Viral News: కరోనా దెబ్బతో.. ఒంటరిగా నెల రోజులు పడవలోనే.. ఏకంగా 6వేల కి.మీ ప్రయాణం..

ప్రతీకాత్మక చిత్రం (image: IRCTC)

Viral News: కరోనా నేపథ్యంలో విమాన ప్రయాణాలను రద్దు చేయడంతో ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి సముద్రయానం ద్వారా ఇంటికి చేరుకున్నాడు. నౌకలో దాదాపు నెల రోజుల పాటు ఒంటరిగా 6వేల కి.మీ. ప్రయాణించాడు.

  • Share this:
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎలా అతలాకుతలం చేసిందో అందరికీ తెలుసు. ఎందరి జీవితాలనో మహమ్మారి తలకిందులు చేసింది. విదేశాల్లో చిక్కుకుపోయి స్వదేశానికి తిరిగి రాలేక, కుటుంబ సభ్యులను కలుసుకోలేక చాలామంది ఇబ్బందులకు గురయ్యారు. కొన్ని నెలల పాటు కుటుంబానికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి చాలామందికి ఎదురైంది. లాక్ డౌన్ సమయంలో విదేశాల్లో చిక్కుకున్న వాళ్లు, టూరిస్టుల పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా విదేశాల్లో చిక్కుకుపోయిన ఒక వ్యక్తి నెల రోజుల పాటు.. సుమారు 6,000 కి.మీ దూరం పడవ నడుపుకుంటూ ఇంటికి చేరుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానికులు ఆశ్చర్యపోతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. పాల్ స్ట్రాట్ ఫోల్డ్ అనే ఆస్ట్రేలియన్ కరోనా లాక్‌డౌన్ కారణంగా తహితి అనే ఫ్రెంచ్‌ ఐలాండ్‌లో చిక్కుకుపోయాడు. సొంత దేశానికి విమాన ప్రయాణాలు నిలిచిపోవడంతో అతడికి ఏం చేయాలో అర్థం కాలేదు. తన రెసిడెన్సీ వీసాను రెన్యువల్ చేసుకోవడం కోసం ఆస్ట్రేలియాకు అర్జెంట్‌గా వెళ్లాల్సి ఉన్నా, అందుకు మార్గాలు మూసుకుపోయాయి. దీంతో పాల్‌కు ఓ ఐడియా తట్టింది. సముద్ర మార్గం ద్వారా తహితి నుంచి ఆస్ట్రేలియా వెళ్లాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఇందుకు ఒక పడవ తీసుకొని దక్షిణ పసిఫిక్ సముద్రంలో ఒంటరిగా 6000 కిలోమీటర్లు ప్రయాణించాలని భావించాడు. ఈ క్రమంలో నెల రోజుల పాటు పడవ నడిపి చివరికి ఆస్ట్రేలియా చేరుకున్నాడు.

Viral video: బాలుడి తలపై గిన్నె పెట్టి హెయిర్ కటింగ్.. వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు!

41 ఏళ్ల పాల్.. ఒక ప్రొఫెషనల్ సేలర్. పడవ నడపడంలో అతడికి ఎంతో అనుభవం ఉంది. అయినా అతడు ఇప్పటి వరకు 6000 కిలోమీటర్లు ఏకధాటిగా పడవ నడపలేదు. ఇలా సాహస ప్రయాణం కూడా చేయలేదు. కానీ.. కరోనా పరిస్థితుల వల్ల ఈ ప్రయాణం చేయాల్సి వచ్చిందని చెబుతున్నాడు. సముద్రం మధ్యలో తన పడవ చిక్కుకుపోతే.. గాలులు, అలలకు అది ఎక్కడ మునిగిపోతుందోనని భయపడుతూ గడిపాడు పాల్. చివరకు జులై 3న ఆస్ట్రేలియాలోని క్వీన్స్ లాండ్‌లో ఉన్న సౌత్ పోర్ట్‌కు చేరుకున్నాడు.

Viral Video: పెళ్లి వేడుకలో వధువుకు వినూత్న ఆహ్వానం.. వైరల్ అవుతున్న  వీడియో

గత ఫిబ్రవరి నుంచి ఆస్ట్రేలియాకు వచ్చే అంతర్జాతీయ విమానాలను ఆపేశారు. ఆ సమయంలో ఆస్ట్రేలియా వ్యాప్తంగా కోవిడ్ విజృంభించడంతో లాక్ డౌన్ విధించారు. దీంతో పాటు అన్ని ఇంటర్నేషనల్ విమానాలను ఆస్ట్రేలియా ప్రభుత్వం రద్దు చేసింది. ఆ సమయంలో యూకే కోవిడ్ స్ట్రెయిన్ ఆ దేశాన్ని భయబ్రాంతులకు గురి చేసింది. దీంతో తప్పని పరిస్థితుల్లో ఆస్ట్రేలియా మొత్తం స్తంభించిపోయింది.

ఆ మూడు రాత్రులూ వధూవరులు మూత్రం పోయకుండానే శోభనం చేసుకోవాలంట.

అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగానూ కరోనా సెకండ్ వేవ్, మ్యుటేషన్ లాంటి కొత్త వైరస్ భయపెట్టింది. దీంతో ఫ్రాన్స్ లోనూ లాక్ డౌన్ విధించారు. అప్పుడే పాల్‌కు అర్జెంట్ గా వెళ్లాల్సి రావడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఈ సాహసానికి ఒడిగట్టాడు.
Published by:Shiva Kumar Addula
First published: