హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Video viral: పరీక్షకు ముందు అమ్మాయిలకు 2 కిలో మీటర్ల పరుగు పందెం..వీడియో ఇదిగో..

Video viral: పరీక్షకు ముందు అమ్మాయిలకు 2 కిలో మీటర్ల పరుగు పందెం..వీడియో ఇదిగో..

(Photo:Youtube)

(Photo:Youtube)

Video viral: పరీక్షలు రాయడానికి బయల్దేరిన అమ్మాయిలకు అధికారులు పరుగు పందెం పెట్టారు. వేరే గత్యంతరం లేక రెండు కిలోమీటర్లు పరిగెత్తారు. అసలు ఏం జరిగిందో ఈ వీడియో చూడండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Bihar, India

చదువుకునే సమయంలో కష్టపడే స్టూడెంట్స్ ..చివరకు పరీక్షల సమయంలో కూడ పరుగు పందాల్లో పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఓ వైపు ఎగ్జామ్‌కి టైమ్ అవుతోంది. మరోవైపు రోడ్డు వాహనాలతో బ్లాక్ అయింది. అలాంటి సమయంలో ఇంటర్ ఎగ్జామ్(Inter exam)రాయడానికి వెళ్తున్న విద్యార్ధులు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు. రోడ్డుపై వెళ్తున్న వాళ్లు, వాహనదారులు విద్యార్ధులు పరుగులు పెడుతుంటూ చూసి తమ సెల్‌ఫోన్‌(Cell Phone)లలో రికార్డ్ చేసి సోషల్ మీడియా(Social media)లో పోస్ట్ చేయడంతో వైరల్ అవుతోంది. ఈసంఘటన బీహార్‌(Bihar)లోని కైమూర్‌(Kaimur)జిల్లాలో చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే.

ఎగ్జామ్‌ కోసం విద్యార్ధినుల పరుగు పందెం..

బీహార్‌లోని కైమూర్ జిల్లా మోహనియాలోని ఇంటర్ పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని అధికారులు బోర్డులు పెట్టారు. ఈపరిస్థితుల్లో ఎగ్జామ్ రాయడానికి బయల్దేరిన కొందరు స్టూడెంట్స్ ..రోడ్డుపై వస్తుండగా నేషనల్ హైవే2(NH2) లో చాందినీ చౌక్‌ సెంటర్‌లో కిలోమీటర్‌ మేర వాహనాలు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. తల్లిదండ్రులతో ఎగ్జామ్ సెంటర్‌కు బయల్దేరిన విద్యార్థినులు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. వాహనాలు కదిలితే వెళ్లవచ్చని కొంత సమయం వేచి చూశారు. రోడ్డు పూర్తిగా బ్లాక్ కావడం, ట్రాఫిక్ క్లియర్ చేయడానికి నేషనల్ హైవే అథారిటీ అధికారులు, మెహనియా పోలీసులు రాకపోవడంతో ఎగ్జామ్‌కి లేట్‌గా వెళ్తే బాలికలు ఎగ్జామ్‌లో ఫెయిల్ అవుతామనే భయంతో సుమారు 2 కిలోమీటర్లు పరుగెత్తుకుంటూ పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు.

వైరల్ అవుతున్న వీడియో ..

పరీక్షకు ఆలస్యంగా వెళితే ఎక్కడ ఫెయిల్ అవుతామనే భయంతో అమ్మాయిలు రోడ్లపై పరుగులు పెట్టడం చూసిన స్థానికులు, వాహనదారులు ఆశ్చర్యపోయారు. కొందరు ఆ దృశ్యాల్ని వీడియో తీశారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. అయితే గత వారం రోజులుగా నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతూనే ఉంది. దాన్ని చక్కదిద్దడానికి స్థానిక పోలీసులతో పాటు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు ప్రయత్నిస్తున్నారు.

Viral Photos: ఆ హోటల్‌లో పని చేసే వెయిటర్స్‌ 50భాషలు మాట్లాడతారు.. వామ్మో వాళ్లు అసలు మనుషులేనా

మధ్యాహ్నానికి ట్రాఫిక్ క్లియర్..

ఉదయం పరీక్షకు వెళ్లే విద్యార్ధులు ట్రాఫిక్ జామ్‌ కారణంగా పడిన ఇబ్బందులు చూసిన అధికారులు వెంటనే ఆ మార్గంలో ట్రాఫిక్ జామ్‌ కాకుండా చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం ఇంటర్‌ మీడియట్ సెకండ్ ఈయర్ ఇగ్జామ్ ఉండటంతో ఇలాంటి సమస్యే తలెత్తుతుందని గ్రహించి వాహనాల్ని రోడ్డుపై నిలవకుండా చర్యలు తీసుకున్నారు.

అధికారుల నిర్లక్ష్యం వల్లే..

స్థానికులు మాత్రం రాంగ్ రూట్లలో వాహనాలు రాకపోకలు సాగించడం వల్లే ట్రాఫిక్ జామ్ అవుతోందంటున్నారు. దీనిపై ఎన్‌హెచ్‌ఏఐ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని..కనీసం పిల్లల పరీక్షల సమయంలో కూడా ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలనే బాధ్యత లేదా అంటూ అధికారుల్ని ప్రశ్నించారు.

First published:

Tags: Bihar News, Students, Viral Video