Home /News /trending /

Unusual birthday celebration: రోడ్డుకు పుట్టినరోజు వేడుకలు.. స్పెషల్ కేక్ కూడా.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Unusual birthday celebration: రోడ్డుకు పుట్టినరోజు వేడుకలు.. స్పెషల్ కేక్ కూడా.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

రోడ్డుకు పుట్టిన రోజు వేడుకలు చేస్తున్న యువతి

రోడ్డుకు పుట్టిన రోజు వేడుకలు చేస్తున్న యువతి

చేతిలో కేక్ పట్టుకొని, ఒక ప్రాంతంలో రోడ్డుపై కూర్చున్నట్టు ఫోటోల్లో కనిపిస్తోంది. ఆ రోడ్డు నిర్మాణంలో ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ ఫోటోలను ఆమె తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది.

ఈ రోజుల్లో పుట్టినరోజు వేడుకలు సర్వ సాధారణమయ్యాయి. ఒకప్పుడు తమకి ఇష్టమైన వ్యక్తుల పుట్టినరోజును మాత్రమే నిర్వహించేవారు. ఇప్పుడు కొంతమంది పెంపుడు జంతువుల పుట్టినరోజు వేడుకలను కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. కానీ అమెరికాలోని లూసియానాకు చెందిన ఓ యువతి వినూత్నమైన పుట్టినరోజు వేడుకలతో వార్తల్లో నిలుస్తోంది. తాను నివాసం ఉంటున్న వీధిలో రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించి సంవత్సరం అవుతున్న సందర్భంగా.. ఆ రోడ్డుకు బర్త్‌డే వేడుకలు నిర్వహించింది. ఇందుకు ప్రత్యేకంగా ఒక కేకును సైతం తయారు చేయించింది. ఆ కేకు కూడా గతుకుల రోడ్డును ప్రతిబింబించేలా ఉండటం విశేషం. సంవత్సరం నుంచి తమ రోడ్డు గురించి అధికారులు పట్టించుకోనందుకు నిరసనగా న్యూ ఓర్లీన్స్‌లోని లేక్ వ్యూ ప్రాంతానికి చెందిన నటాలీ నాక్విన్ హార్వే అనే యువతి ఈ అసాధారణమైన బర్త్ డే వేడుకలు నిర్వహించింది.

వీధికి పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన వార్త, దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి. నటాలీ చేతిలో కేక్ పట్టుకొని, ఒక ప్రాంతంలో రోడ్డుపై కూర్చున్నట్టు ఫోటోల్లో కనిపిస్తోంది. ఆ రోడ్డు నిర్మాణంలో ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ ఫోటోలను ఆమె తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేసింది. వీటికి నటాలీ ఒక క్యాప్షన్ కూడా పెట్టింది. ఒక సంవత్సరం క్రితం అధికారులు ఇక్కడి వీధిలో రోడ్డు పనులను ప్రారంభించారని, అవి ఇప్పటికీ పూర్తి కాలేదని రాసింది. గతవారం ఇక్కడికి దగ్గర్లో రోడ్డుపై పెద్ద గొయ్యి కూడా ఏర్పడిందని పోస్టులో తెలిపింది. సంవత్సరం తరువాత సగం వీధి ప్రయాణానికి అనువుగా లేకుండా మారిందని క్యాప్షన్లో పేర్కొంది.



కేక్ కూడా రోడ్డు పనులకు సంబంధించినట్లే ఉంది. యంత్రాలు, వర్కర్లు పనిచేస్తున్న గుర్తులు, గతుకుల రోడ్డు, స్టాప్ బోర్డులు కూడా కేకుపై చిత్రీకరించడం విశేషం. ఈ పోస్టుకు వేలల్లో లైక్స్ వస్తున్నాయి. నటాలీ ప్రయత్నాన్ని చాలామంది మెచ్చుకుంటున్నారు. రోడ్డుకు బర్త్‌డే నిర్వహించడం హాస్యాస్పదమని కొంతమంది కామెంట్లు పెడుతున్నారు. కొత్త పద్ధతిలో అధికారులకు సమస్య తీవ్రత అర్థమయ్యేలా చెప్పినందుకు ఆమెను అభినందిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డు పనులు పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
First published:

Tags: Funny video, Prank videos, Trending, Trending videos, VIRAL NEWS, Viral Videos

తదుపరి వార్తలు