Viral News: ఫ్రీ వైఫై అంటూ కస్టమర్లకు దిమ్మతిరిగే షాక్ ఇస్తోన్న రెస్టారెంట్.. పాస్‌వర్డ్‌గా ఏం పెట్టారంటే..

ప్రతీకాత్మక చిత్రం

కస్టమర్ల సంఖ్య పెంచుకునేందుకు ఉచితం అనే మార్కెటింగ్ స్ట్రాటజీ బాగా పనిచేస్తుంది. అందుకే కస్టమర్లను ఆకట్టుకునేందుకు చాలా రెస్టారెంట్లు, హోటళ్లు వైఫై ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉచితంగా అందిస్తుంటాయి. కస్టమర్లు సైతం ఫ్రీగా వైఫై సేవలు అందించే రెస్టారెంట్లకే ఎక్కువగా వెళుతుంటారు.

  • Share this:
కస్టమర్ల సంఖ్య పెంచుకునేందుకు ఉచితం అనే మార్కెటింగ్ స్ట్రాటజీ బాగా పనిచేస్తుంది. అందుకే కస్టమర్లను ఆకట్టుకునేందుకు చాలా రెస్టారెంట్లు, హోటళ్లు వైఫై ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉచితంగా అందిస్తుంటాయి. కస్టమర్లు సైతం ఫ్రీగా వైఫై సేవలు అందించే రెస్టారెంట్లకే ఎక్కువగా వెళుతుంటారు. అయితే ఒక అమెరికన్ థాయ్‌ రెస్టారెంట్ యాజమాన్యం మాత్రం వైఫై పాస్‌వర్డ్‌ను అనూహ్య రీతిలో సెటప్ చేసుకుంది. ఒక గణిత సూత్రాన్ని పరిష్కరిస్తే వచ్చేదే తమ వైఫై పాస్‌వర్డ్‌ అంటూ ఒక బోర్డు ఏర్పాటు చేసింది. ఇది చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో ఉన్నయాయాస్ థాయ్‌ రెస్టారెంట్‌కు ఒక కస్టమర్ వెళ్ళాడు. ఇంటర్నెట్‌ యూజ్ చేసేందుకు పాస్‌వర్డ్‌ కోసం ప్రయత్నించాడు. ఈక్రమంలో పాస్వర్డ్ కోసం ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఆన్సర్ కనిపెట్టాలని తెలుసుకుని షాక్ అయ్యాడు. దీంతో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేసి ఆన్సర్ ఏంటో చెప్పాల్సిందిగా రెడిట్‌లో ఓ ఫొటో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వైరల్ మ్యాథ్స్ ఈక్వేషన్ పాస్‌వర్డ్‌ ఫొటో నెట్టింట వైరల్ గా మారింది.



నిజానికి థాయ్‌ రెస్టారెంట్ ఈ తెలివైన ఆలోచనను 2016లోనే చేసింది. అయితే దీనికి సంబంధించిన ఫొటో వైరల్‌గా మారడంతో, మళ్లీ ఇది చర్చనీయాంశమైంది. దీన్ని పరిష్కరించేందుకు ప్రస్తుతం నెటిజన్లు తెగ కష్టపడి పోతున్నారు. ఈ పాస్‌వర్డ్‌ ఫోటోను 'ఆడ్ స్టఫ్ మ్యాగజైన్' అక్టోబర్ 27, 2016న ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ పాత ఫోటో ఇప్పుడు ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమై నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఇది కూడా చదవండి: Married Woman: సీఎంకు ఫేస్‌బుక్‌లో ‘Please Help Me, Sir’ అని పోస్ట్ పెట్టి వివాహిత ఆత్మహత్య..

యాయాస్ అనే ఈ థాయ్‌ రెస్టారెంట్ ఓనర్ తమ ఫ్రీ వైఫై వాడుకునే కస్టమర్ల సంఖ్య తగ్గించేందుకు కష్టమైన పాస్‌వర్డ్‌ సెటప్ చేశారని తెలుస్తోంది. ఈ పాస్‌వర్డ్‌ బాగా మాథ్స్ వచ్చిన కస్టమర్లు తప్ప మిగతా వారు కనిపెట్టలేరు. ఫుడ్ ఆర్డర్ చేయకుండా.. ఉచితంగా వైఫై వాడే వారి సంఖ్య తగ్గించేందుకు ఓనర్ పూర్తిగా వైఫై కనెక్షన్ తీసేయకుండా.. తెలివిగా గణిత సూత్రం పెట్టేశారు. అయితే ప్రస్తుతం ఈ రెస్టారెంట్ యాజమాన్యం ఆలోచన అందరినీ ఫిదా చేస్తోంది.
Published by:Sambasiva Reddy
First published: