Viral video : కొద్ది మంది ఫాలోయర్స్ ఉంటే చాలు.. తమను తాము సోషల్ మీడియా ఇన్ఫ్లూయెర్స్గా చెప్పుకుంటూ.. లేనిపోని హడావుడి చేస్తుంటారు కొందరు. ఆమధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనే ఆప్షన్ తెచ్చింది. దాని ద్వారా కొన్ని సెకండ్లు మాత్రమే ఉండే వీడియోలను చేసి అప్లోడ్ చేసుకోమని చెప్పింది. ఆ వీడియోల కోసం కొంతమంది అడ్డమైన పనులు చేస్తున్నారు. మానవత్వాన్ని గాలికొదిలేసి.. తమ రీల్ తయారైతే చాలు అనుకుంటున్నారు. అలా చేసిన ఓ యువతికి బాగా గడ్డిపెట్టారు నెటిజన్లు.
ఏం చేసింది?
ఆమె పేరు కిరణ్ కాజల్ (Kiran Kajal). రీల్ కోసం ఓ ఊర కుక్కకు బిస్కెట్ పెడుతున్నట్లు నటించింది. ఆ అమాయక కుక్క నిజంగానే తనకు ఏదో పెడుతోందనుకొని ఆమె దగ్గరకు వచ్చింది. వెంటనే ఆ మూగజీవిని కాలితో తన్నింది. దాంతో భయపడిన ఆ కుక్క.. అక్కడి నుంచి పారిపోయింది. ఏదో ఘనకార్యం సాధించినట్లు కాజల్ తెగ నవ్వుతూ ఉండగా.. రీల్ ముగిసింది. ఈ రీల్‌ని తన ఇన్‌స్టా అకౌంట్లో పోస్ట్ చెయ్యగా.. ఓ నెటిజన్ దాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేసి.. ఎంత అమానవీయ ఘటన అంటూ తిట్టిపోశారు.
ఆ ట్వీట్ వీడియో చూసిన నెటిజన్లు సైతం కాజల్‌పై తీవ్రంగా ట్రోల్స్ చేశారు. ఆ తర్వాత ట్వీట్ వీడియోని ట్విట్టర్ డిలీట్ చేసింది. ఆ వీడియో.. రూల్స్‌కి వ్యతిరేకంగా ఉండటం వల్ల తొలగించినట్లు తెలిపింది.
ఆ ట్వీట్ ఇక్కడ చూడండి.
What a horrible "IN(HuMaN)" Will we stoop so LOW for Self Aggrandisement & Likes/ Followers? What are we teaching the youth& children ? @RobRobbEdwards @Lin11W @julie_dutto @minsquish @LiveByInstinct @BhavreenMK @avc_201 @Maco125198161 @DarPallavi @rupunkel @SENTHILSSK1982 https://t.co/3Ws8mbjB1f
— tarana singh (@tarana2510) November 30, 2022
నెటిజన్ల ఆగ్రహాన్ని చూసిన కిరణ్ కాజల్ వెంటనే తన ఇన్‌స్టా నుంచి ఆ వీడియోని డిలీట్ చేసింది. మరో వీడియో పోస్ట్ చేసి.. అందులో క్షమాపణలు తెలిపింది. తనకు జంతువులూ, పక్షులంటే ఇష్టమనీ.. ఆ కుక్క తనపై దాడి చేస్తుందనే భయంతోనే కాలితో తన్నానని తన చర్యను సమర్థించుకుంది.
ఆ వీడియో ఇక్కడ చూడండి.
View this post on Instagram
తప్పు చేసింది చాలక దాన్ని సమర్థించుకోవడమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. కుక్కను కావాలనే కాలితో తన్నినట్లు వీడియోలో ఉందనీ.. భయంతో తన్నినట్లు లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా ఇన్‌స్టా రీల్ కోసం చేసిన చెత్తపనితో ఆమెపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Trending, Trending video, Viral, Viral Video