతీ అడుగుకో శవం.. తవ్వితే బయటపడే ఎముకల గుట్టలు.. వెన్నులో వణుకుపుట్టించే రియల్ స్టోరీ ఇది..!

కొత్త పేరుతో పరిచయం
కొత్త మోడళ్లు రావడంతో అప్పట్లో రిప్డ్ జీన్స్‌పై ప్రజలకు మోజు తగ్గింది. మంకీ వాష్, బూట్ కట్, డబుల్ షేడ్ జీన్స్.. వంటి ఉత్పత్తులకు ఆదరణ లభించింది. 2010 వరకు కొత్త జీన్స్ మోడళ్లు మార్కెట్‌లోకి వస్తూనే ఉన్నాయి. ఆ తరువాత రిప్డ్ జీన్స్ కొత్తగా మార్కెట్లోకి వచ్చాయి. ప్రముఖ కంపెనీలు వీటిని 'డిస్ట్రెస్డ్' డెనిమ్‌గా రీబ్రాండ్ చేశాయి. ఫ్యాషన్ షోలలో వీటిని ప్రదర్శించి, మార్కెట్లోకి విడుదల చేశారు. కొత్త పేరు, డిజైన్‌తో మార్కెట్లోకి వచ్చిన 'డిస్ట్రెస్డ్' జీన్స్ కొత్త ట్రెండ్‌ను సృష్టించాయి.

లేజర్‌తో రంధ్రాలు
అప్పట్లో వీటి ధర కూడా ఎక్కువగానే ఉండేది. దీంతో ఎంతో డబ్బు ఖర్చుచేసి చిరిగిపోయిన జీన్స్ కొనడానికి బదులు.. పాత జీన్స్‌కు ఇంటివద్దే కోతలు పెట్టుకోవడం మంచిదని ప్రజలు ఎగతాళి చేసేవారు. అలాంటి అభిప్రాయం నుంచి ఇప్పుడు ట్రెండింగ్‌గా మారేంత వరకు చిరిగిన జీన్స్ ప్రయాణం సాగింది. ఫ్యాషన్‌లో భాగంగా జీన్స్‌ను కత్తిరించడానికి రెండు పద్ధతులు ఉన్నాయి. కొన్ని కంపెనీలు లేజర్ ద్వారా జీన్స్‌కు రంధ్రాలు చేస్తాయి. మరికొన్ని కంపెనీల్లో కార్మికులే ప్యాంట్లకు కోతలు పెడతారు. రిప్డ్ జీన్స్ ప్రత్యేకంగా కనిపించడానికి అధునాతన లేజర్ యంత్రాన్ని వాడతారు. లేజర్ లైట్ సాయంతో జీన్స్‌ను సున్నితంగా మండిస్తూ రంధ్రాలు వచ్చేలా చేస్తారు.
First published:

Tags: Crime news, Funny video, Trending videos, VIRAL NEWS, Viral Videos

తదుపరి వార్తలు