INSULTING THE NATIONAL ANTHEM IN UTTAR PRADESH WENT VIDEO VIRAL ON SOCIAL MEDIA SNR
Video Viral : మంత్రులు హాజరైన సమావేశంలో జాతీయ గీతానికి అవమానం..వీడియో ఇదే
(Photo Credit:Youtube)
Video Viral: ఉత్తరప్రదేశ్‌లో జాతీయ గీతాన్ని అవమానించారు కొందరు నాయకులు. జడ్పీ మీటింగ్ ప్రారంభానికి ముందు వందేమాతర గీతాన్ని ఆలపించడం సంప్రదాయంగా వస్తోంది. శనివారం జరిగిన బోర్డ్ సమావేశంలో అందరూ నిల్చొని వందేమాతర గీతం ఆలపిస్తుంటే కొందరు ముస్లిం మహిళా వార్డు సభ్యులు వారి కుర్చిల్లోంచి నిలబడకుండా కూర్చున్న వీడియో వైరల్ అవుతోంది.
ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లో జాతీయ గీతాన్ని(National anthem)అవమానించారు కొందరు నేతలు. కేంద్ర సహాయమంత్రి, ఆ రాష్ట్ర సహాయ మంత్రి హాజరైన అధికారిక సమావేశంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో వార్త సంచలనంగా మారింది. వార్తే కాదు..జాతీయ గీతాన్ని అవమానపరచిన వ్యక్తులున్న వీడియో(Video) కూడా వైరల్ అవుతోంది. ముజాఫర్‌నగర్( Muzaffarnagar)జిల్లా కేంద్రంలో మున్సిపాలిటి బోర్డు సమావేశం(Municipality board meeting)జరిగింది. ఈసమావేశానికి కేంద్ర సహాయమంత్రి సంజీవ్ బల్యాన్(Sanjeev Balyan), యూపీ సహాయ మంత్రి కపిల్‌దేవ్ అగర్వాల్(Kapil Dev Agarwal)తో పాటు మున్సిపల్ చైర్మన్ అంజు అగర్వాల్ (Anju Agarwal)వార్డు సభ్యులు హాజరయ్యారు.
జాతీయ గీతాన్ని అవమానిస్తారా..
మున్సిపల్ బోర్డ్ మీటింగ్ ప్రారంభించడానికి ముందు జాతీయగీతం ఆలపించడం సంప్రదాయం. దాన్ని అమలు చేయాలని మున్సిపల్ చైర్మన్ అంజు అగర్వాల్ ఆదేశించడంతో వందేమాతరం ఆలపించారు. అయితే సభలోని సభ్యులు, నాయకులు, ప్రజాప్రతినిధులు అందరూ తమ తమ స్థానాల్లో నిల్చొని వందేమాతర గీతం ఆలపిస్తున్నారు. కాని వార్డు సభ్యుల్లో కొందరు ముస్లిం మహిళా వార్డు సభ్యులు బుర్ఖాలు వేసుకొని సీట్లలో కూర్చున్నారు. ఓ వైపు తోటి సభ్యులు వందేమాతర గీతం ఆలపిస్తుంటే కనీసం నిల్చొవాలన్న సభా మర్యాదను విస్మరించడంతో సమావేశాలకు హాజరైన వ్యక్తుల్లో ఒకరు ఆ దృశ్యాన్ని తన సెల్ఫోన్లో వీడియో తీశాడు. అంతే దాంతో ఈ వార్త కాస్త వైరల్ అయింది. వీడియో ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది.
వైరల్ అవుతున్న వీడియో..
ఈ వార్త విస్తృతంగా వైరల్ కావడంతో మున్సిపల్ ఛైర్మెన్ వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అయితే ప్రస్తుతం రాష్ట్ర సహాయ మంత్రి హోదాలో ఉన్న కపిల్‌దేవ్ అగర్వాల్ ఈ ఘటనను ఖండించారు. తాను మున్సిపల్ సమావేశానికి వచ్చిన సమయంలో జాతీయ గీతం ఆలపించమంటే తాను కూడా లేచి నిల్చున్నానని కాని కొందరు ముస్లిం మహిళా సభ్యులు నిలబడక పోవడం చూస్తుంటే వందేమాతర గీతాన్ని అవమానించినట్లుగానే భావిస్తున్నట్లు అభిప్రాయపడ్డారు.
వందేమాతరం ఏ మతం కాదు..
సహాయ మంత్రి కపిల్‌దేవ్ అగర్వాల్ మాట్లాడుతూ సమాజంలో హిందూ, ముస్లిం అంతా సమానమేననని ఎవరైనా కుంచిత స్వభావంతో ఇలాంటి పొరపాటు చేసి ఉంటే వాళ్ల విధానాలు మార్చుకోవాలని హితవు పలికారు. సభలో నిల్చొని వందేమాతరం ఆలపించిన అందరికి కృతజ్ఞతలు తెలిపారు. వందేమాతరం మన జాతీయ గీతమని దాన్ని గౌరవించడం అందరి బాధ్యత అని గుర్తు చేశారు. ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు కారణంగానే సమాజంలో హెచ్చు తగ్గులు వస్తున్నాయని...ఇకపై అలాంటివి రాకుండా సభలో ప్రతి ఒక్కరూ నిల్చొని జాతీయ గీతాన్ని ఆలపించాలని సభ్యులను అభ్యర్దించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.